ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రూ 4,109 కోట్ల ప్రాజెక్టు! అందుబాటులోకి ఇలా - వేలల్లో ఉద్యోగాలు!

Header Banner

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రూ 4,109 కోట్ల ప్రాజెక్టు! అందుబాటులోకి ఇలా - వేలల్లో ఉద్యోగాలు!

  Sat Aug 10, 2024 16:35        Politics

కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి ప్రాధాన్యత పెంచింది. రైల్వే బడ్జెట్ లో కేటాయింపులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్ర మంత్రివర్గం ఎనిమిది కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోడి ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌లో వీటిని చేపట్టనున్నారు. కొత్త ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు రూ.4,109 కోట్లతో 200.60 కిలోమీటర్ల పొడవైన కొత్తలైన్‌ను నిర్మించనున్నారు. ఇది సాకారమయ్యాక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరగనుంది. మహానది కోల్‌ఫీల్డ్‌ నుంచి మధ్య, దక్షిణ భారతంలోని విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరఫరా సులభమవుతుంది. అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకూ ప్రయోజనం చేకూరనుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ విస్తృతం అవుతుంది.

 

ఇంకా చదవండి: వాలంటీర్లకు భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం - ఉద్యోగం పై క్లారిటీ! వారికి త్వరలోనే రూ.10 వేలు జీతం!

 

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల సామాజిక, ఆర్థికాభివఅద్ధికి ఈ మార్గం దోహదం చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీర ప్రాంతానికి వెళ్లడానికి కొత్త మార్గం అందుబాటులోకి వస్తుంది. దక్షిణ ఒడిశా, బస్తర్‌ ప్రాంతం నుంచి దక్షిణాదికి 124 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ రైలు మార్గం నిర్మాణానికి 1,697 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంటుంది. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా ఏడు రాష్ట్రాల్లో 900 కిలోమీటర్ల కొత్త లైన్లు అందుబాటులోకి వస్తాయి. మొత్తం 64 కొత్త రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు. 510 గ్రామాలు, 14 జిల్లాల మీదుగా సాగే ఈ లైన్ల కారణంగా రెండు కోట్ల మందికి రైల్వే అనుసంధానత ఏర్పడుతుంది. ఏటా 140 మిలియన్‌ టన్నుల సరకులను అదనంగా రవాణా చేయొచ్చు. ఐదేళ్లలోనే వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. ఈ లైన్లు అందుబాటులోకి వచ్చాక 32.20 కోట్ల లీటర్ల చమురు దిగుమతి తగ్గడంతోపాటు 0.87 మిలియన్‌ టన్నుల కర్బన ఉద్ఘారాలు తగ్గుతాయని చెప్పుకొచ్చారు. అది 3.5 కోట్ల చెట్లు నాటడంతో సమానమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు.

ఇంకా చదవండి: తాళి కట్టిన ఆలిని వదిలి ఆమెతో ఉంటున్న వైసీపీ ఎమ్మెల్సీ! రచ్చకెక్కిన దువ్వాడ శ్రీనివాస్ కాపురం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?

 

కుప్పం, పుంగనూరులో ఆ పనులు చెయ్యండి! ఎంతైనా పర్వాలేదు, చంద్రబాబు ఆర్డర్!

 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! ఒక్కొక్కరికి రూ.5 లక్షలు!

 

విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, లక్షల రూపాయలు! విజయవాడలో స్కూల్ సంచలనం!

 

జగన్ పై కేసులు పెట్టాలని మంత్రి డిమాండ్! సైకో ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు!

 

మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన సీఎం చంద్రబాబు! వైరల్ వీడియో!

 

ఈ సమస్యలు ఉన్నవారు టమాటాలు తినకూడదా! వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

వైసీపీకి ఊహించని షాక్! మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!

 

ఏపీలో ఆగస్టు 15న జెండా ఎగరేసే మంత్రులు వీరే! చంద్రబాబు, పవన్ ఎక్కడంటే?

 

పవన్ విజ్ఞప్తితో ఏపీకి నిధులిచ్చిన మోడీ! అదనంగా రూ.2812.98 కోట్ల - ఇక వారికి పండగే పండగ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples