ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో కొత్త జాబ్ ... అన్ని దేశాల వారితో ప్రాజెక్ట్ ... అనుభవాలు ...

Header Banner

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో కొత్త జాబ్ ... అన్ని దేశాల వారితో ప్రాజెక్ట్ ... అనుభవాలు ...

  Tue Oct 27, 2020 08:42        Rachanalu (రచనలు)

తర్వాత సంఘటనలు వేగంగానే జరిగిపోయాయి. మా AMSOL వాళ్ళు నన్ను మార్కెటింగ్ చేయడం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు పెద్దగా. ఎలాగూ నేనే మార్కెట్ చేసుకోగలనని వాళ్ళకు తెలుసు. కాకపోతే నేను ఎవరికి H1B చేయమన్నా కాదనేవారు కాదు. ఉష, వినయ్ గారు, రూఫస్, శ్రీనివాస్ గారేపల్లి ఇలా చాలా మందికి H1B చేసారు. నాకు బయట మార్కెటింగ్ వాళ్ళు చాలామంది తెలుసు. నివాస్ గారిని టెస్టింగ్ టూల్స్ నేర్చుకోవడానికి నరేంద్ర పరిచయం చేసాడు. శామ్ ని శ్రీనివాసరెడ్డి పరిచయం చేసాడు. 

 

        నాకు జాబ్ సిటిగ్రూప్, డాలస్ (డెల్లాస్) లో వచ్చింది. అప్పటికి నేను AMSOL కి చెప్పి వేరే కంపెని ద్వారా జాబ్ లో జాయిన్ అయ్యాను. కాకపోతే మధ్యలో వెండర్ TCS. అందుకే నేను జాయిన్ అవనని చెప్పాను. TCS  మనీ సరిగా పే చేయరని, మీతో పని చేయడం ఇష్టం లేదని వాళ్ళకే చెప్పేసాను. అలా జరగకుండా చూసుకుంటామని చెప్పారు. 3 మంత్స్ ప్రాజెక్ట్ అది. డాలస్ లో శ్రీనివాస్,సంధ్యా వాళ్ళింటికి వెళ్ళాను.

కార్సన్ సిటిలో నా మెుదటి ప్రాజెక్ట్  కొలీగ్ శ్రీనివాస్ గారేపల్లి. అప్పుడు వాళ్ళింట్లో శ్రీనివాస్ అమ్మానాన్నలు ఇండియా నుండి వచ్చి ఉన్నారు. ఓ వారం రోజులు వాళ్ళింట్లో ఉండి, వాళ్ళింటికి కాస్త దగ్గరలో మెాటల్ లో మరొక అమ్మాయు మధుతో కలిసి ఉన్నాను. శ్రీను వాళ్ళింట్లో ఉన్న వారం రోజులలో శ్రీను వాళ్ళ అమ్మగారు సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే తెలుగు సీరియల్స్ అలవాటు చేసారు. ప్రతిది అంతకు ముందు కత చెప్పి మరీ చూపించేవారు. నాకు భలే ఆశ్చర్యం వేసేది. ఏ స్టోరికా స్టోరి కన్ఫ్యూజ్ కాకుండా అలా ఎలా గుర్తుంచుకుంటారా అని.

అంతకు ముందెప్పుడూ నాకు టి వి సీరియల్స్ చూసే అలవాటు లేదు రామాయణం,భారతం ఆదివారం చూడటం తప్ప. సినిమాలు మాత్రం చూసేదాన్ని. 

సిటి గ్రూప్ లో నాతోపాటు డాని అనే అమెరికన్ జాయిన్ అయ్యాడు. మేమిద్దరము TCS ద్వారానే వచ్చాము. మాకు సపరేట్ కాబిన్స్ ఇచ్చారు మెుదట్లో. అంతా మీటింగ్స్, డిస్కషన్స్ ఉండేవి. మాకేమెా బోర్ కొట్టేది. తర్వాత నార్త్ ఇండియన్స్ TCS ఎంప్లాయీస్ కొంతమంది ఇండియా నుండి వచ్చారు. మమ్మల్నే వాళ్ళకు హెల్ప్ చేయమని చెప్పేవారు. వాళ్ళంతా ఓ బాచ్ లా ఉండేవారు. మాతోపాటు ఓ పాకిస్తానీ అతను, తమిళ్ అతను కూడా కలిసారు.

తర్వాత డాటాబేస్ కి పెద్దాయన ఐరిష్ అతను డాన్ వచ్చారు. మాదంతా ఓ గ్రూప్ అన్నమాట.  జనం ఎక్కువైయ్యాక నేను, డానీ, డాన్, పాకిస్తాన్ ఆయన ఒకే రూమ్ లో వర్క్ చేసుకునేవారం. తర్వాత కాబిన్ లు ఎలాట్ చేసారు. ఎవరికి ఫోన్ వచ్చినా బయటకు వెళ్లి మాట్లాడుకునేవారు. నాకేం ప్రోబ్లం లేదు కాబట్టి నేను రూమ్ లోనే ఉండి మాట్లాడుకునేదాన్ని. డాని నవ్వేవాడు. నీకందరి లాంగ్వేజ్ వచ్చు, కాని నీ లాంగ్వేజ్ ఎవరికి రాదు అని.

కేవలం పది రోజులలో షుగరు ఉన్నవారికి ఉత్తమ పలితాలు ఎలా సాధ్యం... ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి online orders@www.morehealthmorelife.com...

డాన్ కూడా నేనుండే మెాటల్ లోనే ఉండేవాడు. మెాటల్ నుండి సిటీ గ్రూప్ కి ట్రాన్స్ పోర్టేషన్ ఉండేది. నేను దానిలో వెళతానంటే డాన్ ఒప్పుకునేవాడు కాదు. రోజు తన కార్ లో తీసుకువెళ్ళి, తీసుకువచ్చేవాడు. ఆప్యాయంగా డచస్ యనమదల అని పిలిచేవాడు. సుడోకో బాగా ఆడేవాడు. పెన్సిల్ స్కెచ్ చాలా బాగా వేసేవాడు. 

అందరికి ఒకటే పని ఉండే నాకు మూడు పనులుండేవి. కోడింగ్, టెస్టింగ్ లతోపాటు డాటాబేస్ ఫైల్స్ ఎవరికి కావాలన్నా నా అప్రూవల్ ఇవ్వాల్సి  వచ్చేది. డాన్ డాటాబేస్ ఫైల్స్ రిక్వెస్ట్ ల ప్రకారం క్రియేట్ చేస్తే నేను అప్రూవల్ ఇవ్వాల్సి వచ్చేది. డాన్, డాని కి పెద్దగా పడేది కాదు. ఇద్దరికి మధ్యలో నేను సమన్వయం చేయడమన్న మాట. మాతో ఓ చైనీస్ ఆమె, మిగతా అందరు అమెరికన్స్ ఉండేవారు మా టీమ్ లో. 

అమెరికన్స్ లో మంచి గుణాలు చాలా ఉన్నాయి. ఎవరు కనిపించినా చక్కగా గ్రీట్ చేస్తారు. మనం తెలియకపోయినా నవ్వుతూ పలకరిస్తారు. మనవాళ్ళే మనం కనబడితే తల తిప్పుకుపోతారు. పిల్లల గురించి కూడా ఓ విషయం చెప్పాలి. డాని కి ముగ్గురు పిల్లలని చెప్పాడు. నేను సొంత పిల్లలనుకున్నాను.

కాదట ముగ్గురిని పెంచుకుంటున్నాడట. వాళ్ళ కోసం ఎంత కేరింగ్ గా ఉండేవాడో. డాని కూడా చిన్నవాడే. అయినా వాళ్ళకు ఏది తక్కువ కానిచ్చేవాడు కాదు. వాళ్ళకు ఇచ్చిన మాట కోసం జాబ్ పోతుందన్నా కూడా కేర్ చేయలేదు. వాడి మంచి మనసుకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పిల్లల కోసం త్వరగా వెళిపోతున్నాడని కోపం తెచ్చుకున్న మానేజర్ కోపాన్ని మేం తగ్గించి సర్దిచెప్పాము. లంచ్ కూడా మేం ముగ్గురం కలిసి చేసే వాళ్ళం.

మధ్య మధ్య నార్త్ ఇండియన్ విశ్వనాథ్ వచ్చేవాడు మాతో కలిసి. నా కూరలేమెా బాగా కారంగా ఉండేవి. డాన్ కి ఇష్టమే కాని కారం తినలేకపోయేవాడు. TCS జనాలు మాత్రం బాగా కటింగ్ లు ఇస్తూ పెత్తనం మా మీద కూడా చేయాలని చూసేవారు. మేం అస్సలు పడనిచ్చేవారం కాదు. అలా మా వర్క్ సాగుతూ ఉంది. ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు

మళ్ళీ కలుద్దాం..

గమనిక: ఔత్సాహిక ప్రవాసులకు గొప్ప అవకాశము. మీ విదేశీ ప్రయాణాలు, లేదా అక్కడ మీ అనుభవాలు, మీ ముచ్చట్లు, మీరు ఎదుర్కున్న ఇబ్బందులు లేదా సంతోషకర విషయలు... ఏదైనా కాని మీరు అందరితో పంచుకోవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలశ్యం... వెంటనే మాకు ఈమెయిలు చేయండి. మేము వాటిని ఆంధ్ర ప్రవాసి లో ప్రచురిస్తాము.  

మా మెయిల్ అడ్రస్: andhrapravasi@gmail.com or

andhrapravasi@andhrapravasi.com

 

ముందు వారాల లింకులు

 

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో వీసా ... అమెరికన్ ఎంబసి లో ముప్పు తిప్పలు ... 30

 

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో హెల్త్ ప్రోబ్లమ్స్ ... స్టెరాయిడ్ మిస్ప్లేస్ ... జీవితంలో ఎప్పుడూ పడనంత బాధ ...29

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో  ఉగాది పండగ ... వీసా స్టాంప్ కోసం ప్రయత్నాలు ... 28

 

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో కొత్త కొత్త జాబ్స్ కొత్త కొత్త పరిచయాలు ... 27

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో డెలివరీ తర్వాత పెరిగిన ఖర్చులు, అప్పులు తీర్చటానికి ... 26

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో  సర్జరీ  ... చావు వరకు తీసుకువెళ్ళింది ... 25

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ని డెట్రాయిట్ లో కాళ్ళజోళ్ళ షాపులో ఉద్యోగం రావడం పోవడం ... మళ్ళి హంట్స్విల్ కి ప్రయాణం ... 24

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 3 వారాలనుకున్న జాబు 3 నెలలవరకు... మల్లి ఉద్యోగ ప్రయత్నాల తో డెట్రాయిట్ ప్రయాణం... 23

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉండటం మొబైల్ హౌస్ లో... ఒకసారి కాలు జారి పడితె, ఆసుపత్రిలో ఏమైందంటే... 22

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో మరో కొత్త ఉద్యోగం కొత్త సిటీ లో... కేవలం 3 వారు మాత్రమె... అయితే... 21

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో నుండి ఇండియా రాక... తిరిగి వెళ్ళిన తరువాత ఉద్యోగాల వేట... ఎన్ని ఎబ్బందులో...  20

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉన్నపుడు తన 2 సం// పిల్లవాడికి సీరియస్... అయినా రాలేని పరిస్థితి... 10 నెలల తరువాత ప్రయాణం 19

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు... అక్కడ లైఫ్ అంటే అంత సులభం కాదు... 18

ఆంద్ర ఆడపడుచు అమెరికాకు వెళ్ళింది సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం... ఆర్ధిక మాన్యం తో చివరికి రెస్టారెంట్ లో అంట్లు, బాత్ రూమ్ క్లీనింగ్... 17

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో జీతం ఎకోట్టిన యజమానిపై కేసు... డబ్బు దండగ, ఫలితం సూన్యం... 16

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి... ఘటనకు సాక్షి... 15  

ఆంద్ర ఆడపడుచు ఆ రోజుల్లో అమెరికాలో ఈమెయిలు చేయడానికి ఎన్ని కస్టాల పడాల్సి వచ్చేదో... HIB కి ఎన్ని తిప్పలో... 14

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో H1B విసా కోసం వెతుకులాట... సరైన ఉద్యోగం దొరక్క తాత్కాలికం గా ఆయా గా... అమెరికా వెంకటేశ్వర స్వామి గుళ్ళో... 13

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం లో ఇబ్బందులు... జీతం కుడా ఇవ్వకుండా పని చేపించుకునే యాజమాన్యం... రాజీనామా... మరో ఉద్యోగ వేట... ఎన్ని ఎబ్బందులో... 12

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం అనుభవాలు... అప్పట్లో టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ లు రేట్లు ఎలా ఉండేవో తెలిస్తే... 11

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం... సబ్జెక్టు ఉంది కాని ప్రాక్టికల్ లేదు... ఉదోగం లో ఎలా నెట్టుకు వచ్చిందో... 10

 ఆంద్ర ఆడపడుచు కొత్త ఉద్యోగ లో చేరడం కోసం మరో సిటీకి ప్రయాణం... ఫ్లైట్ డిలే తో 3 కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్... మూడు ఎయిర్ పోర్టులలో నిరీక్షణలో ఏమి జరిగిందంటే... 9

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం కోసం కొత్త కోర్సుల  ట్రైనింగ్... అమెరికా ఇంగ్లిషు యాస కోసం కుకిటులు... 8

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగ అన్వేషణ లో... అక్కడ ఎన్ని కష్టాలో ఉద్యోగం కోసం... జెమ్ షో అంటే ఏమిటి? - 7

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో... థాంక్స్ గివింగ్ రోజు జరిగిన సంఘటన... షాపింగ్ కుడా కష్టమై పోయింది... 6

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా... 5

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా? 4

ఆంద్ర ఆడపడుచు మొదటి సారి విమానం లో అమెరికా ప్రయాణం... ఇబ్బందులు ఎలా ఎదుర్కుంది ఒంటరిగా... స్వ-గత అనుభవాలు... 3

ఆంద్ర ఆడపడుచు అమెరికా విసా కోసం చదువుల ట్రైనింగ్, ప్రయాణం కోసం ఏర్పాట్లు సర్దుకోవతటాలు ... ఆసక్తికరంగా... 2

సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తెలుగు ఆడపడుచు... భూతల స్వర్గం అమెరికా వెళ్ళాలనే పట్టుదల... ఏమైది చివరకు... 1

రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...

 

తెలుగు ప్రవాసుల కు ఉపయోగపడే వార్తలు, వారికి సంభందించిన వార్తలు, ఆయా దేశాల లో వారికి సంభందించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే...

 

క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 

Andhra pravasi ఆంధ్ర ప్రవాసి

Pulse of Telugu Migrants తెలుగు ప్రవాసుల జీవ నాడి

https://t.me/joinchat/G6eU_lFHk6AH_IG8zfJqdg


   అమ్మానాన్నలు-ఇండియా-నుండి-వచ్చి-ఉన్నారు