ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్ళే ఖర్చుతో లండన్ వెళ్లొచ్చు! టిక్కెట్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Tue Jan 28, 2025 23:40 Travelప్రయాగ్‌రాజ్‌లో జరగుతోన్న మహాకుంభమేళా దేశ, విదేశాల నుంచి యాత్రికులు భారీగా తరలివస్తున్నారు. భక్తజన సందోహంతో త్రివేణి సంగమం పులకించిపోతోంది. జనవరి 13 నుంచి ఇప్పటి వరకు దాదాపు 14 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్టు సనాతన బోర్డు వెల్లడించింది. సోమవారం ఒక్క రోజే 1.55 కోట్ల మంది కుంభ స్నానం ఆచరించారు. ఇక, బుధవారం (జనవరి 29) మౌని అమావాస్యను పురస్కరించుకుని మూడో అమృత్ స్నానం కోసం భారీ ఎత్తున ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు చేరుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక రైళ్లు, విమానాలు, బస్సులను వేశారు. రైల్వే ఏకంగా 150కిపైగా ప్రత్యేక రైళ్లు ప్రకటించింది.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు! ఇవాళ రెపట్లో జాబితా విడుదల!
ఇక, దేశంలోని ప్రధాన నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు విమాన సర్వీసులను పలు సంస్థలు నడుపుతున్నారు. ఈ విమానాలకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇదే అవకాశంగా విమాన ఛార్జీలను భారీగా పెంచేసి.. సొమ్మచేసుకుంటున్నారు. సాధారణ రోజుల్లో ఢిల్లీ- ప్రయాగ్‌రాజ్ మధ్య విమాన టిక్కెట్ రూ.5 వేలలోపే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో డిమాండ్‌ను బట్టి మరో వెయ్యి రెండు వేల వరకు అదనంగా వసూలు చేస్తారు. కానీ, కుంభమేళా పుణ్యమా అని విమానయాన సంస్థలు ప్రయాణికులను దోపిడీ చేస్తున్నాయి. ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ విమానంలో వెళ్లడం కంటే లండన్‌కు చాలా చీప్‌గా వెళ్లొచ్చు. జనవరి 28 నుంచి 31 వరకు ఢిల్లీ-ప్రయాగ్‌రాజ్ విమాన టిక్కెట్ ధర రూ.32 వేలుగా ఉంటే.. లండన్‌కు టిక్కెట్ కేవలం రూ.24 వేలే కావడం గమనార్హం. పలు ట్రావెల్ ఏజెన్సీల వెబ్‌సైట్‌ల్లో ఇదే విధంగా ఛార్జీలు ఉన్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విమానాయ సంస్థలు వసూలు చేస్తోన్న ఛార్జీల గురించి పియూష్ రాజ్ అనే జర్నలిస్ట్ స్క్రీన్ షాట్ తీసి.. ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ‘న్యూఢిల్లీ- ప్రయాగ్‌రాజ్ విమానం టిక్కెట్ రూ.31 వేలు.. న్యూఢిల్లీ-లండన్ టిక్కెట్ మాత్రం రూ.24 వేలు’ అనే క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ‘ డిమాండ్.. సప్లయ్ పరిస్థితి ’.. ‘ఇది ఇండియా’ అని ఒకరు.. ‘చాలా తక్కువ ధరకే థేమ్స్ నదిలో స్నానం చేయొచ్చు’అని ఇంకొకరు రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!
తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు!
డ్వాక్రా మహిళల కోసం సర్కార్ భారీ ప్రణాళిక! లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ సౌకర్యం!
దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15 వేల స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువకి వస్తుందో.. లక్కీ ఛాన్స్ గురు..
షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టు, నంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!
శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Travel #Devotional #Kumbhamela #Prayagraj #UttarPradesh #Delhi #Flights
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.