సైకో జగన్ వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తుంటే బాణాసంచా పేల్చి సంబరాలు చేసిన వారికీ! ముంపు ప్రాంతాల్లో దొంగలించిన దొంగలకు తేడా ఏముంది! బులుగు బ్యాచ్ ని చూస్తే అసహ్యం వేస్తుంది!

Header Banner

సైకో జగన్ వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తుంటే బాణాసంచా పేల్చి సంబరాలు చేసిన వారికీ! ముంపు ప్రాంతాల్లో దొంగలించిన దొంగలకు తేడా ఏముంది! బులుగు బ్యాచ్ ని చూస్తే అసహ్యం వేస్తుంది!

  Sat Sep 14, 2024 17:29        Politics

మనుషులుగా మనం మన ఇంటి ముందు కరెంటు పోలు పెట్టకుండా ప్రయత్నిస్తాం. మన ఇంటిని వీధిలో అందరికంటే కొంత ఎత్తు చేసి కడతాం. ప్రక్కన ఎవరైనా మురుగు నీరు వదిలితే గొడవపడతాం. మన ఇంటి ముందు మురుగుకాలువ తెరుచుకోకుండా జాగ్రత్త పడతాం. మన ఇంటిని కొన్ని నెలలు మూసేస్తే.. చెదలు తింటుంది, పాములు వస్తాయి.

ప్రభుత్వాలను నడిపే పాలకులు బటన్లు నొక్కి సంక్షేమం చేస్తే మంచిదే. దానితో పాటు అభివృద్ధి కూడా చేస్తే మరీ మంచిది.

ఇటీవల కాలంలో వరద ముంపుకు గురైన నగరాలు విజయవాడ, మైడుగురి-నైజీరియా, దిల్లీ, ముంబై, హ్యూస్టన్-టెక్సాస్, న్యూ ఆర్లియన్స్-లూసియానా, సిడ్నీ-ఆస్ట్రేలియా.

వరద రాంగానే వాతావరణ శాఖ హెచ్చరికలు పట్టించుకోకపోవడం వలనే ఇంత నష్టం జరిగింది అని ఎవరైనా నాటకాలు వేస్తే.. నవ్వు వస్తాది. మీకు నవ్వు రాలేదు అంటే అవగాహన లేదు అని అర్థం. అందుకే ఈ ప్రయత్నం.


ఇంకా చదవండిరూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!


పొద్దున లేచి వాట్సాప్, ఇన్స్‌టాగ్రాం గట్రా చూసేవారిలో ఎంతమంది వాతావరణ హెచ్చరికలు చూస్తారు? వారిలో ఎంతమంది గొడుగులు తీసుకెళతారు? అక్కడి వరకు మనిషిగా మన చేతుల్లో వుంటుంది.

గొడుగు, రెయిన్ కోటు తీసుకు వెళ్లి వర్షం ఆగినా.. రోడ్లల్లో పొంగి వచ్చే మురుగు అంటకుండా.. ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఎంతమంది వస్తున్నారు? ఇది మన చేతుల్లో వుండదు.

అన్నీ తెలిసి ఆ రోజు బయటకు వెళ్లకుండా ఎంతమంది మానేస్తున్నారు?

మన ఇల్లు ఆ వీధిలో కొంత ఎత్తు చేసి కట్టినా.. వీధే మునిగితే.. మన ప్రాంతమే మునిగితే?

వరదలు ఎందుకు వస్తాయి?
భారీ వర్షపాతం, నదులు పొంగడం, వాతావరణ మార్పు, అటవీ విధ్వంసం, పట్టణీకరణ, మౌలిక సదుపాయాల వైఫల్యం గట్రా కారణాల వలన కదా.

నగరాలకు దాని మాష్టర్ ప్రణాళిక ప్రకారం అనుమతులు ఎన్ని ప్రభుత్వాలు ఇస్తున్నాయి? ఆ మాష్టర్ ప్రణాళిక అమలును ఎన్ని ప్రభుత్వాలు పట్టించుకొంటున్నాయి?
పట్టణ విస్తీర్ణం పెరిగే కొద్దీ మురుగు కాలువలు పెరగాలి కదా. పట్టణం తినేసే వ్యవసాయ ప్రాంతం నీరు ఆ పట్టణంలోకి రాకుండా మళ్లించే ఏర్పాట్లు చెయ్యాలి కదా. అవి చెయ్యకపోతే వరద రాదా.

వర్షపు సూచన అందుకొని, అరచేతిని అడ్డు పెట్టి ఆపేయగలమా?

అభివృద్ధి, సంక్షేమంతో పాటు జన క్షేమం పట్టించుకొనే నాయకులు, ఒకసారి జరిగిన నష్టం తరువాత మళ్లీ అలా జరగకుండా చెయ్యాలని ప్రయత్నిస్తారు.


ఇంకా చదవండిజగ్గయ్యపేటలో వైసీపీకి దిమ్మతిరిగే షాక్! ప్రముఖ నేత టిడిపిలో చేరిక! మరికొంతమంది వైసీపీ నేతల మార్పు? 


ఎవరైనా వున్నారా?

శతాబ్దాల పాటు విజయవాడ దుఃఖదాయని బుడమేరు అని వ్రాశారు, శపించారు, ఏడ్చారు. రీటైనింగ్ వాల్ల్ కట్టండి మొర్రో అని అక్కడి జనం వేడుకొన్నా పట్టించుకొన్న నాధుడు లేడు.

తన హయాంలో కాకున్నా.. 2009లో వచ్చిన విజయవాడ వరదలను చూసిన తరువాత చంద్రబాబు నాయుడు అక్కడి జనం కోరిక మేరకు రీటైనింగ్ వాల్‌ను 2.3 కిలోమీటర్లు నిర్మించాడు. దానితో పాటు బుడమేరు వరద కాలవలను ఆధునీకరించే పనులు మొదలెట్టాడు. జనం దించేశారు.

అలాంటివి చెయ్యకున్నా.. ఎవరైనా ఏమి చేస్తారు?

కనీసం వర్షాకాలం ముందు ప్రతి సంవత్సరం మురుగు కాలువల్లో చెత్త తీసి, పూడిక తీస్తారు. కరెంటు పోల్లకు తగులుతూ వుండే కొమ్మలు, ఎండిపోయిన చెట్ల కొమ్మలు కొట్టిస్తారు.

అదేమీ చెయ్యకుండా జగన్ లా.. పట్టణం ప్రక్కన వుండే బుడమేరు ఇసుకను త్రవ్వితే అటే కదా నీరు ఇంకా బాగా వచ్చేది. దాని కాలవల ప్రాంతాలను ఆక్రమిస్తే.. అమ్మేస్తే.. అది నీటిని ఎలా తీసుకు వెళుతుంది?

కొదవ రీటైనింగ్ వాల్ కడుతూ అందులో కక్కుర్తి పడి, నదిలోకి వదిలే డ్రైనేజీ పైపుల్లో.. నది నుండి వచ్చేలా పనులు చేస్తే?

ఇవే కాదు ప్రాజక్టుల గేట్లకు గ్రీజు కూడా కొట్టకుండా కడప అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఏలేరు పనులు చెయ్యకుండా అక్కడ మునిగింది. బుడమేరు పనులు ఆపినందువలన విజయవాడ మునిగింది. పోలవరం అలాగే కొనసాగించక రివర్స్ టెండర్లని సాగదీసి ముంచాడు. ఇలా వేల కోట్ల నష్టం జరిగింది.

పాలకుడు పబ్జీ ఆడుకొంటూ ఐదేళ్లు గడిపి, పిలిచినప్పుడు ఉలిక్కిపడి బటన్లు నొక్కుతూ ఫోజులు ఇస్తే పోయేది జనం ప్రాణాలే.. ప్రాణం పెట్టుకొన్న భూములు, పంటలే. నాశనమయ్యి మురుగుకంపును పీల్చేది నగరాలే.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


నిన్న మాత్రం ఒక నిజం చెప్పి.. తరువాత అబద్దాలు చెప్పాడు జగన్.
ఏలేరు ఆధునీకరణ పనులు చెయ్యకపోయాం అని దయనీయంగా యాక్షన్ చేస్తూ డైలాగులు మొదలెట్టి, నీళ్లు వస్తూనే వున్నాయి, క్రాప్ హాలిడే వలన చెయ్యలేకపోయాం అని బుకాయించాడు.

ఐదేళ్లూ నీరు ఆగలేదా? క్రాప్ హాలిడే అందరికీ ఇవ్వాలా?

వానాకాలం పోనీ రోడ్లల్లో గోతులు పూడ్చి, రోడ్లు వేద్దాం అని ఐదేళల్లో తట్టెడు మట్టెయ్యకుండా వెలగబెట్టినది ఈ పబ్జీ ఆటగాడు కాదా?

ఈ రోజు ప్రాంతాలను అన్నింటినీ ముంచాడు, తాను పోయినా.

జనం ఎంచుకోవాల్సింది సంక్షేమంతో పాటు జన క్షేమాన్ని కూడా ఆలోచించే చంద్రబాబు నాయుడు లాంటి వారిని. ఇలాంటి జన విధ్వంసక భూతాలను ఆవాహనం చేస్తే పోయేది జనమే, జరిగేది ఇలాంటి విధ్వంసమే. ప్రకృతి కొంతవరకే కారణం, ఇలంటి వికృతేంద్రాకరణ నాయకులతో ప్రతి ప్రాంతమూ సమంగా నష్టపోతుంది, తీవ్రంగా నష్టపోతుంది.

నిన్న ఈయన వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తుంటే బాణాసంచా పేల్చి సంబరాలు చేసిన వారికీ, ముంపు ప్రాంతాల్లో దొంగలించిన దొంగలకు టేడా లేదనిపించింది. ఒకే రకమైన అసహ్యం వేసింది.



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపేపండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

జగ్గయ్యపేటలో వైసీపీకి దిమ్మతిరిగే షాక్! ప్రముఖ నేత టిడిపిలో చేరిక! మరికొంతమంది వైసీపీ నేతల మార్పు?

 

ఐఆర్‌సీటీసీ వెంకటాద్రి టూర్ ప్యాకేజీ.. అతి తక్కువ ఖర్చుతో 4 రోజుల తిరుమల యాత్ర! ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దొరకదు!

 

మద్యం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌! ఆ రెండు రోజులు వైన్స్‌ బంద్‌!

 

ఈ ఆరు దేశాల్లో వాట్సాప్‌పై నిషేధం! దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసా?

 

రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపేపండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం! 77వేల మంది పదో తరగతి విద్యార్ధులకు!

 

చిన్న పరిశ్రమల నిర్వాహకులకు చంద్రబాబు గుడ్ న్యూస్! కేంద్ర ప్రభుత్వం ఈ నిధికి రూ.900 కోట్లు!

 

ఏపీతెలంగాణకు మళ్లీ భారీ వర్షాలు! పొంచి ఉన్న మరో ముప్పు..! ఆ జిల్లాలకు అలర్ట్!

 

పిఠాపురంలో భారీ వరదలు! నీట మునిగిన డిప్యూటీ సీఎం పొలాలు!

 

విజయ సాయిరెడ్డి కూతురికి హైకోర్టు మరో షాక్ - అదీ వదలొద్దని ఆదేశం! ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో!

 

కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడికి కీల‌క ప‌ద‌వి! త‌న‌కు ద‌క్కిన ఈ అరుదైన గౌర‌వం!

 

18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!

 

ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!

 

ఏపీ మహిళలకు మనీ ఇచ్చేలా రెండు కీలక పథకాలు.. 35 శాతం రాయితీ! అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఫాలో అవండి!

 

గల్ఫ్: లైవ్ లో ఒకటిన్నర సంవత్సరం బిడ్డతో తను కూడా క్లోరెక్స్ తాగి ఆత్మహత్యాయత్నం! అకామా లేదుబిడ్డకి పాస్పోర్ట్ లేదు! వదిలేసి పారిపోయిన భర్త! 7

 

గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వసాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కేసు!

 

గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group





   #andhrapravasi #flods #heavyrains #paytmdogs #animals #fakeparyatana #fakefunds #todaynews #flashnews #latestupdate