పవన్ విజ్ఞప్తితో ఏపీకి నిధులిచ్చిన మోడీ! అదనంగా రూ.2812.98 కోట్ల - ఇక వారికి పండగే పండగ!

Header Banner

పవన్ విజ్ఞప్తితో ఏపీకి నిధులిచ్చిన మోడీ! అదనంగా రూ.2812.98 కోట్ల - ఇక వారికి పండగే పండగ!

  Fri Aug 09, 2024 15:55        Politics

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ అవసరం మేరకు కేంద్ర సహకారం కూడా తీసుకుంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. కేంద్రానికి ఉపాధి హామీ కూలీల కోసం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మేరకు 2024- 25 ఆర్ధిక సంవత్సరానికి గానూ లేబర్ బడ్జెట్ ను 21.50 కోట్ల పనిదినాలకు పెంచడానికి కేంద్రం అంగీకరించిందన్నారు. ఇక తాజాగా మరో శుభవార్త చెప్పారు పవన్ కళ్యాణ్. తన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఇప్పటి వరకు కూలీలకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసిందని పేర్కొన్నారు.

 

ఇంకా చదవండి: ఏపీలో ఆగస్టు 15న జెండా ఎగరేసే మంత్రులు వీరే! చంద్రబాబు, పవన్ ఎక్కడంటే?

 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2024-25లో మదర్ శాంక్షన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల నిమిత్తం 21.50 కోట్ల పనిదినాలకుగానూ రూ.5743.90కోట్లను మంజూరు చేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అంతేకాదు గతంలో ఆమోదించిన 15 కోట్ల పని దినాలకు సంబంధించి వేతన నిధులు రూ.2934.80 కోట్లు మంజూరు చేసి.. విడుదల చేసిందనీ, అదనంగా ఇప్పుడు రూ.2812.98 కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2809.10 కోట్లు రోజువారీ వేతన ఎఫ్.టి.ఓ.ల అప్ లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమ అయ్యాయన్నారు. మిగిలిన మొత్తాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే వేతనదారుల ఖాతాలకు జమ అవుతాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. మోడీకి పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ నిధుల సత్వర విడుదలకు చేసిన విజ్ఞప్తితో కేంద్రం ఈ నిధులు విడుదల చేసింది. దీంతో ఉపాధి హామీ కూలీలకు రావాల్సిన డబ్బులు అందటమే కాకుండా వారికి పని దినాలు కూడా పెరగనున్నాయి.

ఇంకా చదవండి: ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. వీరికి భారీ షాక్! అమలులో కొత్త ట్విస్ట్! ఎవరు అర్హులు?

 

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pawankalayan #AndhraPradesh #APPolitics #APnews #Jagan #PawankalayanSpeech #Meeting