ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో  ప్రాజెక్ట్ లో పాత స్నేహితులను కలవటం ... చుట్టాలకు వీసా స్టాంపిగ్ ప్రాసెస్ ...

Header Banner

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో  ప్రాజెక్ట్ లో పాత స్నేహితులను కలవటం ... చుట్టాలకు వీసా స్టాంపిగ్ ప్రాసెస్ ...

  Tue Nov 03, 2020 16:39        Rachanalu (రచనలు)

 

ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు నైట్ లేట్ అవుతూ ఉండేది. మా మానేజర్ డిన్నర్ తెప్పించేవాడు. అందరికన్నా ముందు నన్ను పిలిచి తీసుకోమనేవాడు. సిటీ గ్రూప్ లో వారంతా చాలా బావుండేవారు మాతో. మా కాలేజ్ ఇంజనీరింగ్ జనాభా చాలామంది డాలస్ లోనే ఉన్నారు. ఝాన్సీ, యశోద, నాగజ్యోతి, అనురాధ ఇంకా చాలామందే ఉన్నారు. నేను వీళ్ళని మాత్రమే కలిసాను. కొందరు జూనియర్స్ అబ్బాయిలు కూడా పలకరించారిక్కడ.

యశోద వాళ్ళ పారని చూడటానికి వాళ్ళింటికి వెళ్ళి,  ఝాన్సీ కొడుకు పుట్టినరోజుకి ఝాన్సీ వాళ్ళింట్లో యశోద డ్రాప్ చేసింది. అక్కడే జ్యోతి కనిపించి, అను కి చెప్తే, అను ఫోన్ చేసి తన కొడుకు పుట్టినరోజుకి రమ్మంటే నాకు వెళ్ళడానికి కుదరకపోతే, తర్వాత తనే మా ఆఫీస్ కి వచ్చి లంచ్ కి నన్ను బయటికి తీసుకువెళ్ళింది.

అను, నీరజల ఫ్రెండ్ భావన కూడా సిటీ గ్రూప్ లోనే వర్క్ చేసేది. మూడు నెలల ప్రాజెక్ట్ 6,7 నెలలు జరిగింది. మధ్యలో లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు, మరో రెండు రోజులు లీవ్ పెట్టి హంట్స్విల్ వెళ్ళి వచ్చేదాన్ని. పాపం మా చైనీస్ కో ఆర్డినేటర్ బాగా కో ఆపరేట్ చేసేది. తను లీవ్ లో వెళ్ళినప్పుడు మేం చూసుకునే వాళ్ళం. 

సాయంత్రం 5 కి మా వర్క్ అయిపోయేది. అవసరం అయినప్పుడు లేట్ అవర్స్ వర్క్ చేసేవాళ్ళం. సంధ్య ఏదో బేబి సిట్టింగ్ జాబ్స్ వెదికితే నైట్ 7 నుండి 11 వరకు పిల్లలని చూసే జాబ్ ఉందని చెప్పింది. నాకు ఆఫీస్ అయ్యాక ఎలానూ ఖాళీనే కదా అని, సంధ్య ఆ జాబ్ నాకు చెప్పింది. అందులోనూ అది రోజూ ఉండదు. అప్పుడప్పుడూ ఉంటుంది. వాళ్ళే వచ్చి పికప్, డ్రాపింగ్ చేస్తానంటే సరేనని ఆ జాబ్ ఒప్పుకున్నాను.

అప్పుడప్పుడూ వీకెండ్ కూడా అడిగేవారు. అలా వచ్చిన డబ్బులు అన్నీ దేవుడికి ఇచ్చేసాను తర్వాత. అంతకు ముందు కూడా పేపర్ లో చూసి ఎవరో పాపకి ఓ 150 డాలర్లు నా దగ్గర లేకపోయినా క్రెడిట్ కార్డ్ నుండి తీసి మరీ పంపాను. నేను చేసింది చిన్న సాయమే వాళ్ళకి. ఓ ఆంటి వాళ్ళంట్లో పనమ్మాయి కూతురు ఆ పాప.

తర్వాత ఆంటి పెద్ద లెటర్ రాశారు. అప్పట్లో వార్త పేపర్ లో కూడా వేసారు ఆ విషయం. నా జాబ్ సిటీ గ్రూప్ లో అయిపోయినప్పుడు డాని, డాన్ లు నాకు సెండాఫ్ పార్టీ ఇచ్చారు. నివాస్ గారిని, తన వైఫ్ అపర్ణని కూడా కలిసాను. మంచి మెమరీస్ డాలస్ సిటీ గ్రూప్ తో. 

డయాబెటిస్ ను సురక్షితం గా తగ్గిoచే మార్గం ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి online orders @ www.morehealthmorelife.com

ఇదే టైమ్ లో మా ఎదురింటికి తెలుగువాళ్ళు వచ్చారు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. తర్వాత పాప పుట్టింది. వాళ్ళ అమ్మానాన్న వచ్చారు. ఎందుకో తెలియదు కాని నాతో ఎంతో బావుండే రమణి గారు మాట్లాడటం మానేసారు. లక్ష్మి గారని తెలుగావిడ ఆ టైమ్ లోనే పరిచయం అయ్యారు. ఏంటో మనుషులు వివిధ రకాలన్నట్టుగా ఉండేవారు. సీతక్క, మామయ్య వాళ్ళు నాతో బావుండేవారు. చౌదరి గారు ఇల్లు కొనుక్కున్నప్పుడు సీతక్క వాళ్ళింటికి తీసుకువెళ్ళింది.

    www.morehealthmorelife.com

 

అంతకు ముందు ఓసారి జనవరి ఫస్ట్ కి ఫంక్షన్ విష్ణు వాళ్ళు చేసినప్పుడు మాట్లాడింది. అప్పటినుంచి రాకపోకలుండేవి మాకు వాళ్ళకి. మా కాకాని డాక్టర్ గారికి మేనల్లుడే మామయ్య. 

కాస్త సిటీ గ్రూప్ లో వర్క్ చేసినప్పుడు అప్పులు చాలా వరకు తీరిపోయాయి. ఈయన నా క్రెడిట్ కార్డ్ ల నుండి కొంత డబ్బు తీసి, మిగతా అమౌంట్ కలిపి ఓ రెండు సైట్లు విజయవాడలో తీసుకోమంటే మా మామయ్య తీసుకున్నాడు. అప్పటికే స్కార్పియెా కూడా లోన్ మీద తీసుకున్నారు. అంతకు ముందే ఈయన వాళ్ళ బావకి ఓ 3.5 లక్షలు ఇచ్చారు. చెల్లెలి పెళ్ళి కి ఓ లక్ష ఇచ్చాము. పెళ్ళి కుదర్చడం నా మెుదటి తప్పు. ఈయన మరదలికి H1B చేయించడానికి నాకు తెలిసిన శామ్ కి 2000 డాలర్లు కట్టి, వీసా క్వరీ పడితే అది క్లియర్ చేయించి, తమ్ముడిని, మరదలికి, వాళ్ళబ్బాయిలకి అమెరికా రావడానికి వీసా స్టాంపిగ్ ప్రాసెస్ చేయించాను. ఇది నా రెండో తప్పు. 

వాళ్ళు ముగ్గురు అమెరికా వస్తూ, మా చిన్నోడు శౌర్య కూడా వస్తానంటే తీసుకు వచ్చారు. వీళ్ళు వచ్చేటప్పటికే మా ఇంట్లో మా సుబ్బారావు అంకుల్ కొడుకు MS చేయడానికి అమెరికా వస్తుంటే నాన్న చెప్తే, వాడిని మేము పికప్ చేసుకుని, పంపిస్తామని చెప్పాము. వాడు హంట్స్విల్ వచ్చాడు. మా పక్కింటి రెడ్డి అంకుల్ తో మాట్లాడి వాడికి A&M యూనివర్శిటీకి మార్చమని చెప్పాము. వాడిని వేరే యూనివర్శిటీకి కౌన్సెలింగ్ రోజుకి తీసుకువెళ్ళి, వాళ్ళతో మాట్లాడి, ఇక్కడికి మార్పించాము. వాడితో పాటు రాజు అని వాడి ఫ్రెండ్ కూడా మా ఇంట్లోనే ఉండేవాడు. 

అప్పటికే నా ఇంజనీరింగ్ క్లాస్మేట్ శ్రీనివాసరెడ్డి ఫామిలీ కొన్ని రోజులు మా ఇంట్లో ఉండి, తర్వాత వేరే ఇల్లు తీసుకుని ఉండేవారు. వీళ్ళందరి కన్నా ముందు విష్ణు వాళ్ళ తమ్ముడు అనిల్ కూడా కొన్ని రోజులు ఉన్నాడు. తర్వాత తను వేరే చోటికి వెళిపోయాడు. అప్పటి నుండి విష్ణు వాళ్ళు నాతో మాట్లాడటం మానేసారు. నాకు సిటి గ్రూప్ ప్రాజెక్ట్ తర్వాత వెంటనే మరొక ప్రాజెక్ట్ వచ్చింది. కాని జాయిన్ కాలేదు. అప్పటికే కాస్త హెల్త్ ప్రోబ్లంగా ఉంది. ఈయన చిన్న విషయానికి చెప్పుడు మాటలు విని బాగా గొడవ పెట్టుకున్నాడు. 

మా మరిది వాళ్ళు వచ్చిన కొన్ని రోజులకు శ్రీనివాసరెడ్డి వాళ్ళు వేరే చోటికి వెళిపోయారు. 

ఇక మా మరిది వాళ్ళు వచ్చాక అసలు సినిమా మెుదలైంది. ఉచిత క్లాసిఫైడ్ కొరకు ఆంధ్ర ప్రవాసి అందిస్తున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలుగులోనే మీ ప్రకటనలు మీరే స్వయం గా పోస్ట్ చేసుకోవచ్చు

మళ్ళీ కలుద్దాం..

గమనిక: ఔత్సాహిక ప్రవాసులకు గొప్ప అవకాశము. మీ విదేశీ ప్రయాణాలు, లేదా అక్కడ మీ అనుభవాలు, మీ ముచ్చట్లు, మీరు ఎదుర్కున్న ఇబ్బందులు లేదా సంతోషకర విషయలు... ఏదైనా కాని మీరు అందరితో పంచుకోవ్వాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలశ్యం... వెంటనే మాకు ఈమెయిలు చేయండి. మేము వాటిని ఆంధ్ర ప్రవాసి లో ప్రచురిస్తాము.  

మా మెయిల్ అడ్రస్: andhrapravasi@gmail.com or

andhrapravasi@andhrapravasi.com

 

ముందు వారాల లింకులు

 

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో కొత్త జాబ్ ... అన్ని దేశాల వారితో ప్రాజెక్ట్ ... అనుభవాలు ...31

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో వీసా ... అమెరికన్ ఎంబసి లో ముప్పు తిప్పలు ... 30

 

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో హెల్త్ ప్రోబ్లమ్స్ ... స్టెరాయిడ్ మిస్ప్లేస్ ... జీవితంలో ఎప్పుడూ పడనంత బాధ ...29

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో  ఉగాది పండగ ... వీసా స్టాంప్ కోసం ప్రయత్నాలు ... 28

 

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో కొత్త కొత్త జాబ్స్ కొత్త కొత్త పరిచయాలు ... 27

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో డెలివరీ తర్వాత పెరిగిన ఖర్చులు, అప్పులు తీర్చటానికి ... 26

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో  సర్జరీ  ... చావు వరకు తీసుకువెళ్ళింది ... 25

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ని డెట్రాయిట్ లో కాళ్ళజోళ్ళ షాపులో ఉద్యోగం రావడం పోవడం ... మళ్ళి హంట్స్విల్ కి ప్రయాణం ... 24

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 3 వారాలనుకున్న జాబు 3 నెలలవరకు... మల్లి ఉద్యోగ ప్రయత్నాల తో డెట్రాయిట్ ప్రయాణం... 23

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉండటం మొబైల్ హౌస్ లో... ఒకసారి కాలు జారి పడితె, ఆసుపత్రిలో ఏమైందంటే... 22

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో మరో కొత్త ఉద్యోగం కొత్త సిటీ లో... కేవలం 3 వారు మాత్రమె... అయితే... 21

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో నుండి ఇండియా రాక... తిరిగి వెళ్ళిన తరువాత ఉద్యోగాల వేట... ఎన్ని ఎబ్బందులో...  20

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉన్నపుడు తన 2 సం// పిల్లవాడికి సీరియస్... అయినా రాలేని పరిస్థితి... 10 నెలల తరువాత ప్రయాణం 19

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు... అక్కడ లైఫ్ అంటే అంత సులభం కాదు... 18

ఆంద్ర ఆడపడుచు అమెరికాకు వెళ్ళింది సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం... ఆర్ధిక మాన్యం తో చివరికి రెస్టారెంట్ లో అంట్లు, బాత్ రూమ్ క్లీనింగ్... 17

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో జీతం ఎకోట్టిన యజమానిపై కేసు... డబ్బు దండగ, ఫలితం సూన్యం... 16

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి... ఘటనకు సాక్షి... 15  

ఆంద్ర ఆడపడుచు ఆ రోజుల్లో అమెరికాలో ఈమెయిలు చేయడానికి ఎన్ని కస్టాల పడాల్సి వచ్చేదో... HIB కి ఎన్ని తిప్పలో... 14

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో H1B విసా కోసం వెతుకులాట... సరైన ఉద్యోగం దొరక్క తాత్కాలికం గా ఆయా గా... అమెరికా వెంకటేశ్వర స్వామి గుళ్ళో... 13

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం లో ఇబ్బందులు... జీతం కుడా ఇవ్వకుండా పని చేపించుకునే యాజమాన్యం... రాజీనామా... మరో ఉద్యోగ వేట... ఎన్ని ఎబ్బందులో... 12

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం అనుభవాలు... అప్పట్లో టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ లు రేట్లు ఎలా ఉండేవో తెలిస్తే... 11

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం... సబ్జెక్టు ఉంది కాని ప్రాక్టికల్ లేదు... ఉదోగం లో ఎలా నెట్టుకు వచ్చిందో... 10

 ఆంద్ర ఆడపడుచు కొత్త ఉద్యోగ లో చేరడం కోసం మరో సిటీకి ప్రయాణం... ఫ్లైట్ డిలే తో 3 కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్... మూడు ఎయిర్ పోర్టులలో నిరీక్షణలో ఏమి జరిగిందంటే... 9

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం కోసం కొత్త కోర్సుల  ట్రైనింగ్... అమెరికా ఇంగ్లిషు యాస కోసం కుకిటులు... 8

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగ అన్వేషణ లో... అక్కడ ఎన్ని కష్టాలో ఉద్యోగం కోసం... జెమ్ షో అంటే ఏమిటి? - 7

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో... థాంక్స్ గివింగ్ రోజు జరిగిన సంఘటన... షాపింగ్ కుడా కష్టమై పోయింది... 6

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా... 5

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది??? ఇలా ఆమెకేనా లేదా అందరికి అదే జరుగుతుందా? 4

ఆంద్ర ఆడపడుచు మొదటి సారి విమానం లో అమెరికా ప్రయాణం... ఇబ్బందులు ఎలా ఎదుర్కుంది ఒంటరిగా... స్వ-గత అనుభవాలు... 3

ఆంద్ర ఆడపడుచు అమెరికా విసా కోసం చదువుల ట్రైనింగ్, ప్రయాణం కోసం ఏర్పాట్లు సర్దుకోవతటాలు ... ఆసక్తికరంగా... 2

సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తెలుగు ఆడపడుచు... భూతల స్వర్గం అమెరికా వెళ్ళాలనే పట్టుదల... ఏమైది చివరకు... 1

రచయిత్రి శ్రీమతి మంజు యనమదల గారి పరిచయం...

 

తెలుగు ప్రవాసుల కు ఉపయోగపడే వార్తలు, వారికి సంభందించిన వార్తలు, ఆయా దేశాల లో వారికి సంభందించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే...

 

క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 

Andhra pravasi ఆంధ్ర ప్రవాసి

Pulse of Telugu Migrants తెలుగు ప్రవాసుల జీవ నాడి

https://t.me/joinchat/G6eU_lFHk6AH_IG8zfJqdg

 


   #Andhra-Pravasi-Pulse-of-Migrants