ఛాయ్ ఎంతసేపు మరిగిస్తున్నారు? ఎక్కువ సేపు మరిగిస్తే - డేంజర్ అంటున్న నిపుణులు!

Header Banner

ఛాయ్ ఎంతసేపు మరిగిస్తున్నారు? ఎక్కువ సేపు మరిగిస్తే - డేంజర్ అంటున్న నిపుణులు!

  Sun Jul 21, 2024 07:30        Health

తేనీరు సేవించనివారంటూ ఎవరు ఉండరు. తలనొప్పిగా అనిపించినా, పనిలో ఒత్తిడి ఉన్నా వాటి నుంచి ఉపశమనం కలగాలంటే ఒక కప్పు ఛాయ్ తాగాల్సిందే. ఉదయాన్నే నిద్ర లేవగానే టీ తాగి దినచర్యను ప్రారంభించేవారే ఎక్కువ. రుచినిబట్టి, ఆరోగ్యాన్ని బట్టి బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, మిల్క్ టీ తాగుతుంటారు. వీటిలో మిల్క్ టీ అంటే అందరికీ ఇష్టం. పాలల్లో ఎక్కువగా టీ ఆకులు వేసి ఎక్కువసేపు మరిగించి తయారుచేసిన తేనీరు అంటే బాగా ఇష్టపడుతుంటారు. అయితే టీని ఎక్కువసేపు మరిగించడంవల్ల ఆరోగ్యానికి ఎంతో హాని అని, అతిగా మరిగిస్తే స్లో పాయిజన్ గా మారిపోవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. తేనీరు రుచిగా, ఆరోగ్యంగా ఉండేందుకు నాలుగు నుంచి ఐదు నిముషాలే మరిగించాలి. శరీరంలో ఐరన్, కాల్షియం లోపం తలెత్తుతుంది. టీని అధిక సమయం మరించడంవల్ల టానిన్ ల పరిమాణాన్ని పెంచుతుంది.

 

ఇంకా చదవండి: తస్మా జాగ్రత్త! ఎలక్ట్రిక్ హీటర్‌ నీళ్లతో స్నానం చేస్తున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన నిజాలు!

 

శరీరం పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది. అధిక టానిన్ శరీరంలో ఇనుము లోపం తలెత్తేలా చేస్తుంది. దీనివల్ల రక్తహీనత కలుగుతుంది. మిల్క్ టీని ఎక్కువగా మరిగిస్తే దాని pH మారిపోతుంది. టీ మరింత ఆమ్లంగా మారుతుంది. ఎక్కువగా మరిగితే ఆరోగ్యానికి హాని కలిగించే అక్రిలామైడ్ అనే క్యాన్సర్ కారక పదార్థం ఉత్పత్తి అవుతుంది. ఎసిడిటీ, కడుపు నొప్పి, మలబద్దకంలాంటి సమస్యలు ఎదురవుతాయి. మరిగించిన తేనీరును మరింత మరిగించడం వల్ల దానిలో టానిన్ పరిమాణం పెరగడంతోపాటు రక్తపోటును పెంచుతుంది. అంతేకాదు.. టీ రుచి కూడా మారిపోతుంది. పాలల్లో ఉండే ప్రొటీన్, విటమిన్ డి, కాల్షియం వంటి అనేక పోషకాలు నాశనమవుతాయి. టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల పాలలోని కాల్షియం, విటమిన్లు, విటమిన్ బి, బి12, సి వంటివాటితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా నశిస్తాయి.


ఇంకా చదవండి: మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కు బ్రేక్ వేసిన పోలీసులు! వారికి నో ఎంట్రీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేను అంబానీ చుట్టాన్ని కాదా? పెళ్లికి నన్నెందుకు పిలవలేదు? క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నానని..జ్యోతిరెడ్డి

 

సినీనటి పై పోలీసు కేసు! అసలు ఆమె ఏమి చేసిందంటే?

 

శవ రాజకీయాలు చేయడం జగన్‌ పద్ధతి! 151 నుంచి 11 స్థానాలకు పడిపోయిన సైకో!

 

ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...

 

ఏపీకి శుభవార్తను వినిపించిన కేంద్ర ప్రభుత్వం! విజయవాడ డివిజన్ పరిధిలో 40 రైళ్లకు కొత్తగా 30 రైల్వేస్టేషన్లలో హాల్టింగ్!

 

సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!

 

రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తులకు శుభవార్త! రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం!

 

రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #HealthCare #TIps #Tea