ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో కొత్త కొత్త జాబ్స్ కొత్త కొత్త పరిచయాలు ...

Header Banner

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో కొత్త కొత్త జాబ్స్ కొత్త కొత్త పరిచయాలు ...

  Tue Sep 29, 2020 13:31        Rachanalu (రచనలు)

పిల్లలను వదిలి రావడం కాస్త కష్టమే. అయినా తప్పలేదు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. నన్ను అట్లాంటా ఎయిర్ పోర్ట్ లో మా ఆయన, రెడ్డి అంకుల్ రిసీవ్ చేసుకున్నారు. నేను మళ్లీ హంట్స్విల్ వచ్చేటప్పటికి ఇంట్లో వినయ్ గారు ఉన్నారు. విష్ణు వాళ్ళ తమ్ముడు అనిల్ కూడా అమెరికా వచ్చాడు. నేను వచ్చిన కొద్ది రోజులకే మా ఉమకి డెలివరి అయ్యింది. వాళ్ళ అమ్మా వాళ్ళకు రావడానికి కుదరలేదు. డెలివరి అయ్యాక ఫోన్ చేసారు.

ఈయన వెంటనే నన్ను ఒహాయెా బస్ ఎక్కించారు. బాబుకి పేరు రిషి అని పెట్టారు. జాండీస్ ఎక్కువగా ఉండటం వలన మరుసటి రోజు బాబుని ఇచ్చారు. పది రోజులు ఉమ వాళ్ళంట్లో ఉన్నాను. తర్వాత ఈయన, విష్ణు, అనిల్ వీళ్ళ ఫ్రెండ్ శ్రీను పెళ్ళిరోజుకి కొలంబస్ అనుకుంటా పేరు సరిగా గుర్తు లేదు, వచ్చారు. నేను కూడా బస్ లో అక్కడికి వచ్చి, ఫంక్షన్ అయ్యాక మేం నలుగురం హంట్స్విల్ వచ్చేసాము. తర్వాత నేను ఖాళీగా ఉండటమెందుకని మాల్ లో జుయలరి స్టోర్ లో జాబ్ దొరికితే జాయిన్ అయ్యాను. ఓనర్ హాలే ఇరానీ. నన్ను బాగా ఎంకరేజ్ చేసేది.

ముందు 4, 6 అవర్స్ అనే మాట్లాడింది. తర్వాత తర్వాత చాలా అవర్స్ ఇచ్చేది. విష్ణు వాళ్ళు కాలేజ్ కి వెళుతూ కాస్త ముందే నన్ను మాల్ లో డ్రాప్ చేసి వెళ్ళేవారు. ఎవరో ఒకరు తీసుకు వచ్చేవారు. విష్ణు వాళ్ళతో చదివే దివ్య కూడా నాతోనే చేసేది. రేఖ, రూఫస్ వాళ్ళు,  మధుమిత, మిలి ఇలా చాలామంది పని చేసేవారు. ఒక మాల్ లో రెండు షాప్ లు, మరో మాల్ లో మరొక షాప్ ఉండేది. నేను జాయిన్ అయ్యాక మా చైతన్య కూడ జాయిన్ అయ్యింది. మెుత్తానికి మళ్లీ మాటలు కలిసాయి అందరికి. ఆ వెంటనే నాకు చికాగోలో క్రాఫ్ట్ ఫుడ్స్ లో సైన్ ఆన్ సాఫ్ట్ వేర్ మీద జాబ్ వచ్చింది.

సుమితో షాపింగ్ చేసి ఫార్మల్స్ కొన్ని తీసుకున్నాను. రేఖావాళ్ళు నాకో టీ షర్ట్ కొనిచ్చారు.  నాకు సైన్ ఆన్ రాదు. అంతకు ముందు ఫోన్ ఇంటర్వ్యూ కి చెప్పినప్పటిది గుర్తుంచుకున్నాను. సరే చూద్దాం రాకపోయినా నేర్చుకున్నంత నేర్చుకుందామని వెళ్ళాను. ఓ నెల రోజులు చేసాను. శిరీష, సీతారాం అప్పుడు చికాగోలో పాప, బాబులతో ఉన్నారు. ఆఫీస్ కి దగ్గరలో హోటల్ లో రూమ్ తీసుకుంటే అది సేఫ్ ప్లేస్ కాదని సీతారాం వచ్చి ఇంటికి తీసుకువెళ్ళాడు. కాకపోతే చాలా దూరం వాళ్ళిల్లు. రోజు రెండు బస్ లు మారి వెళ్ళాల్సి వచ్చేది.

కాస్త లేట్ అయినా ఇంటికి రావడానికి కాబ్ కూడా ఉండేది కాదు. వేరే వాళ్ళ ద్వారా సైన్ ఆన్ తెలిసినతనిని హెల్ప్ అడిగితే, అతనికి జాబ్ చికాగోలోనే కావాలని, నాకు హెల్ప్ చేయకుండా, ఈ జాబ్ తను మాట్లాడేసుకున్నాడు టి సి యస్ ద్వారా. నెల డబ్బులు ఇవ్వలేదు టి సి ఎస్. నేనే టికెట్ బుక్ చేసుకుని మళ్లీ హంట్స్విల్ వచ్చేసాను. తర్వాత మరో జాబ్ ఒమహాలో చేసాను. ఇది AS/400 ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్. కైలాష్ ఫ్రెండ్ ఫామిలీ ఉన్నారక్కడ.

ఓ రోజు భోజనానికి పిలిచి జూ కి తీసుకువెళ్ళారు. ఏక్వేరియం లోపలికి వెళ్ళాం. చాలా బావుంది. మన చుట్టూ రకరకాల రంగురంగుల చేపలు తిరగడం బాగా నచ్చింది. ఆఫీస్ లో అమెరికన్ రాజకీయాలు మెుదలయ్యాయి. వాళ్ళంతా చాలా పెద్దవాళ్లు. ఇండియా టీమ్ కి, అమెరికా టీమ్ కి కలిపి కో ఆర్డినేషన్ నేను చేయాలి. ఓ పెద్దాయన నన్ను ఈవెనింగ్ ఆఫీస్ నుండి డ్రాప్ చేసేవాడు.

రోజూ అనేవాడు.. మీ ఇండియన్స్ తక్కువ సాలరీకి పని చేస్తూ మా జాబ్స్ అన్నీ తీసేసుకుంటున్నారని. నేనూ ఊరుకునేదాన్ని కాదు. ఈయన వెంటనే మీకు చాతకాకే కదా మమ్మల్ని తీసుకున్నారు అనేదాన్ని. అప్పటికి హోటల్ లోనే ఉన్నాను. వెళ్ళేటప్పుడు కాబ్ లో వెళ్ళేదాన్ని. మనకేమెా అమెరికన్ ఫుడ్ తినబుద్ది కాదు. కాస్త దూరంలో చైనీస్ రెస్టారెంట్, ఇండియన్ గ్రాసరీ స్టోర్ చిన్నది ఉండేవి. సాయంత్రం ఏదోకటి తెచ్చుకునేదాన్ని.

ఓ రోజు ఫోన్ పాడయ్యింది. స్ప్రింట్ స్టోర్ హోటల్ కి ఎదురు రోడ్డు లో చూడటానికి కాస్త దూరంలో ఉంది. రోడ్ రిపేర్లో ఉందనుకుంటా. నడిచి వెళ్ళడానికి బోలెడు చుట్టు తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. ఏదో చేసి మెుత్తానికి ఫోన్ మార్చుకున్నా. అలా ఆ ప్రాజెక్ట్ అయ్యింది. ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు

మళ్ళీ కలుద్దాం..

గమనిక: ఔత్సాహిక ప్రవాసులకు గొప్ప అవకాశము. మీ విదేశీ ప్రయాణాలు, లేదా అక్కడ మీ అనుభవాలు, మీ ముచ్చట్లు, మీరు ఎదుర్కున్న ఇబ్బందులు లేదా సంతోషకర విషయలు... ఏదైనా కాని మీరు అందరితో పంచుకోవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలశ్యం... వెంటనే మాకు ఈమెయిలు చేయండి. మేము వాటిని ఆంధ్ర ప్రవాసి లో ప్రచురిస్తాము.  

మా మెయిల్ అడ్రస్: andhrapravasi@gmail.com or

andhrapravasi@andhrapravasi.com

 

ముందు వారాల లింకులు

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో డెలివరీ తర్వాత పెరిగిన ఖర్చులు, అప్పులు తీర్చటానికి ... 26

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో  సర్జరీ  ... చావు వరకు తీసుకువెళ్ళింది ... 25

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ని డెట్రాయిట్ లో కాళ్ళజోళ్ళ షాపులో ఉద్యోగం రావడం పోవడం ... మళ్ళి హంట్స్విల్ కి ప్రయాణం ... 24

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 3 వారాలనుకున్న జాబు 3 నెలలవరకు... మల్లి ఉద్యోగ ప్రయత్నాల తో డెట్రాయిట్ ప్రయాణం... 23

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉండటం మొబైల్ హౌస్ లో... ఒకసారి కాలు జారి పడితె, ఆసుపత్రిలో ఏమైందంటే... 22

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో మరో కొత్త ఉద్యోగం కొత్త సిటీ లో... కేవలం 3 వారు మాత్రమె... అయితే... 21

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో నుండి ఇండియా రాక... తిరిగి వెళ్ళిన తరువాత ఉద్యోగాల వేట... ఎన్ని ఎబ్బందులో...  20

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉన్నపుడు తన 2 సం// పిల్లవాడికి సీరియస్... అయినా రాలేని పరిస్థితి... 10 నెలల తరువాత ప్రయాణం 19

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు... అక్కడ లైఫ్ అంటే అంత సులభం కాదు... 18

ఆంద్ర ఆడపడుచు అమెరికాకు వెళ్ళింది సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం... ఆర్ధిక మాన్యం తో చివరికి రెస్టారెంట్ లో అంట్లు, బాత్ రూమ్ క్లీనింగ్... 17

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో జీతం ఎకోట్టిన యజమానిపై కేసు... డబ్బు దండగ, ఫలితం సూన్యం... 16

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి... ఘటనకు సాక్షి... 15  

ఆంద్ర ఆడపడుచు ఆ రోజుల్లో అమెరికాలో ఈమెయిలు చేయడానికి ఎన్ని కస్టాల పడాల్సి వచ్చేదో... HIB కి ఎన్ని తిప్పలో... 14

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో H1B విసా కోసం వెతుకులాట... సరైన ఉద్యోగం దొరక్క తాత్కాలికం గా ఆయా గా... అమెరికా వెంకటేశ్వర స్వామి గుళ్ళో... 13

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం లో ఇబ్బందులు... జీతం కుడా ఇవ్వకుండా పని చేపించుకునే యాజమాన్యం... రాజీనామా... మరో ఉద్యోగ వేట... ఎన్ని ఎబ్బందులో... 12

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం అనుభవాలు... అప్పట్లో టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ లు రేట్లు ఎలా ఉండేవో తెలిస్తే... 11

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం... సబ్జెక్టు ఉంది కాని ప్రాక్టికల్ లేదు... ఉదోగం లో ఎలా నెట్టుకు వచ్చిందో... 10

 ఆంద్ర ఆడపడుచు కొత్త ఉద్యోగ లో చేరడం కోసం మరో సిటీకి ప్రయాణం... ఫ్లైట్ డిలే తో 3 కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్... మూడు ఎయిర్ పోర్టులలో నిరీక్షణలో ఏమి జరిగిందంటే... 9

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం కోసం కొత్త కోర్సుల  ట్రైనింగ్... అమెరికా ఇంగ్లిషు యాస కోసం కుకిటులు... 8

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగ అన్వేషణ లో... అక్కడ ఎన్ని కష్టాలో ఉద్యోగం కోసం... జెమ్ షో అంటే ఏమిటి? - 7

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో... థాంక్స్ గివింగ్ రోజు జరిగిన సంఘటన... షాపింగ్ కుడా కష్టమై పోయింది... 6

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా... 5

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా? 4

ఆంద్ర ఆడపడుచు మొదటి సారి విమానం లో అమెరికా ప్రయాణం... ఇబ్బందులు ఎలా ఎదుర్కుంది ఒంటరిగా... స్వ-గత అనుభవాలు... 3

ఆంద్ర ఆడపడుచు అమెరికా విసా కోసం చదువుల ట్రైనింగ్, ప్రయాణం కోసం ఏర్పాట్లు సర్దుకోవతటాలు ... ఆసక్తికరంగా... 2

సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తెలుగు ఆడపడుచు... భూతల స్వర్గం అమెరికా వెళ్ళాలనే పట్టుదల... ఏమైది చివరకు... 1

రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...

 

తెలుగు ప్రవాసుల కు ఉపయోగపడే వార్తలు, వారికి సంభందించిన వార్తలు, ఆయా దేశాల లో వారికి సంభందించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే...

 

క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 

Andhra pravasi ఆంధ్ర ప్రవాసి

Pulse of Telugu Migrants తెలుగు ప్రవాసుల జీవ నాడి

https://t.me/joinchat/G6eU_lFHk6AH_IG8zfJqdg 


   ఇబ్బందులు-ఎలా-ఎదుర్కుంది-ఒంటరిగా