ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో హెల్త్ ప్రోబ్లమ్స్ ... స్టెరాయిడ్ మిస్ప్లేస్ ... జీవితంలో ఎప్పుడూ పడనంత బాధ ...

Header Banner

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో హెల్త్ ప్రోబ్లమ్స్ ... స్టెరాయిడ్ మిస్ప్లేస్ ... జీవితంలో ఎప్పుడూ పడనంత బాధ ...

  Tue Oct 13, 2020 14:34        Rachanalu (రచనలు)

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో హెల్త్ ప్రోబ్లమ్స్ ... స్టెరాయిడ్ మిస్ప్లేస్ ... జీవితంలో ఎప్పుడూ పడనంత బాధ ...

చాలా ఆలశ్యంగా పాస్పోర్ట్ రెన్యువల్ అయి వచ్చింది. మా కిరణ్ ఫ్రెండ్ అశ్విన్ ఓ రోజు ఫోన్ చేసి అక్కా నేను మెక్సికో వెళ్ళి వీసా స్టాంపిగ్ వేయించుకున్నాను. ప్రోబ్లం ఏమి రాలేదు అని చెప్పాడు. అక్కడ కాంటాక్ట్ చేయాల్సిన పర్సన్ వివరాలు ఇచ్చాడు. పిల్లల ఫోటోలు కూడా చూసుకునేదాన్ని కాదు. చూస్తే బెంగ వేసి పిల్లలను చూడటానికి వెళిపోవాలనిపిస్తుందని. చిన్నవాడిని ఇండియాలో వదిలి వచ్చాకా చాలా రోజులు పక్కలో చేయి వేసి వెదుక్కునేదాన్ని. వాడు పుట్టిన తర్వాత అప్పుడప్పుడూ, అప్పటికప్పుడు నాకు తెలియకుండానే నీర్సం వచ్చేది. బాగా మంచినీళ్ళు తాగేసి కాసేపు పడుకుంటే కాస్త తగ్గేది. మా డాక్టర్ కాకాని గారు కొన్నాళ్ళు చూసి థైరాయిడ్ డాక్టర్ దగ్గరకి పంపారు. అప్పటి నుండి థైరాయిడ్ టాబ్లెట్ మెుదలయ్యింది. తర్వాత నెమ్మదిగా వేరే హెల్త్ ప్రోబ్లమ్స్ మెుదలయ్యాయి. మెడ, చెయ్యి నొప్పి అని జనరల్ ఫిజీషియన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. B12 లెవెల్ చెక్ చేయించారు. బాగా తక్కువ ఉందని మెడికేషన్ ఇచ్చారు. ఓ వారం రోజులు రోజూ ఇంజక్షన్, తర్వాత వారానికి ఒకటి, ఆ తర్వాత 15 రోజులకు ఒకటి, తర్వాత నెలకి ఒకటి లైఫ్ లాంగ్ చేయించుకోవాలని చెప్పారు. చెయ్యి, మెడ నొప్పి తగ్గకపోవడంతో స్పెషలిస్ట్ ఫాంబ్రో కి రిఫర్ చేసారు. ఆయన చాలా సీనియర్ డాక్టర్. MRI తీయించి, లోపల ఫ్లూయిడ్ అయిపోయిందని చెప్పి, ఓసారి స్టెడాయిడ్ ఇంజక్షన్ చేసి చూద్దామని చెప్పి చేసారు. నాకు నొప్పి ఏమి తగ్గలేదు. ఫిజియెాథెరపి 20 రోజులు చేయించారు. హీట్ టీట్ర్మెంట్ కూడా చేసారు. అయినా ఏమి రిలీఫ్ రాకపోగా కాలర్ బోన్ దగ్గర ప్రోబ్లం అయ్యింది.  మరోసారి స్టెరాయిడ్ ట్రై చేద్దామని చేసారు కాని అది కాస్తా భుజం దగ్గర మిస్ప్లేస్ అయ్యి, బ్లడ్ వచ్చి బాగా పెయిన్ వచ్చింది. మరోచోట చేసారు. ఓ 10 నిమిషాలయ్యాక చెయ్యి ఎత్తమని, ఇంక ఈ పెయిన్ తగ్గదు. సర్జరీలో కూడా 50%ఛాన్స్ ఉంది. చేయను అని చెప్పారు. ఆ రాత్రి నా జీవితంలో ఎప్పుడూ పడనంత బాధ అనుభవించాను ఆ ఇంజక్షన్ తో.  ప్రసాద్ గారు ఆరోజు మాతో పాటు హాస్పిటల్ కి వచ్చారు. ఎప్పుడూ హాస్పిటల్ లోపలికి రాని మా ఆయన కూడ లోపలికి వచ్చారు. ఇంజక్షన్ చేసిన తర్వాత వీళ్ళు లోపలికి వచ్చారు. నాకు తెలియకుండానే కళ్ళమ్మట నీళ్ళు కారిపోయాయి. డాక్టర్ వదిలేస్తే కొడతావా నన్ను అంటే, అవునని తల వూపాను. ఇంటికి వచ్చాక ఈయన వర్క్ కి వెళిపోయాడు. 

ప్రసాద్ గారు మధ్య మధ్య వచ్చి చూసి వెళ్ళుతున్నారు. నాకు సాయంత్రం అయ్యేసరికి పెయిన్ బాగా ఎక్కువై చెయ్యి కదిలించలేక పోయాను. భరించలేక మా గోపాలరావు అన్నయ్యకి ఫోన్ చేసాను. తను తీయలేదు. వెంటనే వదినకి చేసాను. వదినకి విషయం చెప్పాను. ఆ ఇంజక్షన్ అంత పెయిన్ ఉండదు. నీకు మిస్ ప్లేస్ అయ్యింది అని చెప్పింది. కాల్చిన ఇనుప చువ్వ గుచ్చితే ఎలా ఉంటుందో ఆ ఇంజక్షన్ చేసినప్పుడు, తర్వాత అంత నొప్పి ఉందని చెప్పాను. పెయిన్ ఎక్కడ నుండి వస్తుందో కనుక్కోవడానికి EMG test కూడా చేయించారు కాని పెయిన్ ఎక్కడ నుండి వస్తుందో కనుక్కోలేక పోయారు. ఇదంతా రామస్వామి దగ్గర 10 నెలలు పని చేసినప్పటి పుణ్యమని నాకు అర్థమయ్యింది. EMG test 3వ రౌండ్ కాస్త పెయిన్ ఫుల్ గా ఉంటుంది. ఎన్ని టెస్ట్ లు చేసినా, ఎన్నిసార్లు MRI లు తీసినా నా హెల్త్ ప్రోబ్లం కి సొల్యూషన్ దొరకలేదు. 

నేను ఎక్కడికి వెళ్ళినా B12 ఇంజక్షన్ మంత్లీ చేయించుకోవడం జరుగుతూనే ఉంది. చాలామందికి మెక్సికో వెళితే వీసా స్టాపింగ్ అవుతోందని చెప్పారు. మా ఆయన మాటిమాటికి ఇండియా వెళతాననడంతో, ఇండియా వెళితే వీసా స్టాంపిగ్ ప్రోబ్లం అవుతుందనిపించింది. ఎలాగూ AMSOL కంపెనీ వాళ్ళు I 140 ఫైల్ చేసారు కదాని, మెక్సికో వీసా స్టాంపిగ్ కి వెళడానికి ప్రాసెస్ కంప్లీట్ చేసి, వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని, ఫ్లైట్ టికెట్స్ హ్యూస్టన్ కి తీసుకున్నాము. అక్కడి హోటల్ నుండి వీసా ప్రాసెస్ చూసే మెక్సికన్ అమెరికన్ ఎంబసికి ట్రాన్స్పోర్టేషన్ చూస్తాడు. డ్రాపింగ్, పిక్ అప్ అంతా చూసుకోవడానికి వాడికి మనీ పే చెయ్యాలి ముందే. అంతా పే చేసి, పేపర్స్ అన్నీ రడీ చేసుకుని, కంపెనీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి, హ్యూస్టన్ బయలుదేరాము. హంట్స్విల్ ఎయిర్ పోర్ట్ కి విష్ణు తన కార్ లో మమ్మల్ని డ్రాప్ చేస్తూ, మాటల్లో మారుతి అని తన ఫ్రెండ్ కూడా మెక్సికో వీసా స్టాంపిగ్ కి వెళితే అవలేదని చెప్పాడు. శౌర్య పుట్టిన తర్వాత మారుతి వీసా స్టాంపిగ్ అవలేదని ఇండియా వెళిపోవడం నాకూ గుర్తుంది. కాని మెక్సికో లో తనకి ప్రోబ్లం అయ్యిందని తెలియదు. ఒకింత అనుమానం మెుదలయ్యింది. ముందు చెప్తే బావుండేదిగా అన్నాను. సరే కాని ఏదయితే అది అవుతుంది అని బయలుదేరాం మెక్సికోకి.  ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు

మళ్ళీ కలుద్దాం..

గమనిక: ఔత్సాహిక ప్రవాసులకు గొప్ప అవకాశము. మీ విదేశీ ప్రయాణాలు, లేదా అక్కడ మీ అనుభవాలు, మీ ముచ్చట్లు, మీరు ఎదుర్కున్న ఇబ్బందులు లేదా సంతోషకర విషయలు... ఏదైనా కాని మీరు అందరితో పంచుకోవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలశ్యం... వెంటనే మాకు ఈమెయిలు చేయండి. మేము వాటిని ఆంధ్ర ప్రవాసి లో ప్రచురిస్తాము.  

మా మెయిల్ అడ్రస్: andhrapravasi@gmail.com or

andhrapravasi@andhrapravasi.com

ముందు వారాల లింకులు

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో  ఉగాది పండగ ... వీసా స్టాంప్ కోసం ప్రయత్నాలు ... 28

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో కొత్త కొత్త జాబ్స్ కొత్త కొత్త పరిచయాలు ... 27

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో డెలివరీ తర్వాత పెరిగిన ఖర్చులు, అప్పులు తీర్చటానికి ... 26

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో  సర్జరీ  ... చావు వరకు తీసుకువెళ్ళింది ... 25

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ని డెట్రాయిట్ లో కాళ్ళజోళ్ళ షాపులో ఉద్యోగం రావడం పోవడం ... మళ్ళి హంట్స్విల్ కి ప్రయాణం ... 24

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 3 వారాలనుకున్న జాబు 3 నెలలవరకు... మల్లి ఉద్యోగ ప్రయత్నాల తో డెట్రాయిట్ ప్రయాణం... 23

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉండటం మొబైల్ హౌస్ లో... ఒకసారి కాలు జారి పడితె, ఆసుపత్రిలో ఏమైందంటే... 22

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో మరో కొత్త ఉద్యోగం కొత్త సిటీ లో... కేవలం 3 వారు మాత్రమె... అయితే... 21

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో నుండి ఇండియా రాక... తిరిగి వెళ్ళిన తరువాత ఉద్యోగాల వేట... ఎన్ని ఎబ్బందులో...  20

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉన్నపుడు తన 2 సం// పిల్లవాడికి సీరియస్... అయినా రాలేని పరిస్థితి... 10 నెలల తరువాత ప్రయాణం 19

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు... అక్కడ లైఫ్ అంటే అంత సులభం కాదు... 18

ఆంద్ర ఆడపడుచు అమెరికాకు వెళ్ళింది సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం... ఆర్ధిక మాన్యం తో చివరికి రెస్టారెంట్ లో అంట్లు, బాత్ రూమ్ క్లీనింగ్... 17

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో జీతం ఎకోట్టిన యజమానిపై కేసు... డబ్బు దండగ, ఫలితం సూన్యం... 16

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి... ఘటనకు సాక్షి... 15  

ఆంద్ర ఆడపడుచు ఆ రోజుల్లో అమెరికాలో ఈమెయిలు చేయడానికి ఎన్ని కస్టాల పడాల్సి వచ్చేదో... HIB కి ఎన్ని తిప్పలో... 14

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో H1B విసా కోసం వెతుకులాట... సరైన ఉద్యోగం దొరక్క తాత్కాలికం గా ఆయా గా... అమెరికా వెంకటేశ్వర స్వామి గుళ్ళో... 13

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం లో ఇబ్బందులు... జీతం కుడా ఇవ్వకుండా పని చేపించుకునే యాజమాన్యం... రాజీనామా... మరో ఉద్యోగ వేట... ఎన్ని ఎబ్బందులో... 12

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం అనుభవాలు... అప్పట్లో టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ లు రేట్లు ఎలా ఉండేవో తెలిస్తే... 11

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం... సబ్జెక్టు ఉంది కాని ప్రాక్టికల్ లేదు... ఉదోగం లో ఎలా నెట్టుకు వచ్చిందో... 10

 ఆంద్ర ఆడపడుచు కొత్త ఉద్యోగ లో చేరడం కోసం మరో సిటీకి ప్రయాణం... ఫ్లైట్ డిలే తో 3 కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్... మూడు ఎయిర్ పోర్టులలో నిరీక్షణలో ఏమి జరిగిందంటే... 9

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం కోసం కొత్త కోర్సుల  ట్రైనింగ్... అమెరికా ఇంగ్లిషు యాస కోసం కుకిటులు... 8

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగ అన్వేషణ లో... అక్కడ ఎన్ని కష్టాలో ఉద్యోగం కోసం... జెమ్ షో అంటే ఏమిటి? - 7

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో... థాంక్స్ గివింగ్ రోజు జరిగిన సంఘటన... షాపింగ్ కుడా కష్టమై పోయింది... 6

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా... 5

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా? 4

ఆంద్ర ఆడపడుచు మొదటి సారి విమానం లో అమెరికా ప్రయాణం... ఇబ్బందులు ఎలా ఎదుర్కుంది ఒంటరిగా... స్వ-గత అనుభవాలు... 3

ఆంద్ర ఆడపడుచు అమెరికా విసా కోసం చదువుల ట్రైనింగ్, ప్రయాణం కోసం ఏర్పాట్లు సర్దుకోవతటాలు ... ఆసక్తికరంగా... 2

సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తెలుగు ఆడపడుచు... భూతల స్వర్గం అమెరికా వెళ్ళాలనే పట్టుదల... ఏమైది చివరకు... 1

రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...

తెలుగు ప్రవాసుల కు ఉపయోగపడే వార్తలు, వారికి సంభందించిన వార్తలు, ఆయా దేశాల లో వారికి సంభందించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే...

క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 

Andhra pravasi ఆంధ్ర ప్రవాసి

Pulse of Telugu Migrants తెలుగు ప్రవాసుల జీవ నాడి

https://t.me/joinchat/G6eU_lFHk6AH_IG8zfJqdg

   EMG-test-3వ-రౌండ్