ఆంద్ర ఆడపడుచు అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు... అక్కడ లైఫ్ అంటే అంత సులభం కాదు...

Header Banner

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు... అక్కడ లైఫ్ అంటే అంత సులభం కాదు...

  Thu Jul 16, 2020 13:37        Rachanalu (రచనలు), U S A

మెుదటిసారి చికాగోలో ఉన్నప్పుడు మా కిరణ్ ఫ్రెండ్ అశ్విన్ ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఎయిర్ పోర్ట్ లో వాడు అమెరికా  MS చేయడానికి వచ్చేటప్పుడు చాలా మంది ఏడవడం చూసి అక్క ఎలా వెళ్ళిందో అనుకున్నాడట. ఆ మాటే చెప్పి నీకు చాలా ధైర్యమక్కా అని అంటూ, అప్పుడప్పుడూ మాట్లాడుతుండేవాడు. అశ్విన్ కిరణ్ అమెరికాలో MS చేయడానికి హెల్ప్ చేసాడు ప్రాసెసింగ్, యూనివర్శిటీ సెలక్షన్ వగైరాలలో.

నేను రామస్వామి గారి దగ్గరకు వచ్చేసరికి కిరణ్ కి ఓ సెమిస్టర్ అయ్యింది. హాలిడేస్ లో ఎక్కడో మెాటల్ లో క్లీనింగ్ జాబ్ లో చేరాడు. అమెరికాలో మన ఇండియన్ స్టూడెంట్స్ ఫ్రీ టైమ్ లో ఇలా జాబ్ లు చేసుకోవడం మామూలే. 

ఇక నా విషయానికి వస్తే..రామస్వామి గారు ఇండియన్ గ్రాసరిస్టోర్, చైనీస్ ఇండియన్ రెస్టారెంట్ కాకుండా బిగ్ ఆపిల్ బేగిల్స్ అని అమెరికన్ ఫుడ్ స్టోర్ ఓ నార్త్ ఇండియన్ దగ్గర కొన్నారు. దానిలో అంతకు ముందు వర్క్ చేసేవాళ్ళే ఉన్నారు. ప్రకాష్ అన్నాయన త్వరలో మానేస్తానన్నాడట.

ఇండియన్ రెస్టారెంట్లో వెంకటేశ్వరరావు, శేషయ్య, విక్రమ్ అనే నార్త్ ఇండియన్ ఉండేవారు. బేగిల్స్ షాప్ పొద్దున 6 నుండి మధ్యాహ్నం 2 వరకు ఉండేది. నేను, నాతోపాటు వినోద్ అని తను ఇంజనీరింగ్ చేసి H1B వీసాతో వచ్చినవాడే.

సాఫ్ట్ వేర్ జాబ్స్ రెసిషన్ లో ఈ జాబ్ చేయక తప్పలేదు తనకి కూడా. ఇలా చాలామంది ఈ విధమైన చాలా రకాల జాబ్స్ చేస్తున్నవాళ్ళే. వినోద్ వెంకటేశ్వరరావు తోడల్లుడు. ప్రకాష్, శేషయ్య, వెంకటేశ్వరరావు, శరత్ గారు వీళ్ళంతా ఫ్రెండ్స్. నాకసలు అమెరికన్ ఫుడ్ గురించి ఏమీ తెలియదు. ప్రకాష్ 6 నుండి 9 వరకు ఉండేవారనుకుంటా.

ప్రకాష్ నాకు వర్క్ ఏం నేర్పించేవారు కాదు, నేను వినోద్ కి పోటి వస్తాననేమెా. కాష్ కౌంటర్ దగ్గర ఉండేదాన్ని. ప్రకాష్ నా మీద సెటైర్లు వేసేవారు. కాష్ కౌంటర్ దగ్గర వుంటే వర్క్ రాదని. నేర్పించనప్పుడు వస్తే, రాకపోతే నీకెందుకులే అని మనసులో అనుకుని ఊరుకునేదాన్ని. నాకేం రాదని మళ్ళీ అందరికి చెప్పేవాడు.

మెక్సికన్ అమ్మాయి, వాళ్ళ అన్నయ్య మాతోపాటుగా వర్క్ చేసేవాళ్ళు. ఆ అమ్మాయి దగ్గర వర్క్ నేర్చుకునేదాన్ని. తను ప్రెగ్నెంట్ అప్పుడు. కొన్ని రోజులలో వర్క్ మానేస్తుంది. వాళ్ళ అన్నయ్య బేగిల్స్ చేసి, బేక్ చేసి మార్నింగ్ కొన్ని ఆర్డర్స్ ఇవ్వాల్సినవి ఇచ్చేసి వెళిపోతాడు. సిట్టింగ్, టేక్ అవుట్ ఆర్డర్స్ మిగతా వాళ్ళందం చూసుకోవాలి.

10,12 రకాల బేగిల్స్, 7, 8 రకాల చీజ్ లు చేసి ఆర్డర్ ప్రకారం ఎవరికి కావాల్సింది వారికి ఇవ్వాలి. షాప్ క్లోజ్ చేసేటప్పుడు మిగిలిన బేగిల్స్ డస్ట్బిన్ లో పడేసి, షాప్ క్లీన్ చేసి, కౌంటర్ క్లోజ్ చేయాలి. ఇది బేగిల్స్ షాప్ లో పని. 

ఓ వారం అయ్యాక ప్రకాష్ మానేసాడు. వినోద్, నేను, మెక్సికన్ అమ్మాయి చూసుకునేవారం. వినోద్, నేను క్లోజింగ్ వరకు ఉండేవారం.

కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరు కూడా లిమిటెడ్ అవర్స్ చేసి వెళిపోయేవారు. నాకు వర్క్ రాదని ప్రకాష్ చెప్పడంతో, రామస్వామి గారు పొద్దున్నే నన్ను షాప్ లో డ్రాప్ చేసి కాసేపు నేను కష్టమర్స్ తో ఎలా డీల్ చేస్తున్నానో చూసేవారు. మధ్యాహ్నం బేగిల్స్ లో వర్క్ అయ్యాక, భారత్ మేళా ఇండియన్ గ్రాసరిస్టోర్ లో సాయంత్రం వరకు ఉండేదాన్ని. తర్వాత సాయంత్రం చైనీస్ ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళేదాన్ని. ఇలా రోజు పొద్దున్నే 6 నుండి నైట్ 9 వరకు వీక్ డేస్ లో, వీకెండ్స్ 11, 12 వరకు వర్క్ ఉండేది. 

AMSOL కంపెనీ H1B పేపర్స్ వచ్చాయి. మా వారికి వీసా పేపర్స్ పంపాలంటే ఏం కావాలని AMSOL లో వీసా పేపర్స్ వర్క్ చూసే బాల ను వివరాలను అడిగితే మీ H1B వీసా పేపర్స్ తో కంపెనీ నుండి ఓ లెటర్ చాలండి, బాంక్ స్టేట్మెంట్స్, మీ పే చెక్స్, మారేజ్ సర్టిఫికేట్, పెళ్ళి ఫోటోలు కొన్ని పంపండి, సరిపోతాయి అన్నారు. రామస్వామి గారు ఎకౌంట్ లో డబ్బులు వేస్తే శరత్ గారు బాంక్ స్టేట్మెంట్ తీసుకోవడంలో హెల్ప్ చేసారు.

మా పెళ్ళి సంతకాల  పెళ్ళిలా జరిగింది. ఆ ఫోటోలు, పేపర్స్ అన్నీ తీసుకుని మా వారు వీసా స్టాంపిగ్ కి వెళితే, ఎంగేజ్మెంట్ ఫోటోలు కాదు, పెళ్ళి ఫోటోలు తీసుకురండి అన్నారట. ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు

మళ్ళీ కలుద్దాం..

గమనిక: ఔత్సాహిక ప్రవాసులకు గొప్ప అవకాశము. మీ విదేశీ ప్రయాణాలు, లేదా అక్కడ మీ అనుభవాలు, మీ ముచ్చట్లు, మీరు ఎదుర్కున్న ఇబ్బందులు లేదా సంతోషకర విషయలు... ఏదైనా కాని మీరు అందరితో పంచుకోవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలశ్యం... వెంటనే మాకు ఈమెయిలు చేయండి. మేము వాటిని ఆంధ్ర ప్రవాసి లో ప్రచురిస్తాము.  

మా మెయిల్ అడ్రస్: andhrapravasi@gmail.com or

andhrapravasi@andhrapravasi.com

 

ముందు వారాల లింకులు

ఆంద్ర ఆడపడుచు అమెరికాకు వెళ్ళింది సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం... ఆర్ధిక మాన్యం తో చివరికి రెస్టారెంట్ లో అంట్లు, బాత్ రూమ్ క్లీనింగ్... 17

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో జీతం ఎకోట్టిన యజమానిపై కేసు... డబ్బు దండగ, ఫలితం సూన్యం... 16

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి... ఘటనకు సాక్షి... 15  

ఆంద్ర ఆడపడుచు ఆ రోజుల్లో అమెరికాలో ఈమెయిలు చేయడానికి ఎన్ని కస్టాల పడాల్సి వచ్చేదో... HIB కి ఎన్ని తిప్పలో... 14

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో H1B విసా కోసం వెతుకులాట... సరైన ఉద్యోగం దొరక్క తాత్కాలికం గా ఆయా గా... అమెరికా వెంకటేశ్వర స్వామి గుళ్ళో... 13

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం లో ఇబ్బందులు... జీతం కుడా ఇవ్వకుండా పని చేపించుకునే యాజమాన్యం... రాజీనామా... మరో ఉద్యోగ వేట... ఎన్ని ఎబ్బందులో... 12

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం అనుభవాలు... అప్పట్లో టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ లు రేట్లు ఎలా ఉండేవో తెలిస్తే... 11

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం... సబ్జెక్టు ఉంది కాని ప్రాక్టికల్ లేదు... ఉదోగం లో ఎలా నెట్టుకు వచ్చిందో... 10

 ఆంద్ర ఆడపడుచు కొత్త ఉద్యోగ లో చేరడం కోసం మరో సిటీకి ప్రయాణం... ఫ్లైట్ డిలే తో 3 కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్... మూడు ఎయిర్ పోర్టులలో నిరీక్షణలో ఏమి జరిగిందంటే... 9

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం కోసం కొత్త కోర్సుల  ట్రైనింగ్... అమెరికా ఇంగ్లిషు యాస కోసం కుకిటులు... 8

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగ అన్వేషణ లో... అక్కడ ఎన్ని కష్టాలో ఉద్యోగం కోసం... జెమ్ షో అంటే ఏమిటి? - 7

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో... థాంక్స్ గివింగ్ రోజు జరిగిన సంఘటన... షాపింగ్ కుడా కష్టమై పోయింది... 6

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా... 5

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా? 4

ఆంద్ర ఆడపడుచు మొదటి సారి విమానం లో అమెరికా ప్రయాణం... ఇబ్బందులు ఎలా ఎదుర్కుంది ఒంటరిగా... స్వ-గత అనుభవాలు... 3

ఆంద్ర ఆడపడుచు అమెరికా విసా కోసం చదువుల ట్రైనింగ్, ప్రయాణం కోసం ఏర్పాట్లు సర్దుకోవతటాలు ... ఆసక్తికరంగా... 2

సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తెలుగు ఆడపడుచు... భూతల స్వర్గం అమెరికా వెళ్ళాలనే పట్టుదల... ఏమైది చివరకు... 1

రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...


   andhra--women-in-America