ఆంధ్ర ఆడపడుచు అమెరికాలోని డెట్రాయిట్ లో కళ్ళజోళ్ళ షాప్ లో ఉద్యోగం రావడం పోవడం... మళ్లి హంట్స్విల్ కి ప్రయాణం...
Sat Sep 05, 2020 18:49 U S A, Rachanalu (రచనలు)డెట్రాయిట్ లో శ్రీనివాసరెడ్డి వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళు ముగ్గురుంటున్నారు. చంద్రశేఖర్, ఇంకో అతను. వీళ్ళిద్దరు మాల్ లో సెల్ఫోన్ షాప్లో పని చేసేవారు. నాకు ఏదైనా జాబ్ చూడమని చెప్పాను. బోలెడు ఫ్రూట్స్ అవి తెచ్చి ఫ్రిజ్ లో పెట్టి తినమనేవారు. వాళ్ళతో ఉన్న ఇరవై రోజులు చాలా బాగా చూసుకున్నారు. నేను వేరే జాబ్ కి ట్రై చేసుకున్నాను. అంతకు ముందు మాల్ లో వచ్చిన జాబ్ కి రమ్మన్నారు. అది ఉష చేసే చోటనే. మధు వాళ్ళు కాస్త దూరంలో.
చికాగోలో ఉన్నప్పుడు మా ఆయనకు తెలిసిన మా ఊరి దగ్గరలోని పిల్లలు విష్ణు, శ్రీను. శ్రీనుతో ఎప్పుడన్నా మాట్లాడేదాన్ని. ఈయన ఇండియా వెళ్ళిన తర్వాత ఓ రోజు విష్ణుకి ఫోన్ చేసి మాట్లాడాను. అప్పటి నుండి ఇంట్లో పిల్లాడిలా ఉండేవాడు నాతో. నేను డెట్రాయిట్ వెళుతున్నానని చెప్తే తన ఫ్రెండ్ సింధు అక్కడే ఉంటోందని, వెళ్ళి కలవమని చెప్పాడు. డెట్రాయిట్ వెళ్ళిన కొత్తలో ఓరోజు వెళ్ళి వచ్చాను. తర్వాత నేను కెంటకీ లోని ఫ్లోరెన్స్ లో జాబ్ కి వెళ్ళాలని చెప్తే సింధు, వాళ్ళాయన ఫ్లోరెన్స్ కి కార్ లో పంపిస్తామని చెప్పారు.
ఓ రెండు రోజులు సింధు వాళ్ళింట్లో ఉండి, ఫ్లోరెన్స్ వెళ్ళాము. నేను మధు వాళ్ళున్న సిన్సినాటి వెళ్ళలేదు. ఏదో మనకు హెల్ప్ చేయడానికి సింధు వాళ్ళు వస్తే, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని. కాని మధు వాళ్ళకి ఎందుకో కోపం వచ్చి మాట్లాడటం మానేసారు. సింధు వాళ్ళు ఉన్నప్పుడే అపార్ట్మెంట్ వెదికాము. దొరకలేదు. మాల్ కి వెళ్ళడానికి బస్ ఫెసిలిటి చూసుకోవాలి కదా. తర్వాత అపార్ట్మెంట్ దొరికింది. నేను, ఉష అవసరాలకి కావాల్సినవన్నీ కొనుక్కున్నాము. మెుత్తానికి ఫ్లోరెన్స్ మాల్ లో కళ్ళజోడు షాప్ లో నా మరో ఉద్యోగం మెుదలైంది. పొద్దున 10 కి మాల్ లో షాప్ ఓపెన్ చేస్తే రాత్రి 9 కి క్లోజ్ చేయాలి. పొద్దుటే వంట చేసుకుని లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. నైట్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయేది. 10,10.30 అయిపోయేది. బస్ లో అప్పుడప్పుడూ కొందరు నల్లవాళ్ళని చూసి మేం సరదాగా నవ్వుకునేవాళ్ళం. రకరకాల హెయిర్ స్టైల్స్ తో వింతగా అనిపించేవారు నాకయితే. ఓ రకమయిన వాసన వచ్చేది. నాకసలే వాసనలు చాలా త్వరగా తెలుస్తాయి.
వేసిన హెయిర్ స్టైల్ వారం, పది రోజుల వరకు తీయరట. ఆ వాసన వెనుక కత అదన్నమాట. ఉష కార్ట్ (కళ్ళజోళ్ళ షాప్)పై ఫ్లోర్లో, నాది కింది ఫ్లోర్లో. ఒక్కోరోజు నాకు సేల్ తక్కువ ఉంటే ఉష హెల్ప్ చేసేది. అలా ఇద్దరం నెట్టుకొని వచ్చేవారం. శ్రీను నిమ్మకాయ పచ్చడి, ఇంకో పచ్చడి పార్సిల్ చేసాడు నాకోసమని.అప్పటికే ఆరోగ్యం అస్సలు బాలేదు. రాత్రి పూట విపరీతమైన ఒళ్ళు నొప్పులుండేవి. మా ఉష కాస్త గట్టిగానే గురక పెడుతుండేది. నాకు పుట్టబోయేది అమ్మాయేనని మేము పని చేసే మాల్ లోనే షాపింగ్ చేసి ఓ రెండు డ్రసెస్ పాపకని తీసుకున్నాను. అప్పటికింకా స్కానింగ్ చేయించుకోలేదు. అమెరికాలో 20 వారాలకే అబ్బాయెా, అమ్మాయెా చెప్తారు.
రోనెక్ లో డాక్టర్ దగ్గరకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడా చూపించుకోలేదు. ఫ్లోరెన్స్ లో వెదుక్కుని డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. అబ్బాయెా, అమ్మాయెా చెప్తారని. ఆ డాక్టర్ స్కాన్ చేయకుండానే హార్ట్ బీట్ చూసి అబ్బాయని చెప్పింది. స్కాన్ కి డేట్ ఇచ్చారు. ఆరోజు వెళితే స్కాన్ చేసి అబ్బాయంది సిస్టర్. మరోసారి చెక్ చేయమన్నాను. తను నవ్వి డాక్టర్ ముందే చెప్పారు కదా, హండ్రెడ్ పర్సంట్ అబ్బాయేనంది. జనరల్ టెస్ట్లన్నీ చేస్తే షుగర్ ఎక్కువగా ఉందని వచ్చింది. మరోరోజు ఫోర్ అవర్ షుగర్ టెస్ట్ చేయాలి. పొద్దుటే ఏం తినకుండా, తాగకుండా రమ్మని చెప్పారు.
బాగ్ లో ఓ ఆపిల్, వాటర్ బాటిల్ పెట్టుకుని 2 బస్ లు మారి హాస్పిటల్ కి వెళ్ళి ఫోర్ అవర్ షుగర్ టెస్ట్ చేయించుకుని బస్ మారడానికి ఇంక ఓపిక చాల్లేదు. రెండో బస్ ఎలా ఎక్కానో తెలియదు. బాగ్ లో వాటర్ బాటిల్ తీసుకునే ఓపిక కూడా లేదు. అయినా మెల్లగా వాటర్ తాగాక కాస్త ఓపిక వచ్చింది. మా అపార్ట్మెంట్ దగ్గర బస్ దిగి లోపలికి ఎలా వెళ్ళానో కూడా తెలియదు. ఏం తినలేదు కదా బాగా నీర్సం వచ్చింది. సాయంత్రానికి కాస్త ఓపిక వచ్చింది. ఈ ఫోర్ అవర్ షుగర్ టెస్ట్ లో నాకు షుగర్ లేదని తెలిసింది. ఆరోజు షుగర్ ఎక్కువ ఉండటానికి కారణమేంటంటే అంతకు ముందు రోజు నాకు పూర్ణాలు తినాలనిపించి పూర్ణాలు లోపలి పప్పు చేసుకున్నా. పూర్ణాలు ఒండే ఓపిక లేక ఆ స్వీట్ పప్పు తినేసాను. అదన్నమాట అసలు సంగతి. ఏడవ నెలలో ఓరోజు మాల్ లో కాలు జారి పడిపోయాను. ఏమి కాలేదు.
చికాగో లో ఉన్నప్పటి బాబీ కాల్ చేసి వాణి అని ఒకావిడ రామస్వామి దగ్గర ఉంది. ఆవిడని బాగా ఇబ్బంది పెడుతున్నారు. తన హజ్బెండ్ చనిపోయారు. బాబు ఇండియాలో ఉన్నాడు. బాగా ఇబ్బంది పడుతోంది. ఏదైనా జాబ్ చూడమని చెప్పి ఆవిడ నెంబర్ ఇచ్చాడు. ఆవిడకి కాల్ చేసి మాట్లాడి, మా దగ్గరకి వచ్చేయమని చెప్పాను. ఉషకి చెప్పాను. మన అవర్స్ లో కొన్ని తనకి ఇద్దాము. మనతో ఉంచుకుందామని అంటేే, ఉష కూడా సరేనంది. వాణి వచ్చింది. మాతోనే తను ఉంటోంది. కొన్ని రోజులు పోయాక మా రాంకుమార్ గారు వాళ్ళు సబ్ వే లో వాణికి జాబ్ ఉందంటే అక్కడికి పంపాను.
నాకు చికాగో బాబన్నయ్య ఇండియా వెళ్ళినప్పుడు ఇచ్చిన డబ్బులు కావాలని అడిగారు. వాళ్ళింట్లో ఉన్న నా లగేజ్ అంతా ఫ్లోరెన్స్ పార్శిల్ చేసారు. ఈలోపల నాకు 8వ నెల వచ్చేసింది. మా చిన్న ఆడపడుచు పెళ్ళి అయ్యింది. మధు వాళ్ళు చెప్పారో, మరెవరు చెప్పారో తెలియదు కాని మా షాప్ ఓనర్ సడన్ గా ఓ రోజు మనిషిని పంపి షాప్ హాండోవర్ చేసుకుని మా జాబ్ అయిపోయిందని చెప్పాడు. వీడి పేరు కూడా బాబినే. విష్ణుకి ఫోన్ చేసి విషయం చెప్పాను. అపార్ట్మెంట్ తీసుకుంటాను హంట్స్విల్ వచ్చేయండి అన్నాడు. అది అలబామా స్టేట్. మా ఆయన కూడా ఇండియా నుండి వస్తుంటే, తనని హంట్స్విల్ వచ్చేయమని, ఆయన వచ్చే రోజుకి మేము హంట్స్విల్ వెళ్ళాము.
హంట్స్విల్ వెళ్ళేముందే బాబన్నయ్య,జలజ వదిన వాళ్ళకు ఇవ్వాల్సిన 2850 డాలర్లు ఇచ్చేసి హమ్మయ్య అప్పు తీర్చేసాను అనుకున్నాను. అమ్మావాళ్ళకు వీసా మూడు నెలలకు ఇచ్చారు. అప్పుడే నాకు చిన్న క్రెడిట్ కార్డ్ వచ్చింది. అంతకు ముందు చికాగోలో ఉన్నప్పుడు తెలియక యాన్యువల్ ఫీ ఉండే కార్డ్ ఒకటి తీసుకున్నా డబ్బులు కట్టి మరీ. నా చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ రాధ వాళ్ళ తమ్మడు రాము మాకు జూనియర్. తను యు ఎస్ వచ్చాడు. నేను ఇండియానా లో టెర్రాహట్ లో ఉన్నప్పటి నుండి మాట్లాడేవాడు. చికాగోలో ఉన్నప్పుడు నాకు 500 డాలర్లు పంపాడు. అవి ఈ కార్డ్ కి కొన్ని వాడాను. బాబీ తీసుకున్నాడు మిగిలినవి. నేను ఇండియా వెళ్ళేటప్పుడు రాధ వాళ్ళకి ముత్యాలు, పచ్చలు తీసుకు వెళ్ళమని రాము చెప్తే అవి తీసుకుని రాధకి ఇచ్చాను. తర్వాత రాముకి ఆ ముత్యాలు, పచ్చలకి పోను మిగిలిన డబ్బులు ఇచ్చేసాను.
ఆ తర్వాత నుండి రాము మాట్లాడలేదనుకుంటా నాతో. బహుశా డబ్బులు తీసుకున్నాననేమెా అని ఇప్పుడు అనిపించింది. ఇన్నాళ్లు అంత బావుండేవాడు, ఎందుకు మాట్లాడటం మానేసాడా అని అనుకునేదాన్ని. తప్పదులెండి జీవితంలో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు
మళ్ళీ కలుద్దాం..
గమనిక: ఔత్సాహిక ప్రవాసులకు గొప్ప అవకాశము. మీ విదేశీ ప్రయాణాలు, లేదా అక్కడ మీ అనుభవాలు, మీ ముచ్చట్లు, మీరు ఎదుర్కున్న ఇబ్బందులు లేదా సంతోషకర విషయలు... ఏదైనా కాని మీరు అందరితో పంచుకోవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలశ్యం... వెంటనే మాకు ఈమెయిలు చేయండి. మేము వాటిని ఆంధ్ర ప్రవాసి లో ప్రచురిస్తాము.
మా మెయిల్ అడ్రస్: andhrapravasi@gmail.com or
andhrapravasi@andhrapravasi.com
ముందు వారాల లింకులు
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉండటం మొబైల్ హౌస్ లో... ఒకసారి కాలు జారి పడితె, ఆసుపత్రిలో ఏమైందంటే... 22
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో మరో కొత్త ఉద్యోగం కొత్త సిటీ లో... కేవలం 3 వారు మాత్రమె... అయితే... 21
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు... అక్కడ లైఫ్ అంటే అంత సులభం కాదు... 18
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో జీతం ఎకోట్టిన యజమానిపై కేసు... డబ్బు దండగ, ఫలితం సూన్యం... 16
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి... ఘటనకు సాక్షి... 15
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో... థాంక్స్ గివింగ్ రోజు జరిగిన సంఘటన... షాపింగ్ కుడా కష్టమై పోయింది... 6
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా... 5
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా? 4
రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...
andhra-aadapaduchu-amerikaalo, andhra-women-in amerika,mobile-house-in-USA
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.