కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!

Header Banner

కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!

  Mon Aug 12, 2024 17:00        Politics

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్ లో కొనసాగిన ఆ పార్టీ నేతల హవా ఇప్పుడు కనుమరుగైంది. అంతే కాదు అప్పట్లో అధికారంతో రెచ్చిపోయిన సదరు నేతలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇదే క్రమంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి కొడాలి నానికి కూడా చుక్కలు కనిపిస్తున్నాయి. అప్పట్లో కేసినో నిర్వహించినా, ప్రత్యర్థులపై క్యాడర్ తో దాడులు చేయించినా అడిగేవారు లేరు. కానీ ఇప్పుడు అవే కేసుల్ని పోలీసులు వెలికితీస్తున్నారు. గుడివాడలో వైసీపీ నేతలకు ఉచ్చు బిగిస్తోంది. టీడీపీ నేతలు, పార్టీ ఆఫీస్ లపై గతంలో వైసీపీ నేతలు చేసిన దాడుల కేసులు పోలీసులు వెలికితీస్తున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కొడాలి నాని అనుచరులైన వైసీపీ నేతలు పలుమార్లు బెదిరించారు. ఇదే క్రమంలో రంగా వర్ధంతిలో పాల్గొనరాదని ఫోన్లో వైసీపీ నేతలు బెదిరించారు.

 

ఇంకా చదవండి: రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!

 

2022 డిసెంబరు 25న టీడీపీ ఆఫీస్ లో ఉన్న రావి, ఇతరనేతలపై కత్తులు, కర్రలు, ఇనుపరాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో దాడులకు పాల్పడ్డారు ఈ ఘటనలో వైసీపీ నేతలకు అప్పటి సీఐ గోవిందరాజులు కొమ్ముకాసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు వీడియో ఫుటేజ్ సేకరించారు. ఈ దాడుల్లో పాల్గొన్న కొడాలి నాని అనుచరులు మెరుగుమాల కాళీ, మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై ప్రస్తుతం కేసులు నమోదయ్యాయి. 149, 143, 144, 146, 188, 427, 506 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు గతంలో కే కన్వెన్షన్ క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది.2022 జనవరి 21న గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీపైనా వైసీపీ నేతలు దాడులకు పాల్లడ్డారు. కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటనల్లో అప్పటి పోలీసులు చర్యలు తీసుకోలేదు. అప్పటి కేసుల్ని వెలికితీసి ఇందులో కొడాలి నాని పాత్రను నిరూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

 

ఇంకా చదవండి: విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్! ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే!

 

రైతులకు గుడ్ న్యూస్! ఈ పథకంలో రిజిస్టర్ అయితే రూ. 6 వేలు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి! ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే!

 

ఇల్లు లేని వారికి శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్రం! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథక ప్రయోజనాలు!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?

 

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కోడలి చేతిలో పార్టీ బాధ్యతలు?

 

బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!

 

ఏపీలో మహిళలకు చంద్రన్న ప్రభుత్వం శుభవార్త! ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఖరారు! ఇప్పటికే చాలా జిల్లాల్లో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples