గత ప్రభుత్వం చేసిన తప్పులపై గవర్నర్ ప్రసంగం! వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళన!

Header Banner

గత ప్రభుత్వం చేసిన తప్పులపై గవర్నర్ ప్రసంగం! వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళన!

  Mon Jul 22, 2024 10:57        Politics

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం కొనసాగుతోంది. ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం చేసిన తప్పులపై ప్రస్తుత ప్రభుత్వం తరపున ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “విభజనతో రాష్ట్రంలో లోటు బడ్జెట్ మిగిలింది. దీంతో రాష్ట్రం ఒడిదుడుకులకు లోనైంది. వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన చేసింది. ప్రతీకార రాజకీయాలు చేసింది. విభజన అశాస్త్రీయంగా జరిగింది. దీంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. 2014-19 మధ్య రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి. పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూడలేదు. 2019లో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న సమయంలో అధికారం మారింది. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టులపై మూల ధన వ్యయం 56 శాతానికి పడిపోయింది." అని గవర్నర్ నజీర్ పేర్కొన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇదిలా ఉండగా అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తుంటే. నల్ల కండువాలతో సమావేశాలకు హాజరైన వైసీపీ సభ్యులు సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్! వైఎస్ జగన్ సమావేశానికి ఐదుగురు ఎంపీలు డుమ్మా!

 

పరామర్శకు వెళ్లి పథకాల గురించి మాట్లాడతారా? హోం మంత్రి తీవ్ర ఆగ్రహం!

 

పెన్షన్ ల పంపిణీ పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ప్రతి నెలా ఆ తేదీన!

  

సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!

  

రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే ఆరోగ్యమస్తు! అరే చిన్న చిట్కా చేస్తే పోలా!

    

ఒమన్: భారత ఎంబసీ నిద్రపోతుందా? పార్కుల్లో, బీచుల్లో నివాసం ఉంటున్న తెలుగు ఆడవాళ్లను పట్టించుకోదా...

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly