ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో డెలివరీ తర్వాత పెరిగిన ఖర్చులు, అప్పులు తీర్చటానికి ...
Tue Sep 22, 2020 13:28 Rachanalu (రచనలు)శౌర్యతో హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసాము. ఈయన రెండు గాస్ స్టేషన్స్ లో పని చేస్తున్నాడు. మధ్యలో వాణి సెయింట్ లూయీస్ నుండి మా ఇంటికి వచ్చేసింది. ఈయన తన అవర్స్ లో కొన్ని వాణి కి ఇచ్చి చౌదరి గారి గాస్ స్టేషన్ లో పెట్టారు. ఓ గోడ గడియారం వాణి కొన్నది. చౌదరి గారు ఈయనను చాలా మాటలంటున్నారని చెప్పింది. తను కొన్ని రోజులుండి అట్లాంటా వెళ్ళింది. ఏదో సబ్ వే లో చేయడానికనుకుంటా. నాకు సరిగా గుర్తు లేదు. వాడు ఆమెకు పనేమి రాదని, సాంబార్ పెట్టడమే వచ్చని, ఇలా ఏదోకటి అంటూ టార్చర్ పెడుతున్నాడని చెప్పేది. తర్వాత తర్వాత నాతో మాట్లాడటం మానేసింది. వాడినే పెళ్ళి చేసుకుందని తెలిసింది. కొడుకుని ఇండియా నుండి తీసుకు వచ్చిందని కూడా తెలిసింది. నాకు ఎంతో గుర్తు లేదు కాని డబ్బులు అప్పుగా ఇచ్చింది. తను అడగకుండా వాడితో బెదిరించింది. నేనే ఇచ్చేద్దామనుకున్నా.. ఈలోపలే ఆగలేకపోయింది. మా ఉషకి కూడ ఏం చెప్పిందో తెలియదు. తను మాట్లాడటం మానేసింది. మా పక్కింట్లో ఉండే రెడ్డి అంకుల్ నాన్నకి బాగా పరిచయం అయ్యారు. ఆంటీ మా ఇంటికి వస్తూనే ఉండేది. కాస్త తేడా ఉందనుకుంటా. ఏదేదో మాట్లాడేది. వాళ్ళ అమ్మాయి, అల్లుడు అట్లాంటాలో ఉండేవారు. అల్లుడు డాక్టర్. ఇండియాలో డాక్టర్ చదివినా అమెరికాలో రెసిడెన్సీ చేయాలి. దాని కోసం పరీక్ష రాయాలి. ఇంటర్వ్యూలు ఎటెండ్ అవ్వాలి. వాటి కోసం అంకుల్, అల్లుడు, కూతురు వెళుతూ నాన్నను కూడా రమ్మంటే వాళ్ళతో వెళ్ళి గోవర్థన్, శిరీష, గోపాలరావు అన్నయ్య వాళ్ళని కలిసారు. అన్నయ్య ఆ టైమ్ లోనే ఓసారి అట్లాంటా వచ్చి, మా దగ్గరకి రావడానికి టైమ్ కుదరక ఫోన్ చేసి పలకరించాడు. శౌర్య పుట్టిన తర్వాత జలజ వదిన, బాబన్నయ్య ఫోన్ చేసారు. అన్నయ్య ఏంటమ్మా డబ్బులు అడిగానని కోపం వచ్చిందా మాట్లాడటం మానేసావు అన్నారు. అదేం లేదన్నయ్యా అమ్మావాళ్ళు ఉన్నారు కదా, బాబుతో సరిపోతోంది అన్నాను. మేమే వస్తామమ్మా నెక్స్ట్ మంత్ మీ బాబుని చూడటానికి అని అంటే, తప్పకుండా రండి అన్నయ్యా అని చెప్పాను. ఆ తర్వాత వెంటనే కొద్ది రోజుల్లోనే బాబన్నయ్య హార్ట్ ఎటాక్ తో చనిపోయారు.
వినయ్ గారికి ఉద్యోగం లేకపోతే సుబ్బరాజు ఇందుకూరితో మాట్లాడి తనకి AMSOL ద్వారా H1B చేయించాను. వినయ్ గారు కూడా మా ఇంటికి వచ్చి శౌర్యని చూసి, వాడికి బొమ్మలు కొనిచ్చి, రెండు రోజులుండి వెళ్ళారు. రాగిణిప్రియ నాకు హైదరాబాదు హాస్టల్ లో ఉన్నప్పుడు పరిచయం. తను మా జూనియర్ సతీష్ వాళ్ళ సిస్టర్. MCA చేసి, అమెరికా వచ్చింది తన హజ్బెండ్ తో కలిసి. వీళ్ళు కూడా సరైన జాబ్స్ లేక సెయింట్ లూయీస్ రాంకుమార్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి, సబ్ వే లీజ్ కి తీసుకున్నారు. తను కూడా ఫోన్ చేసి క్షేమ సమాచారాలడుగుతూ ఉండేది. తర్వాత పరిస్థితి బాలేక వాళ్ళు నాకన్నా ముందే ఇండియా వచ్చేసారు. అప్పుడప్పుడూ హాస్పిటల్ కి శౌర్యని తీసుకువెళ్ళడం, మౌర్య అల్లరి, చౌదరి గారి తమ్ముడు ప్రసాద్, ఆంటీ ఇంటికి వచ్చి పోతుండటం, రమణి గారు, సింధు, విష్ణు వాళ్ళ రాకపోకలతో ఇండియాలో
లానే మా ఇల్లు జనంతో సందడిగా ఉండేది.
హంట్స్విల్ వచ్చాక మళ్ళీ లెర్నర్స్ పర్మిట్ కోసం రిటెన్ టెస్ట్ రాయడమూ, విష్ణు వాళ్ళతో ఉండే బాలకృష్ణ గారు నాకు డ్రైవింగ్ నేర్పడము, తర్వాత ఆయన వైఫ్ రమణి గారు, కొడుకు పృథ్వి ఇండియా నుండి రావడము, డ్రైవింగ్ లైసెన్స్ కోసం ట్రై చేయడము త్వరత్వరగా జరిగిపోయాయి. మూడవసారి కాని డ్రైవర్స్ లైసెన్స్ రాలేదు. మెుదటిసారి అంతా బానే చేసి, లాస్ట్లో రైట్ సిగ్నల్ వేయమంటే, అంతకు ముందు రెండు రోజులు నేను ప్రాక్టీస్ చేసిన లెఫ్ట్ సిగ్నల్ వేసేసాను హడావిడిగా. రెండవసారి మెుదట్లోనే హాండ్ బ్రేక్ తీయడమే మర్చిపోయాను. శౌర్యని కూడా నాతో తీసుకువెళ్ళాను కదా. వాడు నిద్ర లేచాడు. ఏం ఏడుస్తున్నాడో అన్న ఆలోచనలో రెండుసార్లు అలా అయ్యిందన్న మాట. మూడవసారి వెళ్ళగానే, ఇన్స్ట్రక్టర్ అన్నీ చెప్పి, నవ్వుతూ, ఎనీ డౌట్ అనగానే తల అడ్డంగా ఊపుతూ నవ్వేసాను. డ్రైవ్ టెస్ట్ లో అంతా అయిపోయిందిలే అనుకుంటే... కార్ స్టాప్ చేసి అప్ హిల్ విత్ కర్బ్ కార్ పార్క్ చేసి చూపించమంది. దేవుడా ఈసారి కూడా లైసెన్స్ రాదని ఫిక్స్ అయిపోయి... రిటెన్ ఎగ్జామ్ కి చదివింది గుర్తు తెచ్చుకుని చేసాను. లాస్ట్ లో కార్ క్రాస్ పార్కింగ్ చేయగానే, గో అండ్ పే ద ఫీ అంది....ఆ మాట వినగానే చెప్పలేని సంతోషం నాకు. అలా చిట్టచివరికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందన్న మాట. లెర్నర్స్ పర్మిట్ వచ్చాక పక్కన రెడ్డి అంకుల్ కి సెకండ్ హాండ్ కార్ చూడమని చెప్తే, టయెాటా కామరే తీసుకున్నాము. కార్ లోన్ రావాంటే కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నాకు లైసెన్స్ వచ్చాక కార్ తీసుకున్నాము. కార్ లోన్, కార్ ఇన్ష్యూరెన్స్ మా నెలవారి లెక్కల్లో యాడ్ అయ్యాయి. పాపం మౌర్య ఏది కొని పెట్టమని అడిగినా, ఏదోకటి చెప్పి వాయిదా వేయడమే అయ్యింది అప్పటి పరిస్థితిని బట్టి. శౌర్యకి ఆరవ నెల వచ్చాక అమ్మావాళ్ళను తీసుకుని ఇండియా వచ్చాను. శౌర్యకి కాకానిలో అన్నప్రాశన చేసి, ఓ నెల ఉండి, పిల్లలని అమ్మావాళ్ళ దగ్గర వదల్లేక వదిలి మరోసారి అమెరికా వెళ్ళాను. ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు
మళ్ళీ కలుద్దాం..
గమనిక: ఔత్సాహిక ప్రవాసులకు గొప్ప అవకాశము. మీ విదేశీ ప్రయాణాలు, లేదా అక్కడ మీ అనుభవాలు, మీ ముచ్చట్లు, మీరు ఎదుర్కున్న ఇబ్బందులు లేదా సంతోషకర విషయలు... ఏదైనా కాని మీరు అందరితో పంచుకోవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలశ్యం... వెంటనే మాకు ఈమెయిలు చేయండి. మేము వాటిని ఆంధ్ర ప్రవాసి లో ప్రచురిస్తాము.
మా మెయిల్ అడ్రస్: andhrapravasi@gmail.com or
andhrapravasi@andhrapravasi.com
ముందు వారాల లింకులు
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో సర్జరీ ... చావు వరకు తీసుకువెళ్ళింది ... 25
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉండటం మొబైల్ హౌస్ లో... ఒకసారి కాలు జారి పడితె, ఆసుపత్రిలో ఏమైందంటే... 22
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో మరో కొత్త ఉద్యోగం కొత్త సిటీ లో... కేవలం 3 వారు మాత్రమె... అయితే... 21
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు... అక్కడ లైఫ్ అంటే అంత సులభం కాదు... 18
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో జీతం ఎకోట్టిన యజమానిపై కేసు... డబ్బు దండగ, ఫలితం సూన్యం... 16
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి... ఘటనకు సాక్షి... 15
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో... థాంక్స్ గివింగ్ రోజు జరిగిన సంఘటన... షాపింగ్ కుడా కష్టమై పోయింది... 6
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా... 5
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా? 4
రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...
నేనే-ఇచ్చేద్దామనుకున్నా.- ఈలోపలే
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.