ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!

Header Banner

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!

  Sat Sep 14, 2024 15:14        India

నేటి సమాజంలో ఆధార్‌ కార్డు వినియోగం ఎంత కీలకంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. సిమ్‌ కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరవడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయ విక్రయాలు.. ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ వంటి వాటికి అధార్‌ తప్పనిసరి అయ్యింది. అయితే.. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యక్తుల ముఖాల్లో తేడాలు వస్తుండడం సర్వసాధారణం. దీంతోపాటు ఇంటి చిరునామాలు మారుతుండడంతో అటు అధికారులు, ఇటు ఆధార్‌ కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించేందుకు ఆధార్‌లో మార్పులు, చేర్పులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (Unique Identification Authority of India) ఎప్పటికప్పుడు అవకాశం కల్పిస్తూ వస్తున్నది.

 

ఇంకా చదవండిరూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ క్రమంలోనే పదేండ్ల క్రితం నాటి ఆధార్‌ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువు నేటి ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉడాయ్‌ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ప్రకటన చేసింది. ఉచితంగా ఆధార్‌ కార్డుల్లోని వివరాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు డిసెంబర్‌ 14 వరకూ గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఉడాయ్‌ అధికార వెబ్‌సైట్‌ http://myaadhar.uidai.gov.inలో ఆధార్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ సాయంతో లాగిన్‌ అయి వివరాలను ఉచితంగానే అప్‌డేట్‌ చేసుకోవచ్చు. 

 

ఇంకా చదవండిజగ్గయ్యపేటలో వైసీపీకి దిమ్మతిరిగే షాక్! ప్రముఖ నేత టిడిపిలో చేరిక! మరికొంతమంది వైసీపీ నేతల మార్పు? 

 

ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకోండిలా..

https:// myaadhaar.uidai.gov.in పోర్టల్‌లో ఆధార్‌ నంబర్‌ ద్వారా లాగిన్‌ కావాలి. ప్రొసీడ్‌ టు అప్‌డేట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆధార్‌ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేసిన అనంతరం డాక్యుమెంట్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే స్క్రీన్‌పై వివరాలు వస్తాయి. వాటిని పూర్తిగా పరిశీలించి సవరణ ఉంటే చేయాలి. లేదంటే ఉన్న వివరాలతోనే నెక్ట్స్‌పై క్లిక్‌ చేయాలి. కిందికి స్క్రోలింగ్‌ చేస్తే వచ్చే ప్రూఫ్‌ ఆఫ్‌ ఐడెంటిటీ, ప్రూఫ్‌ ఆఫ్‌ అడ్రస్‌ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. ఆయా డాక్యుమెంట్లను స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేస్తే అప్‌డేట్‌ పూర్తయినట్లు పోన్‌ నెంబర్‌కు పద్నాలుగు అంకెల అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నెంబర్‌ వస్తుంది. దీని ద్వారా స్టేటస్‌ తెలుసుకోవచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఐఆర్‌సీటీసీ వెంకటాద్రి టూర్ ప్యాకేజీ.. అతి తక్కువ ఖర్చుతో 4 రోజుల తిరుమల యాత్ర! ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దొరకదు!

 

మద్యం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌! ఆ రెండు రోజులు వైన్స్‌ బంద్‌!

 

ఈ ఆరు దేశాల్లో వాట్సాప్‌పై నిషేధం! దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసా?

 

రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం! 77వేల మంది పదో తరగతి విద్యార్ధులకు!

 

చిన్న పరిశ్రమల నిర్వాహకులకు చంద్రబాబు గుడ్ న్యూస్! కేంద్ర ప్రభుత్వం ఈ నిధికి రూ.900 కోట్లు!

 

ఏపీతెలంగాణకు మళ్లీ భారీ వర్షాలు! పొంచి ఉన్న మరో ముప్పు..! ఆ జిల్లాలకు అలర్ట్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #India #AadhraCard #CentralGovernment #AadharUpdate