సీఎం చంద్రబాబు భద్రతకు అటానమస్ డ్రోన్ల సాయంతో పర్యవేక్షణ! బందోబస్తుకు నో చెప్పిన...!
Sun Dec 22, 2024 14:19 Politicsఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) సాంకేతిక సాయాన్ని వినియోగించుకుంటూ తనకున్న భద్రతను గణనీయంగా తగ్గించుకున్నారు. భారీ భద్రత, బందోబస్తుకు దూరంగా ఉంటున్నారు. సీఎం నివాసంలో అటానమస్ డ్రోన్ల సాయంతో పరిసరి ప్రాంతాల భద్రత పర్యవేక్షణను పోలీసులు చేపట్టారు. తక్కువ మంది సిబ్బంది, టెక్నాలజీ సాయంతో ప్రణాళికతో వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో అత్యాధునిక డ్రోన్ను ఏర్పాటు చేశారు. ఆ డ్రోన్ తనకు ప్రోగ్రాం ఇచ్చిన విధంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిసర ప్రాంతాల్లో ఎగిరి వీడియోను షూట్ చేస్తుంది.
ఇంకా చదవండి: అమెరికాలో మృతి చెందిన తెనాలి విద్యార్ధిని! తానా మరియు ప్రభుత్వ సహకారంతో స్వగ్రామం చేరుకున్న మృతదేహం!
సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా ఏవిధమైన మూమెంట్ కనిపించినా.. కొత్త, అనుమానాస్పద వస్తువులు కనిపించినా మానిటరింగ్ టీమ్కు మెసేజ్ పంపుతుంది. సీఎం నివాసంలో పెట్టిన ఈ డ్రోన్ అటానమస్ విధానంలో ఆటోపైలట్గా ఆయా ప్రాంతాల్లో ఎగురుతుంది. మళ్లీ వచ్చి నిర్దేశిత డక్పై ల్యాండ్ అయి తానే ఛార్జింగ్ పెట్టుకుంటుంది. ఈ డ్రోన్ పంపే డేటాను విశ్లేషించడం ద్వారా ఇంటి పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలను తనకు దూరం చేసేలా బందోబస్తు ఉండరాదని సీఎం చంద్రబాబు ఎన్ని సార్లు ఆదేశించినా.. ప్రొటోకాల్ నిబంధనల పేరుతో అధికారులకు అది కష్టతరంగా మారింది.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
సమస్యను అధిగమించేందుకు డ్రోన్ సాంకేతికత ద్వారా తనకున్న సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు గణనీయంగా తగ్గించేశారు. అన్ని జిల్లాల అధికారులు ఈ ఆదేశాలు పాటించాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. సీఎం ఆదేశాలతో భద్రతలో సమూల మార్పులు చేశారు. వైకాపా హయాంలో ముఖ్యమంత్రికి 980 మందితో భద్రత కల్పించేవారు. ప్రస్తుతం చంద్రబాబుకు కేవలం 121 మందితో భద్రత కల్పిస్తున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కాన్వాయ్లో 17 వాహనాలు ఉండగా.. జడ్ ప్లస్ భద్రత ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు వాహన శ్రేణి 11 వాహనాలకే పరిమితమైంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అల్లుఅర్జున్ కు ఊహించని షాక్! నేను చూస్తూ ఊరుకోను - సినీ ఇండస్ట్రీకి రేవంత్ హెచ్చరిక!
ఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్ స ర్కిల్‌లో 342 పోస్టులు!
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!
కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!
తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..
రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!
ఏపీలో కొత్త బైపాస్ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!
మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!
ఏపీ కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు..
USA: H1B వీసా కొత్త రూల్స్ ఇవే.. ఉద్యోగస్తులు కచ్చితంగా అలా చేయాల్సిందే! మరో 20వేల వీసాలను జారీ!
మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్, లోకేష్ స్థానాలు ఇవే! నాగబాబు చేరిక పై..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!
జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!
జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!
ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకు? ఎంత అంటే!
త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్‌లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్‌వి పగటి కలలేనా..
అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!
ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!
టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..
ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #APCM #CBN #security #drones #newthoughts #todaynews #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.