జగన్ అరెస్టు, అమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం! చంద్రబాబు ఏమన్నారంటే?

Header Banner

జగన్ అరెస్టు, అమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం! చంద్రబాబు ఏమన్నారంటే?

  Fri Jan 03, 2025 07:00        Politics

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో అదానీ ఎనర్జీ నుంచి పాతికేళ్ల పాటు 12 వేల మెగావాట్ల సౌర విద్యుత్ పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం సంస్థ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందంపై వివాదం నెలకొంది. సౌర ఒప్పందాల కోసం భారత్ లో ప్రభుత్వాలకు లంచాలు ముట్టజెప్పారంటూ అమెరికా కోర్టులో అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీపై అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సౌర ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వ పెద్దకు కూడా 1750 కోట్ల లంచాలు అందినట్లు అమెరికా కోర్టులో నమోదైన అభియోగాల్లో పేర్కొన్నారు. అయితే ఇంత జరుగుతున్నా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న రూ.7 వేల కోట్ల విలువైన ఒప్పందాన్ని రద్దు చేసేందుకు కానీ, రూ.1750 కోట్ల లంచం ఆరోపణలపై అప్పటి సీఎం వైఎస్ జగన్ ను కానీ ఎందుకు అరెస్టు చేయడం లేదనే ఒత్తిడి చంద్రబాబుపై పెరుగుతోంది.

 

ఇంకా చదవండి: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు!

 

అయితే చంద్రబాబు మాత్రం అన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని గతంలో అసెంబ్లీలో వెల్లడించారు. కానీ తాజాగా ఈ రెండు పనులు తాను ఎందుకు చేయడం లేదో ఓ చిట్ చాట్ లో వెల్లడించారు. గతంలో సౌర ఒప్పందాల విషయంలో లంచం తీసుకున్నారంటూ వైఎస్ జగన్ పై వచ్చిన ఆరోపణలు ఆయన్ను అరెస్టు చేయించడానికి తనకు లడ్డూలాంటి అవకాశం అని సీఎం చంద్రబాబు తాజాగా చెప్పుకొచ్చారు. అయినా జగన్ పై కక్ష తీర్చుకోవడం, అరెస్టు చేయించడం తన లక్ష్యమైతే ఆ పని తాను అధికారంలోకి రాగానే చేసేవాడినన్నారు. తమ పార్టీ శ్రేణులు ఆలోచించే దానికీ, తన ఆలోచనకూ చాలా తేడా ఉందన్నారు. తద్వారా తనను అరెస్టు చేయించిన జగన్ అరెస్టుకు తాను సిద్ధంగా లేనన్నారు. మరోవైపు అదానీ ఎనర్జీతో గత వైసీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో అక్రమాలు జరిగాయని అప్పట్లోనే ప్రస్తుత ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు అమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం రద్దు చేయాలనే ఒత్తిడి పెరుగుతోంది. అయినా ముందుకు రాకపోవడంపైనా చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఈ ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాల్సి వస్తుందని, అదే కారణంతో తాను ఈ వివాదాస్పద ఒప్పందం రద్దు చేయడం లేదని చంద్రబాబు తేల్చేశారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్!

ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం! సాంకేతిక ప్రణాళికలు సిద్ధం!

గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారా? ఇక ఆ UPI ఐడీలు పని చేయవు!

శబరిమల వెళ్ళేవారికి సూపర్ గుడ్ న్యూస్! గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం రంగం సిద్ధం!

ఏపీ క్యాబినెట్ భేటీలో సీఏం చంద్రబాబు కీలక నిర్ణయాలు! ఆ పథకాల అమలుకు ముహూర్తం ఫిక్స్!

టీడీపీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్! దేశ చరిత్రలో తొలిసారి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews