ప్రయాణికులకు ఆర్‌టీసీ అదిరే శుభవార్త.. వారికి స్పెషల్ బస్‌లు! బస్టాండ్‌లో ఉదయం 6 గంటలకు!

Header Banner

ప్రయాణికులకు ఆర్‌టీసీ అదిరే శుభవార్త.. వారికి స్పెషల్ బస్‌లు! బస్టాండ్‌లో ఉదయం 6 గంటలకు!

  Mon Sep 16, 2024 07:00        India, Travel

ఈ నెల 18న పౌర్ణమి సందర్భంగా అరుణాచలం, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ సందర్శనకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ధర్మవరం డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేశారు. ఈ మేరకు డిపో మేనేజర్ సత్యనారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 17న ధర్మవరం బస్టాండ్‌లో ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరి వెళుతుంది. రానుపోను ఛార్జీలు ఒకరికి రూ.1,400 చొప్పున వసూలు చేస్తారు. చాలా వరకు పుణ్య క్షేత్రాలలో భగవంతుడు కొండ పైన కొలువుదీరి ఉంటాడు. అయితే అరుణాచలంలో ఆ కొండేయే పరమశివుని స్వరూపం. అరుణాచల పురాణంలో ఈ క్షేత్రం వివరాలు సవివరంగా చెప్పారు. ఈ పురాణము వ్రాసిన వారు శైవ ఎల్లప్ప నావలార్ అని అంటారు. అయితే ఎల్లప్ప నాయనార్ వ్రాసేరని ఇంకొంత మంది చెబుతారు. ఈ పురాణంలో ఆ కొండయే ఆది లింగము. ఈ కొండకు ప్రదక్షిణం చేస్తే, మొత్తం అన్ని లింగాలకు ప్రదక్షిణ చేసినట్టేనని చెబుతుంటారు. ఈ కొండలో ఎన్నో ఔషధ గుణాలున్న మూలికలు ఉంటాయి అని.

 

ఇంకా చదవండి: మంగళగిరి బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి మంత్రి లోకేశ్ ఆర్థిక సాయం! స్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ర్యాంకింగ్!

 

అందుచే ఈ గిరిప్రదక్షిణ చేస్తే, ఆ మూలికల తాలుకు వీచే గాలి, మనకు ఆరోగ్యమును చేకూర్చటయే కాక మనస్సు భగవంతుని పైన సులభంగా నిలిచేలాగా చేస్తుంది. ఈ కొండ వైపు ఒక అడుగు వేస్తే, యజ్ఞం చేసిన ఫలితము, రెండు అడుగులు వేస్తే, రాజసూయ యజ్ఞ ఫలితము, మూడు అడుగులు వేస్తే అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితము దక్కుతాయి. గిరిలో ఎంతో మంది సిద్ధపురుషులు తపస్సులో ఉంటారు అని.. వారు సాధారణంగా మన కళ్ళకు కనపడరు. వీరు కూడా కొండకు తమదైన పద్ధతిలో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అయితే వారు ఆ కొండ చుట్టూ ఉన్న మార్గంలో కుడి వైపున ప్రదక్షిణ చేస్తారు. అందువలన మనం చేసే ప్రదక్షిణం ఆ బాటకు ఎడమప్రక్క నుండి మాత్రమే చేయాలి, వారికి అవరోధం కలగకుండా.. ఈ పర్వతం చుట్టూతా ఎనిమిది దిక్కులలో ఎనిమిది విశేష లింగములు ఉన్నవి. ఇవి తూర్పున - ఇంద్ర ఆగ్నేయమున - అగ్ని దక్షిణమున - యమ నైఋతిన - నిఋతి పశ్చిమమున - వరుణ వాయవ్యమున - వాయు ఉత్తరమున - కుబేర ఈశాన్యమున - ఈశాన్య లింగములు. పూర్తి వివరాలకు 63031 51302, 99592 25859లో సంప్రదించవచ్చు.

 

ఇంకా చదవండి: కొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇండియాలో విమాన ప్రయాణాలు చేస్తున్నారా? ఎయిర్ పోర్టు లాంజ్ లో ఫ్రీగా ఎంట్రీ ఎలా పొందవచ్చు! ఈ 6 ఈజీ స్టెప్స్ పాటించండి!

 

విజయవాడ నుండి త్వరలో అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు నేరుగా! నిధులకు కొరత లేదు! విమానాశ్రయం విస్తరణ జూన్ 2025 కి పూర్తి!

 

ఏలేరు వరద నష్టం ముమ్మాటికి సైకో జగన్ వల్లనే! రివర్స్ టెండర్ అని రాష్ట్రాన్ని ముంచేసాడు! కోటాను కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు!

 

వరద ప్రాంతాలలోని చిన్నచిన్న గల్లీలలో ఆ మంత్రి బైక్ పై సుడిగాలి పర్యటన! అన్ని వీధులు శానిటేషన్ పనులు! అంతలాది కార్మికులతో క్లీనింగ్ పనులు

 

సైకో జగన్ వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తుంటే బాణాసంచా పేల్చి సంబరాలు చేసిన వారికీ! ముంపు ప్రాంతాల్లో దొంగలించిన దొంగలకు తేడా ఏముంది! బులుగు బ్యాచ్ ని చూస్తే అసహ్యం వేస్తుంది!

 

జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!

 

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu