విశాఖ సెంట్రల్ జైలులో సెల్ ఫోన్ కలకలం! దిని వెనుక వైకాపా నేత హస్తం వుందా...!

Header Banner

విశాఖ సెంట్రల్ జైలులో సెల్ ఫోన్ కలకలం! దిని వెనుక వైకాపా నేత హస్తం వుందా...!

  Thu Jan 02, 2025 22:17        Politics

విశాఖ సెంట్రల్ జైలు వివాదాలకు కేరాఫ్గా మారింది. జైలులోకి గంజాయి బట్వాడా కలకలం రేపితే.. జైలు అధికారుల వేధింపులకు నిరసనగా సిబ్బంది కుటుంబాలు రోడ్డెక్కడం సంచలనం రేపింది. ఇక ఇప్పుడు లేటెస్ట్గా జైలులో సెల్ఫోన్ల డంప్ మిస్టరీగా మారింది. అత్తారిల్లు అనే మాటకు నిదర్శనంగా మారింది విశాఖ జైలు. కొంతమంది ఖైదీలకు రాచమర్యాదలతో పాటు గంజాయి సప్లయ్ చేస్తున్న వైనాలు ఇటీవల బయటపడ్డాయి. ఫోన్ల డంప్ తెరపైకి వచ్చిన క్రమంలో.. కొందరు క్రిమినల్స్ జైలును అడ్డా చేసుకొని ఫోన్ల ద్వారా సెటిల్మంట్ దందాలు చేస్తున్నారనే అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక సెల్ ఫోన్లు దొరికిన ప్రాంతం పెన్నా బ్యారక్కు అతి సమీపంలో ఉంది. అందులో వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో కీలక నిందితుడుగా ఉన్న రౌడీ షీటర్ హేమంత్ కుమార్ ఉన్నాడు. ప్రస్తుతం ఓ హత్య కేసులో హేమంత్ కుమార్ శిక్ష అనుభవిస్తున్నాడు. మరో రౌడీషీటర్ రాజేష్ కూడా అదే బ్యారక్లో ఉన్నాడు. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు సెల్పోన్ల కేసులో ఆ ఇద్దర్నీ అనుమానితులుగా చేర్చార ఆరిలోవ పోలీసులు.



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 



మొబైల్స్ అయితే దొరికాయి.. కానీ అందులో సిమ్ కార్డ్స్ లేవు.. రహస్యంగా సెల్ఫోన్లను పకడ్బందీగా దాచి ఆ సిమ్ కార్డులను పడేసారా..? లేక మరోచోట ఎక్కడైనా దాచారా..? ఇంతకీ ఆ సిమ్ కార్డులు ఎక్కడ..? ఇంతకీ ఆ మొబైల్స్ జైలు లోపలకి ఎలా వెళ్లాయి..? ..ఈ ఫోన్ల ద్వారా ఎవరు? ఎవరెవరకి కాల్స్ చేశారు? విశాఖ సిపి శంకర్ బ్రత బాగ్చి ఆదేశాలతో ఇలా అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు ఆరిలోవ పోలీసులు. సిఐ మల్లేశ్వర రావు తన సిబ్బందితో వెళ్లి విశాఖ సెంట్రల్ జైలులో విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా పెన్నా బ్యారక్లోని ఖైదీలను వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. పొంతనలేని సమాధాలను ఇచ్చినట్టు తెలుస్తోంది. జైలులో ఫోన్లు రౌడీషీటర్లు హేమంత్ కుమార్, రాజేష్ కోసమేనని, సిబ్బంది సహకారంతోనే ఈ సెటప్ ఏర్పాటు చేశారనే అనుమానాలు అంతకంతకు బలపడుతున్నాయి. నిజాలేంటన్నది ఇక విచారణలో తేలాలి. జైలులో ఫోన్ల వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.కేవలం సిబ్బంది సహకారంతోనే జైలులోకి ఫోన్లు వెళ్లాయా? లేదంటే కొందరు అధికారుల కోపరేషన్ కూడా వుందా? కేంద్ర కారాగారంలో భద్రతా లోపాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు



వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #visakha #central #jail #drugs #todaynews #flashnews #latestupdate