కొత్త ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న కానుక! బాబు సర్కార్ ఐడియా అదిరింది! అధికారులకు కీలక ఆదేశాలు జారీ!

Header Banner

కొత్త ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న కానుక! బాబు సర్కార్ ఐడియా అదిరింది! అధికారులకు కీలక ఆదేశాలు జారీ!

  Sat Aug 17, 2024 08:00        Politics

గత ఎన్నికల్లో భారీ విజయం సాధించి రాష్ట్ర పగ్గాలు చేతబట్టిన టీడీపీ కూటమి వరుసపెట్టి ప్రజలకు శుభవార్తలు చెబుతోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే సామాన్యుడికి మేలు కలిగేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉచిత ఇసుక విధానంపై హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ హామీ తీర్చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నెలరోజుల లోపే నూతన ఇసుక పాలసీని తీసుకువస్తున్నారు చంద్రబాబు నాయుడు. అయితే తాజాగా ఉచిత ఇసుక విధానం మరో అడుగు ముందుకేస్తూ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న ఉచిత ఇసక పాలసీని మరింత సులభతరం చేసే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇసుక బుకింగ్‌, ట్రాన్స్‌పోర్ట్, నిఘా వంటి అంశాలపై ఆరా దీసిన ఆయన.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రజలు ఇసుకను సులభంగా బుక్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. అదేవిధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఇసుక బుక్‌ చేసుకునే వెలుసుబాటు కల్పించాలని తెలిపారు.

 

ఇంకా చదవండి: 'రెడ్ బుక్' పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్! అతడిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా?

 

 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుకను ఉచితంగా బుకింగ్ చేసిన తర్వాత ఎప్పుడు రవాణా అవుతుంది? అనే విషయం నేరుగా వినియోగదారులకే తెలిసేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం అన్నారు. ఉచిత ఇసుక బుకింగ్‌లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మీ ఇంటికి ఇసుకు చేరుతుందని తెలిపారు. అలాగే ఇసుకను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వద్ద నమోదైన వాహనాల్లో గాని, వినియోగదారులు తమ సొంత వాహనాల్లో గాని రవాణా చేసుకునే ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు చెప్పారు. అదేవిధంగా రవాణా చేసే సమయంలో జరిగే అక్రమాలు అరికట్టడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇసుకను ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో భారీస్థాయిలో ఇసుక బుకింగ్‌ చేసుకోవడానికి ప్రత్యేక బుకింగ్‌ విధానం ప్రవేశపెట్టాలని పేర్కొన్న సీఎం.. రవాణా చార్జీలను వినియోగదారులే చెల్లించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఇసుక రవాణా చేసే వాహనాలపై ఇసుక ఉచిత రవాణా వాహనం అని రాసి ఉంచాలని తెలిపారు. జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీలు కలెక్టర్లు, ఎస్పీలతో నిఘా వ్యవస్థ మరింత పటిష్ట పరచాలన్నారు చంద్రబాబు. కాగా.. ఉచిత ఇసుక విధానంలో ఏవైనా సమస్యలు ఉంటే 1800-599-4599కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

 

ఇంకా చదవండి: మాజీ మంత్రి రోజాకు ఆట మొదలైంది! ఆడుదాం ఆంధ్రా లెక్కలు బయటకి వస్తే ఇక జైలుకే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!

 

వాలంటీర్లకు గుడ్ న్యూస్! నెలకి రూ.10 వేల జీతం.. ఎప్పటి నుంచంటే? వీరికి ఉద్యోగం సచివాలయంలోన లేక వేరే శాఖలోనా?

 

ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!

 

శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!

 

ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!

 

వైసీపీకి మరో షాక్ - అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు! దానికి కారణం అదేనా!

 

3303 అడుగుల అత్యంత భారీ జెండాతో తిరంగ ర్యాలీ! విజయవాడ పురవీధుల్లో! రికార్డు స్థాయిలో అతిరథ మహారథులతో!

 

వచ్చే నెల నుండి కొత్త రూల్! అలా చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్!

 

ఫ్రీ హోల్డ్ పేరుతో చేసిన అక్రమాలపై ప్రభుత్వం రెడ్ అలర్ట్! ప్రజా భూములపై వైసీపీ నేతల దుర్వినియోగం!

 

రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి ఒకేసారి రూ.15 వేలు! ప్రభుత్వం కీలక ప్రకటన?

 

కూటమి సంచలన నిర్ణయం! ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం! కారణం ఏంటి?

 

సుబానీ హోటల్ డ్రామా, చీకటి దందా వెలుగులోకి! డ్రగ్స్ తో గుంటూరు దద్దరిల్లింది!

 

సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?

 

దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!

 

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!

 

రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!

 

కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance