ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో  ఉగాది పండగ ... వీసా స్టాంప్ కోసం ప్రయత్నాలు ...

Header Banner

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో  ఉగాది పండగ ... వీసా స్టాంప్ కోసం ప్రయత్నాలు ...

  Tue Oct 06, 2020 14:35        Rachanalu (రచనలు)

 

ఓ నెల రోజులు మరో ప్రాజెక్ట్ ఇంట్లో నుండి వర్క్ చేసాను. గ్రీన్ కార్డ్ కోసం కంపెనీ వాళ్ళు అప్లై చేసిన నా లేబర్ అప్రూవ్ అయ్యిందని చెప్పారు. ఈ లోపల H1B మరోసారి రెన్యువల్ చేయించుకోవాల్సి వచ్చింది. H1B రెన్యువల్ అయ్యింది. అమెరికాలో ఎప్పటికప్పుడు ఇమ్మిగ్రేషన్ రూల్స్ మారుతూ ఉంటాయి. అప్పట్లో పోస్ట్ లో H1B వీసా స్టాంపిగ్ కి పంపడం అదే ఆఖరుసారి. వీసా స్టాంపిగ్ కి పంపించాను, కాని వీసా స్టాంపిగ్ అవలేదు. అవుటాఫ్ కంట్రీ వెళ్ళమని వచ్చింది.

 

అప్పటికే కొందరికి బయట కంట్రీస్ కి వెళ్ళడం మూలంగా వీసా స్టాంపిగ్ కాకపోవడము, హోమ్ కంట్రీ వెళ్ళమనడము జరుగుతోంది. కొందరికి మెక్సికో, కెనడాలలో వీసా స్టాంపిగ్ అవుతోంది. మా పెద్దోడు మౌర్యని వీసా స్టాంపిగ్ కోసం ఇండియాలో మద్రాస్ లో అమెరికన్ కన్సోలేట్ కి రెండుసార్లు పంపిస్తే అవలేదు. ఎవరితో పంపిస్తారంటే మా నాన్న తెలిసిన వారితో పంపిస్తామని చెప్పారట. అందుకు రిజెక్ట్ చేసారు. రెండవసారి వాళ్ళ పేరెంట్స్ ని వచ్చి తీసుకువెళ్ళమని చెప్పారట. 

 

అందరు మెక్సికో, కెనడా వీసా స్టాంపిగ్ కి వెళుతున్నారు కదా అని నేను మెక్సికో వెళడానికి అపాయింట్మెంట్ బుక్ చేసాను. తీరా పాస్పోర్ట్ చూస్తే 5,6 నెలలే ఉంది ఎక్స్పైర్ కావడానికి. వెంటనే అపాయిట్మెంట్ కాన్సిల్ చేసి, పాస్పోర్ట్ రెన్యువల్ కి అమెరికాలో హ్యూస్టన్ లోని ఇండియన్ ఎంబసికి పంపాను. పాస్పోర్ట్ రెన్యువల్ కి చాలా టైమ్ తీసుకున్నారు మనవాళ్ళు. మా చిన్నాడపడుచుకి AMSOL లో పనిచేసే అతనితో పెళ్ళి చేసాం కదా. ఆమెకు అతనికి కుదరలేదు.

 

ఆమె అమెరికా వచ్చిన తర్వాత కూడా ఇద్దరికి కుదరలేదు. మా వాళ్ళు ఎవరు ఏమి మాకు చెప్పలేదు. అతనే చెప్పేవాడు విషయాలు. శౌర్య పుట్టినప్పుడు కూడా ఫోటో చూడటానికి కూడా ఆవిడ ఇష్టపడలేదని కూడ చెప్పాడు. నాకు అంత హెల్త్ ప్రోబ్లం అయినా ఈయన వైపు వారు ఎవరు కనీసం ఓ ఫోన్ కూడా చేయలేదు. వాళ్ళ అవసరాలకు మాత్రం డబ్బులు బానే తీసుకున్నారు. డబ్బులు పనికివచ్చాయి కాని మనుషులు పనికిరాలేదు.

 

శౌర్యకి కాకానిలో అన్నం పెట్టినప్పుడు కూడా అందరికి ఫోన్ చేసి రమ్మని చెప్పినా ఎవరూ రాలేదు. వీళ్ళిద్దరికి బాగా గొడవ ఎక్కువైంది. మా AMSOL CEO సుబ్బరాజు ఇందుకూరి కూడా చాలా చెప్పి చూసారు ఆవిడకి. వినలేదు. ఆఖరికి మా పెద్దాడపడుచు ఈయనకి చెప్పిందేమెా, ఆ పిల్లను మా ఇంటికి రమ్మని టికెట్ బుక్ చేసాము. అప్పటికే నన్ను చాలా మాటలు అని ఉంది. అయినా అవేం  పట్టించుకోలేదు నేను. ఆ అబ్బాయికి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉంది.

 

ఓ నెల రోజులు మా ఇంట్లో ఉంచుకున్నాం. ఎన్ని రకాలుగా చెప్పినా వినలేదు. అప్పటికే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకు బాలేదు కాన్సర్. నేను శౌర్యని ఇండియాలో వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు ఆవిడను చూసి వచ్చాను. ఇద్దరు డైవోర్స్ కి అప్లై చేయడానికి ఇండియా వెళతామన్నారు. ఈ పిల్లను తీసుకుని న్యూజెర్సీ వెళ్ళి, ఇద్దరిని ఇండియాకి ఫ్లైట్ ఎక్కించి నేను హంట్స్విల్ వచ్చేసాను. 

 

వెంటనే నాకు రాచెస్టర్ మినిసోటా లోని మేయెా క్లినిక్ లో ప్రాజెక్ట్ Allied Informatics ద్వారా వచ్చింది. ఈ అలైడ్ ఇన్ఫర్మాటిక్స్ CEO క్రిష్ మామగారు పూర్ణచంద్రరావు మద్రాస్ లో కంపెనీ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి H1B వీసా ప్రాసెస్ చేసేవారు.

 

నేను అమెరికా రాకముందు దీనిలో పని చేసాను. నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళను సెలక్ట్ చేసి నన్ను అమెరికా వెళ్ళడానికి పనికిరానన్నాడు. మా AMSOL వాళ్ళు అలైడ్ వాళ్ళతో పని చేయడానికి ఇష్టపడలేదు పేమెంట్ సరిగా ఇవ్వరని. నేను నచ్చజెప్పి ఈ ప్రాజెక్ట్ కి వచ్చాను. ఓ వారం హోటల్ లో ఉండి, తర్వాత వేరే అమ్మాయితో రూమ్ షేర్ చేసుకున్నాను. ఆ టైమ్ లో వింటర్.

 

కంపెని బస్ కోసం కాస్త దూరం నడవాలి సబ్ వే లో. బోలెడు ట్యూలిప్స్ పూవ్వులు రంగురంగులలో దారంతా ఉండేవి. చూడటానికి భలే అందంగా ఉండేది నాకయితే. ఉగాది అక్కడి ఇండియన్స్ అందరు కలిసి చాలా బాగా చేసారు. తలా ఓ వంటకం చేసారు. నేనూ పచ్చిమిరపకాయి బజ్జీలు వేసి తీసుకెళ్ళాను. అందరు మెచ్చుకున్నారు కూడా.

 

వంట ఎలా ఉన్నా మనం నొచ్చుకోకుండా మెచ్చుకోవడం అక్కడి మనవారి సంస్కారం. పాటలు, డాన్సులు, స్కిట్స్ లతో ప్రోగ్రామ్ బాగా జరిగింది. ఆ రాత్రి బౌలింగ్ కి కూడా వెళ్ళాము. ఆ టైమ్ లోనే " జనమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది " పాట కార్ లో వినడము, నాకు బాగా నచ్చడమూ జరిగిపోయింది. ఆ పాట ఏ సినిమాలోదో కూడా తెలియదు. ఓ రెండు నెలలు ఆ ప్రాజెక్ట్ జరిగింది. తర్వాత ఫ్రెండ్ శాం రాచెస్టర్ వస్తే తనతో డెట్రాయిట్ వచ్చి, వాళ్ళ ఫ్రెండ్ కెనడా నుండి వస్తే తనని కలిసి, జాబ్ గురించి మాట్లాడి మళ్ళీ హంట్స్విల్. తర్వాత కొన్ని రోజులు డెట్రాయిట్ కి దగ్గరలో క్విక్ స్టార్ లో ఓ ప్రాజెక్ట్ చేసాను. 

ఈ లోపల లేబర్ అప్రూవ్ అయ్యాక, గ్రీన్ కార్డ్ లో నెక్స్ట్ ప్రాసెస్ I 140 కి ఫైల్ చేసారు. 

కొసమెరుపేమిటంటే " అమెరికా వెళ్ళడానికే పనికిరానన్న వాళ్ళతోనే ఓ ప్రాజెక్ట్ అదీ పెద్ద పేరున్న Mayo Clinic తో పని చేయడం, మా వాళ్ళు  భయపడినట్లే అలైడ్ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వెంటపడి అడిగి మరీ ఇప్పించడం. " ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు

మళ్ళీ కలుద్దాం..

గమనిక: ఔత్సాహిక ప్రవాసులకు గొప్ప అవకాశము. మీ విదేశీ ప్రయాణాలు, లేదా అక్కడ మీ అనుభవాలు, మీ ముచ్చట్లు, మీరు ఎదుర్కున్న ఇబ్బందులు లేదా సంతోషకర విషయలు... ఏదైనా కాని మీరు అందరితో పంచుకోవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలశ్యం... వెంటనే మాకు ఈమెయిలు చేయండి. మేము వాటిని ఆంధ్ర ప్రవాసి లో ప్రచురిస్తాము.  

మా మెయిల్ అడ్రస్: andhrapravasi@gmail.com or

andhrapravasi@andhrapravasi.com

 

ముందు వారాల లింకులు

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో కొత్త కొత్త జాబ్స్ కొత్త కొత్త పరిచయాలు ... 27

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో డెలివరీ తర్వాత పెరిగిన ఖర్చులు, అప్పులు తీర్చటానికి ... 26

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో  సర్జరీ  ... చావు వరకు తీసుకువెళ్ళింది ... 25

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ని డెట్రాయిట్ లో కాళ్ళజోళ్ళ షాపులో ఉద్యోగం రావడం పోవడం ... మళ్ళి హంట్స్విల్ కి ప్రయాణం ... 24

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 3 వారాలనుకున్న జాబు 3 నెలలవరకు... మల్లి ఉద్యోగ ప్రయత్నాల తో డెట్రాయిట్ ప్రయాణం... 23

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉండటం మొబైల్ హౌస్ లో... ఒకసారి కాలు జారి పడితె, ఆసుపత్రిలో ఏమైందంటే... 22

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో మరో కొత్త ఉద్యోగం కొత్త సిటీ లో... కేవలం 3 వారు మాత్రమె... అయితే... 21

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో నుండి ఇండియా రాక... తిరిగి వెళ్ళిన తరువాత ఉద్యోగాల వేట... ఎన్ని ఎబ్బందులో...  20

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉన్నపుడు తన 2 సం// పిల్లవాడికి సీరియస్... అయినా రాలేని పరిస్థితి... 10 నెలల తరువాత ప్రయాణం 19

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు... అక్కడ లైఫ్ అంటే అంత సులభం కాదు... 18

ఆంద్ర ఆడపడుచు అమెరికాకు వెళ్ళింది సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం... ఆర్ధిక మాన్యం తో చివరికి రెస్టారెంట్ లో అంట్లు, బాత్ రూమ్ క్లీనింగ్... 17

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో జీతం ఎకోట్టిన యజమానిపై కేసు... డబ్బు దండగ, ఫలితం సూన్యం... 16

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి... ఘటనకు సాక్షి... 15  

ఆంద్ర ఆడపడుచు ఆ రోజుల్లో అమెరికాలో ఈమెయిలు చేయడానికి ఎన్ని కస్టాల పడాల్సి వచ్చేదో... HIB కి ఎన్ని తిప్పలో... 14

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో H1B విసా కోసం వెతుకులాట... సరైన ఉద్యోగం దొరక్క తాత్కాలికం గా ఆయా గా... అమెరికా వెంకటేశ్వర స్వామి గుళ్ళో... 13

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం లో ఇబ్బందులు... జీతం కుడా ఇవ్వకుండా పని చేపించుకునే యాజమాన్యం... రాజీనామా... మరో ఉద్యోగ వేట... ఎన్ని ఎబ్బందులో... 12

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం అనుభవాలు... అప్పట్లో టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ లు రేట్లు ఎలా ఉండేవో తెలిస్తే... 11

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం... సబ్జెక్టు ఉంది కాని ప్రాక్టికల్ లేదు... ఉదోగం లో ఎలా నెట్టుకు వచ్చిందో... 10

 ఆంద్ర ఆడపడుచు కొత్త ఉద్యోగ లో చేరడం కోసం మరో సిటీకి ప్రయాణం... ఫ్లైట్ డిలే తో 3 కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్... మూడు ఎయిర్ పోర్టులలో నిరీక్షణలో ఏమి జరిగిందంటే... 9

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం కోసం కొత్త కోర్సుల  ట్రైనింగ్... అమెరికా ఇంగ్లిషు యాస కోసం కుకిటులు... 8

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగ అన్వేషణ లో... అక్కడ ఎన్ని కష్టాలో ఉద్యోగం కోసం... జెమ్ షో అంటే ఏమిటి? - 7

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో... థాంక్స్ గివింగ్ రోజు జరిగిన సంఘటన... షాపింగ్ కుడా కష్టమై పోయింది... 6

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా... 5

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా? 4

ఆంద్ర ఆడపడుచు మొదటి సారి విమానం లో అమెరికా ప్రయాణం... ఇబ్బందులు ఎలా ఎదుర్కుంది ఒంటరిగా... స్వ-గత అనుభవాలు... 3

ఆంద్ర ఆడపడుచు అమెరికా విసా కోసం చదువుల ట్రైనింగ్, ప్రయాణం కోసం ఏర్పాట్లు సర్దుకోవతటాలు ... ఆసక్తికరంగా... 2

సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తెలుగు ఆడపడుచు... భూతల స్వర్గం అమెరికా వెళ్ళాలనే పట్టుదల... ఏమైది చివరకు... 1

రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...

 

తెలుగు ప్రవాసుల కు ఉపయోగపడే వార్తలు, వారికి సంభందించిన వార్తలు, ఆయా దేశాల లో వారికి సంభందించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే...

 

క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 

Andhra pravasi ఆంధ్ర ప్రవాసి

Pulse of Telugu Migrants తెలుగు ప్రవాసుల జీవ నాడి

https://t.me/joinchat/G6eU_lFHk6AH_IG8zfJqdg

 

 

 


   నేను-మెక్సికో-వెళడానికి-అపాయింట్మెంట్