విద్యార్థులకు గుడ్ న్యూస్! ఉచితంగానే రూ. 48 వేలు - అదిరిపోయే స్కీమ్! ఏ తరగతి నుంచి అంటే - ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు!

Header Banner

విద్యార్థులకు గుడ్ న్యూస్! ఉచితంగానే రూ. 48 వేలు - అదిరిపోయే స్కీమ్! ఏ తరగతి నుంచి అంటే - ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు!

  Wed Aug 14, 2024 07:00        India, Politics

విద్యార్థులకు బంపర్ గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. మీరు ఉచితంగానే రూ. 48 వేలు పొందొచ్చు. ఏటా రూ. 12 వేలు చొప్పున లభిస్తాయి. ఎలా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది. 8వ తరగతి చదివే పిల్లలకు ఇది వర్తిస్తుంది. నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) స్కీమ్ అందుబాటులో ఉంది. ఇప్పటికే 2024-25 సంవత్సరానికి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. వచ్చే నెల 6 గడువుగా ఉంది. అందువల్ల మీరు వెంటనే దీని కోసం అప్లై చేసుకోండి. సత్తా చాటితే స్కాలర్‌షిప్ పొందొచ్చు. విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నారు. పరీక్షలో ప్రతిభ చూపిన వారికి 4 ఏళ్లు ఏటా రూ.12 వేలు ఆర్థిక సాయం లభిస్తుంది. కేంద్రం ఈ మేరకు డబ్బులు అందిస్తుంది. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుకునే విధంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రాథమికోన్నత, మున్సిపల్, ఎయిడెడ్‌ పాఠశాలలతో పాటు ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు.

 

ఇంకా చదవండి: రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!

 

అలాగే కుటుంబ వార్షికాదాయం రూ.3.50 లక్షలు లోపు ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులకు 7వ తరగతిలో 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు 50 శాతం మార్కులు రావాలి. కుల, ఆదాయ ధ్రువపత్రాలతో పాటు 7వ తరగతి ఉత్తీర్ణత పత్రాలు ఉండాలి. డిసెంబరు 8న ఉదయం 10 నుంచి 1 గంట వరకు 180 మార్కులకు పరీక్ష ఉంటుంది. దీనిలో మెంటల్‌ ఎబిలిటీ 90 మార్కులు, స్టాటిస్టిక్‌ ఎబిలిటీ 90 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఏడు, ఎనిమిది తరగతులకు చెందిన గణితం, సైన్స్, సోషల్‌ సబ్జెక్టులపై ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్లంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ప్రధానోపాధ్యాయుని సమక్షంలో నమోదు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100 ఎస్‌బీఐ కలెక్ట్‌ ద్వారా పరీక్ష రుసుం చెల్లించాలి. ‘దరఖాస్తు చేసినప్పటి నుంచి ప్రణాళిక ప్రకారం చదివాను. అధ్యాపకుల సూచనల మేరకు రోజు గంట సమయం కేటాయించాను. ఇలా మూడు నెలలు చదివి గత ఏడాది ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష రాసి ఉపకార వేతనానికి ఎంపికయ్యాను. ఉపాధ్యాయులు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు’ అని గాంధీనగరం జీవీఎంసీ ఉన్నత పాఠశాల ఎం.జాన్ తెలిపారు.

 

ఇంకా చదవండి: విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!

 

వాలంటీర్లకు గుడ్ న్యూస్! నెలకి రూ.10 వేల జీతం.. ఎప్పటి నుంచంటే? వీరికి ఉద్యోగం సచివాలయంలోన లేక వేరే శాఖలోనా?

 

ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!

 

శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!

 

ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!

 

వైసీపీకి మరో షాక్ - అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు! దానికి కారణం అదేనా!

 

3303 అడుగుల అత్యంత భారీ జెండాతో తిరంగ ర్యాలీ! విజయవాడ పురవీధుల్లో! రికార్డు స్థాయిలో అతిరథ మహారథులతో!

 

వచ్చే నెల నుండి కొత్త రూల్! అలా చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్!

 

ఫ్రీ హోల్డ్ పేరుతో చేసిన అక్రమాలపై ప్రభుత్వం రెడ్ అలర్ట్! ప్రజా భూములపై వైసీపీ నేతల దుర్వినియోగం!

 

రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి ఒకేసారి రూ.15 వేలు! ప్రభుత్వం కీలక ప్రకటన?

 

కూటమి సంచలన నిర్ణయం! ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం! కారణం ఏంటి?

 

సుబానీ హోటల్ డ్రామా, చీకటి దందా వెలుగులోకి! డ్రగ్స్ తో గుంటూరు దద్దరిల్లింది!

 

సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?

 

దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!

 

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!

 

రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!

 

కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance