ఈ సమస్యలు ఉన్నవారు టమాటాలు తినకూడదా! వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!

Header Banner

ఈ సమస్యలు ఉన్నవారు టమాటాలు తినకూడదా! వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!

  Fri Aug 09, 2024 15:11        Health

ఈ రోజుల్లో ఏ కూర వండినా అందులో వేయడానికి టమాటాలను తప్పకుండా వాడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అవి లేకుండా కూరలు రుచిగా ఉండవని చెప్తుంటారు. మంచి గ్రేవీ కూడా ఉంటుంది కాబట్టి అందరూ వాడేందుకే ఇష్టపడతారు. పైగా యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు టమాటాల్లో ఫుల్లుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది. అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం వాటిని తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం.

 

ఇటీవల కిడ్నీ సమస్యలు పెరుగుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ తో చాలామంది. బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య ఉన్నవాళ్లు టమాటాలను నేరుగా కానీ, వంటకాల్లో కానీ తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీటిలో కాల్షియం ఆక్సలేట్ అధికంగా ఉండటంవల్ల స్టోన్స్ పెరుగుదలను మరింత ప్రోత్సహిస్తుంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కీళ్ల నొప్పులు, శరీరంలో వాపు సమస్యతో బాధపడేవారు కూడా టమాటాలను తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇవి సమస్యను మరింత పెంచుతాయి. టమాటాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నప్పటికీ అందులోని ఇతర పోషకాలు, ఆమ్ల గుణాలు నొప్పి నివారణకు ఆటంకం కలిగిస్తాయని నిపుణులు చెప్తున్నారు.

 

వాంతులు, విరేచనలు, ముఖ్యంగా డయేరియాతో బాధపడుతున్నవారు టమాటాలను తినకూడదు. వీటిలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా విరేచనాలను మరింత ప్రేరేపిస్తుంది. అలాగే విటమిన్ సి అధికంగా ఉండటం, ఆమ్ల గుణాలు కలిగి ఉండటం మూలంగా అప్పటికీ గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యతో బాధపడేవారు టమాటాలను తినకూడదు. అలాగే స్కిన్ అలెర్జీలు, గుండెల్లో మంట వంటి ఇబ్బందులు ఉన్నవారు కూడా టమాటాలు తినకూడదని నిపుణులు చెప్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారాబ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నానివంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసాఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Health #LifeStyle #Tomatoes #Kidneys #KidneyStones