మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కు బ్రేక్ వేసిన పోలీసులు! వారికి నో ఎంట్రీ!

Header Banner

మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కు బ్రేక్ వేసిన పోలీసులు! వారికి నో ఎంట్రీ!

  Fri Jul 19, 2024 13:27        Politics

వినుకొండ వెళుతున్న ఏపీ మాజీ సీఎం జగన్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు బయలు దేరిన వైసీపీ నాయకుల వాహనాలను నిలిపివేశారు. బుధవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై హత్యకు గురైన వైసీపీ కార్యకర్త షేక్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ వినుకొండకు బయలుదేరారు. వర్షం కారణంగా రోడ్డు మార్గం ద్వారా బయలు దేరడంతో ఆయన వెంట వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు పదుల సంఖ్యలో కాన్వాయ్ తో బయలుదేరారు. అయితే వీరందరినీ పోలీసులు ఎక్కడికక్కడ రోడ్లపైనే నిలిపివేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

వినుకొండలో 144 సెక్షన్ అమలులో ఉండటంతో ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదు. దీంతో మాజీ సీఎం కాన్వాయ్ ను పోలీసులు ఆపారు. ఆయనతో పాటు వినుకొండకు బయలుదేరిన వైసీపీ నాయకుల వాహానాలను తాడేపల్లి, మంగళగిరి, గుంటూరుతో సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ సెక్యూరిటీ నడుమ జగన్ మోహన్ రెడ్డిని మాత్రమే అనుమతించడంతో.. ఆయన మరొక వాహానంలో బయలుదేరారు. దీనిపై గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి స్పందిస్తూ.. వినుకొండలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఎలాంటి ర్యాలీలకు, ప్రదర్శనలకు అనుమతి లేదని తెలిపారు.

 

ఇంకా చదవండి: క్యాడర్ కు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! పార్టీ కోసం టిక్కెట్ త్యాగం చేసిన వారికి!

 

వైసీపీ నేత జగన్ వచ్చి పరామర్శించవచ్చు. కానీ జనసమీకరణకు, ప్రదర్శనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దని ఐజీ పేర్కొన్నారు. కాగా పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై షేక్ రషీద్ అనే యువకుడిని, షేక్ జిలానీ అనే వ్యక్తి అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశాడు. అయితే వీరిద్దరూ గతంలో మిత్రులేనని, ఖాన్ ముఠాలో సభ్యులుగా ఉన్నారని పోలీసులు విచారణలో వెల్లడైంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తెలుగు రాష్ట్రాలలో మహిళలకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన బంగారం ధర! 

 

వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ కీలక ప్రకటన! త్వరలో 5జీ సేవలు ప్రారంభం!

 

ఏపీలో పలు చోట్ల కుండపోత వర్షాలు! ఆ జిల్లాల్లో స్కూల్లకు సెలవు!

 

కొడాలి షాక్.. కోర్టును ఆశ్రయించిన పాఠశాల యాజమాన్యం! ఇక జైలుకేనా?

 

ఖతార్ లో ఎన్టీఆర్ 101 వ జయంతి ఘనంగా వేడుకలు! భారీగా హాజరైన అభిమానులు! ఒక సంక్షోభంలో తెలుగువారు ఎలా ఐక్యంగా ముందుకెళ్లాలో..

 

బాలిక అదృశ్యం ఘటనలో చర్యలు.. ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు!

 

విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు! సకాలంలో వైద్యసేవలు అందేలాజేసిన భువనేశ్వరి!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #YCP #CBN #YSJagan #AndhraPradesh #APGovernment #Vinukonda