మహా కుంభమేళాకు రైల్వే శాఖ గుడ్ న్యూస్! తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు ఇవే!

Header Banner

మహా కుంభమేళాకు రైల్వే శాఖ గుడ్ న్యూస్! తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు ఇవే!

  Thu Jan 02, 2025 21:50        Travel

జనవరి 14 నుంచి 45 రోజులపాటు జరగనున్న ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి రైల్వే శాఖ పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా.. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మహా కుంభమేళాకు వెళ్లేవారి కోసం అదనంగా 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడటౌన్, ఇక, తెలంగాణ రాష్ట్రంలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లను నడపనుంది. దీంతో మహా కుంభమేళాకు వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ రైళ్ల ద్వారా గమ్యస్థానాలకు చేరవచ్చు. కోట్లాది మంది భక్తులు తరలిరానున్న ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యోగి ఆదిత్యాథ్ సర్కారు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు 1.6 లక్షల టెంట్లతోపాటు 1.5 లక్షల టాయ్‌లెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

 

నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

భక్తుల అవసరాలు, భద్రత కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలతో తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కాగా, కుంభమేళాకు ముందే ఈ ఆస్పత్రిలోని వైద్యులు ఓ మహిళకు తొలి ప్రసవం చేశారు.

 

గంగా నది ఒడ్డున డేరా పట్టణంలో జీవనం కొనసాగించే సోనమ్ అనే మహిళకు ఆదివారం రాత్రి పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ప్రయాగ్‌రాజ్‌లోని తాత్కాలిక ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆ తర్వాత ఆమెకు మగ బిడ్డ పుట్టాడని వైద్యులు తెలిపారు. కుంభమేళా జరిగే చోట పుట్టిన క్రమంలో ఆ చిన్నారికి 'మహాకుంభ్'గా పేరు పెట్టారని వెల్లడించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Travel #Trains #TrainTravel #GangaRiver #Kumbhamela #MahaKumbhamela