వైసీపీకి షాక్! వైఎస్ జగన్ సమావేశానికి ఐదుగురు ఎంపీలు డుమ్మా!

Header Banner

వైసీపీకి షాక్! వైఎస్ జగన్ సమావేశానికి ఐదుగురు ఎంపీలు డుమ్మా!

  Sun Jul 21, 2024 15:29        Politics

రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. వైఎస్ జగన్ పార్టీ నేతలతో ఓటమికి గల కారణాలపై సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గతంలో వైసీపీ పట్ల విముఖత చూపెట్టిన పలువురు నేతలు పార్టీ సమావేశాలకు అటెండ్ అవ్వడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఊహించని షాక్ తగిలింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

జగన్ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటరీ పార్టీ భేటీలు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మిగిలిన ఎంపీలను భేటీలకు పిలుస్తున్నారు. తాజాగా శనివారం నిర్వహించిన పార్లమెంటరీ సమావేశానికి ఐదుగురు రాజ్యసభ సభ్యులు హాజరు కాలేదని సమాచారం. దీనిపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ భేటీకి డుమ్మా కొట్టిన కొంతమంది ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం నడుస్తోంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పరామర్శకు వెళ్లి పథకాల గురించి మాట్లాడతారా? హోం మంత్రి తీవ్ర ఆగ్రహం!

 

పెన్షన్ ల పంపిణీ పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ప్రతి నెలా ఆ తేదీన!

  

సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!

  

రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!

    

ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #YCP #CBN #YSJagan #NaraLokesh #AndhraPradesh #AP #APGovernment #YSRCP