చలితో వణుకుతున్న ఏపీ వాసులకు బంగాళాఖాతం భారీ హెచ్చరిక! రెండు రోజుల తర్వాత అతి భారీ వర్షాలు!
Thu Nov 21, 2024 15:54 Environmentతెలుగు రాష్ట్రాలలో ఈ నవంబర్ మాసంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఇక ఇదే సమయంలో చలికి తోడు వర్షాలు కూడా పడుతున్న క్రమంలో భిన్న వాతావరణ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడబోతుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈరోజు దక్షిణ అండమాన్ సముద్రం మరియు దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది పశ్చిమ వైపు దిశగా పైనుంచి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఎల్లుండి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. దీంతో 24వ తేదీ నుంచి రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మరో రెండు రోజుల తర్వాత అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత కొద్ది రోజుల నుంచి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురవడానికి కారణం అవుతున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఇంకా చదవండి: ఒకేసారి ఇద్దరు భామలూ ఇలా మాయమైపోయారే! ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరో తెలుసా?
వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని చెబుతున్నారు. ఇక ఏపీలో ఈనెల 27, 28 తేదీలలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా రైతులు ఇప్పటినుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఇప్పటికే వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో అల్పపీడనం కారణంగా కురిసే వర్షాలతో తీర ప్రాంతం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరోవైపు మత్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు ఇప్పటికే సూచించారు. ఇదిలా ఉంటే ఏపీలో ఈరోజు, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఏపీలో చలి తీవ్రత పెరిగింది. ఇక ఇదే సమయంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ వాసులు వణికిపోతున్నారు.
ఇంకా చదవండి: ఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
శుభవార్త: మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కూటమి సర్కార్! లక్షల మందికి ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!
శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!
నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!
ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!
మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.