రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!

Header Banner

రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!

  Sat Jul 20, 2024 07:30        Health

రాత్రి పడుకునే ముందు చేస్తే కొన్ని పనులు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. రాత్రి పడుకునే ముందు చేస్తే చిన్న చిన్న పనులతో మనకు బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అటువంటి వాటిలో ఒకటి రాత్రి పడుకునే ముందు కాస్త వేడి నీళ్లు తాగడం. రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లు తాగడం వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ వేడి నీళ్లు తాగితే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది రక్తప్రసరణను మరింత మెరుగుపరుస్తుంది. శరీరంలోని మలినాలను సులభంగా తొలగించి మన శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. చాలామంది మలబద్ధకం లేదా అజీర్ణం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని ఇళ్లను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం సమస్యలు తగ్గుతాయి.

 

ఇంకా చదవండి: ఐదు రోజుల్లోనే బ్రెయిన్ ట్యూమర్ మాయం! ఆసక్తికర విషయాలు వెల్లడించిన పరిశోదకులు!

 

గ్లాసు వేడినీళ్లు తాగడం వల్ల కడుపు శుభ్రం అవ్వడమే కాకుండా మీ జీర్ణవ్యవస్థ బాగుపడుతుంది. చాలామంది బరువు తగ్గాలని భావిస్తూ ఉంటారు. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడినీటిని తాగితే మంచిదని చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి నీటిని కచ్చితంగా తీసుకుంటే బరువు తగ్గుతారు. ఉదయం పూట వేడి నీళ్లు తాగే వాళ్ళ కంటే రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లు తాగే వారిలో బరువు వేగంగా తగ్గుతుందని గుర్తించారు. ఇది శరీర మెటబాలిజం కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. రాత్రిపూట పడుకునే ముందు కాస్త వేడి నీళ్లు తాగితే గ్యాస్ సమస్యల నుంచి కూడా ఉపశమనం వస్తుంది. కనుక ప్రతిరోజు క్రమం తప్పకుండా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లను తాగండి. కొద్దిరోజులు తాగి, కొద్ది రోజులు మానేస్తే ఫలితం ఉండదు. కాబట్టి రాత్రిపూట గోరువెచ్చని నీళ్లను తాగడం ప్రతిరోజు జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. అప్పుడే శరీరంలోని మలినాలు తొలగిపోయి బాడీ డిటాక్స్ అవుతుంది. అంతేకాదు జీవక్రియ మెరుగుపడి మన శరీరాన్ని యాక్టివ్ చేస్తుంది. మరి ఎందుకు ఆలస్యం ఈ చిన్న టిప్ ను తప్పకుండా ఫాలో చేయండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో..


ఇంకా చదవండి: మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కు బ్రేక్ వేసిన పోలీసులు! వారికి నో ఎంట్రీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తస్మా జాగ్రత్త! ఎలక్ట్రిక్ హీటర్‌ నీళ్లతో స్నానం చేస్తున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన నిజాలు!

 

తెలుగు రాష్ట్రాలలో మహిళలకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన బంగారం ధర!

 

ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన విమాన సేవలు! కారణం ఏంటంటే!

 

చంద్రబాబు బెయిల్ పిటిషన్! విచారణ మరోసారి వాయిదా!

 

అమెరికాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం! రష్యాకు దారి మళ్లింపు! ఎందుకో తెలుసా?

 

రామ్ చరణ్ కు మరో అంతర్జాతీయ గౌరవం! ఆస్ట్రేలియాలో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ కు!

 

రైతులకు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్! వారికి మూడేళ్లు సబ్సిడీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #HealthCare #Tips #Sleep