మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

Header Banner

మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

  Sat Aug 31, 2024 08:00        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో మార్క్ చూపెడుతోంది. ప్రజలకు మేలు కలిగే ప్రభుత్వ పథకాల అమలుకు శ్రీకారం చుడుతూనే.. ప్రజారోగ్యంపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే నూతన మద్యం పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వేగంగా అడుగులేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది. ఈ క్రమంలోనే నూతన లిక్కర్ పాలసీ ఎలా ఉండాలనే దానిపై అధికారులు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి, కొండపల్లి శ్రీనివాస్ లు ఉన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలవుతున్న మధ్య విధానాలపై అధ్యయనం కొనసాగుతోంది.

 

ఇంకా చదవండి: వైసీపీకి మరో భారీ షాక్! ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా!

 

వివిధ వర్గాల నుంచి మంత్రి వర్గ సబ్​ కమిటీ అభిప్రాయాల సేకరణ చేస్తోంది. ఈ పరిస్థితుల నడుమ.. ఏపీ కొత్త మద్యం పాలసీ తెలంగాణ తరహాలోనే ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2019 కంటే ముందున్న తరహా విధానాన్నే మళ్లీ తీసుకురావాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోందట. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న విధానంలో కొన్ని కొన్ని మార్పులు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం షాపుల కోసం టెండర్లను ఆహ్వానించాలని.. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల నాన్‌ రిఫండబుల్‌ రుసుము విధించాలని అధికారులు భావిస్తున్నారట. మద్యం వ్యాపారం, ధరలు, పన్నులపై ప్రధానంగా చర్చలు నడుస్తున్నాయట. అతి త్వరలోనే నూతన మద్యం విధానం ఖరారు చేసి.. మద్యం షాపుల కోసం దరఖాస్తుల స్వీకరణ, లైసెన్సుల కేటాయింపు వంటి ప్రక్రియ అంతా పూర్తి చేయాలనీ భావిస్తున్నారట. సెప్టెంబరు నెలాఖరులోగా ఇవన్నీ పూర్తి చేసి అక్టోబరు 1వ తేదీ నాటికి నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారట. అలాగే ప్రస్తుత డిస్టిల్లరీలను తొలగించి కొత్త బ్రాండ్స్ అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం. మరోవైపు మద్యం నియంత్రణకు సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలని చంద్రబాబు సర్కార్ ప్లాన్ చేస్తోందట.

 

ఇంకా చదవండి: రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా: 24/7 అందుబాటులోకి రానున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం! సిడ్నీ వాసులకు అన్ని సౌకర్యాలతో అన్ని ప్రాంతాలకి! మొదటి ఎయిర్ వేస్ ఏది అంటే!

 

ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

 

ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!

 

జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?

 

వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!

 

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!

 

అది ఎన్నారైల కోసమేనా? అన్ని దేవదాయ ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం! ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధి కోసం కమిటీ!

 

సైకో ప్రభుత్వం మూసేసిన జీవో అయ్యారు వెబ్సైటు పునరుద్ధరణ! ఇకపై అన్ని జీవోలు ఆ సైట్లో చూసుకోవచ్చు! పారదర్శక పాలనకు చంద్రబాబు పెట్టింది పేరు!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance