రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

Header Banner

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

  Sun Sep 15, 2024 16:13        Politics

మరో రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఢిల్లీ సీఎం అరవింద్  కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎంగా ఉండనని అన్నారు. అందుకే ప్రజాతీర్పు కోరతామని స్పష్టం చేశారు. నేను నిర్దోషినని నమ్మితే భారీగా ఓట్లు వేయండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. తనను జైలుకు పంపి, ఆప్ లో చీలికలు తీసుకురావాలని ప్రయత్నించారని, తద్వారా ఢిల్లీ పీఠం చేజిక్కించుకోవాలని భావించారని వివరించారు. ఎన్ని కుట్రలు పన్నినా ఆప్ ను విచ్ఛిన్నం చేయలేకపోయారని తెలిపారు. జైలు నుంచి కూడా ప్రభుత్వాన్ని నడపవచ్చని సుప్రీంకోర్టు ఉత్తర్వులు నిరూపించాయని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలనే ఇన్నాళ్లూ రాజీనామా చేయలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మహారాష్ట్రతో పాటు ఢిల్లీకి కూడా ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి దాదాపు ఆరు నెలల పాటు జైలులో ఉన్న ఆయన తాజాగా బెయిలుపై బయటకు వచ్చారు.

 

ఇంకా చదవండి: ప్రధాని నివాసంలో పుంగనూరు లేక దూడ! ఆసక్తికర కామెంట్ చేసిన నారా లోకేశ్! నా స్వస్థలానికి చెందిన...

 

ఈ ఉదయం ఆయన తొలిసారి పార్టీ కొత్త హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యల పట్ల పార్టీలో అంతర్గతంగా చర్చ బయలుదేరడంతో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాలే ఉండాలని పార్టీలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. అయితే, కేజ్రీవాల్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమిటంటే... నవంబరులో ఎన్నికలకు వెళ్లి సత్తా నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారని భరద్వాజ్ వివరించారు. ప్రజలు కేజ్రీవాల్ నిజాయతీపరుడు అని గుర్తిస్తే ఆప్ ఎన్నికల్లో గెలుస్తుందని, కేజ్రీవాల్ మరోసారి సీఎం అవుతారని స్పష్టం చేశారు. అంతకుముందు కేజ్రీవాల్ కార్యకర్తల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడుగుతాను. నేను నిజాయతీపరుడిని అనుకుంటే ప్రజల నాకు ఓటేస్తారు. అప్పుడు నేను సీఎం సీటులో కూర్చుంటా. లేదంటే లేదు’’ అని కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మరో రెండ్రోజుల్లో సీఎం పదవికి తాను రాజీనామా చేస్తానని, తర్వాత పార్టీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తుందని, ఆ తర్వాత సీఎం పేరును నిర్ణయిస్తుందని కేజ్రీవాల్ వివరించారు.

 

ఇంకా చదవండి: కొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇండియాలో విమాన ప్రయాణాలు చేస్తున్నారా? ఎయిర్ పోర్టు లాంజ్ లో ఫ్రీగా ఎంట్రీ ఎలా పొందవచ్చు! ఈ 6 ఈజీ స్టెప్స్ పాటించండి!

 

విజయవాడ నుండి త్వరలో అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు నేరుగా! నిధులకు కొరత లేదు! విమానాశ్రయం విస్తరణ జూన్ 2025 కి పూర్తి!

 

ఏలేరు వరద నష్టం ముమ్మాటికి సైకో జగన్ వల్లనే! రివర్స్ టెండర్ అని రాష్ట్రాన్ని ముంచేసాడు! కోటాను కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు!

 

వరద ప్రాంతాలలోని చిన్నచిన్న గల్లీలలో ఆ మంత్రి బైక్ పై సుడిగాలి పర్యటన! అన్ని వీధులు శానిటేషన్ పనులు! అంతలాది కార్మికులతో క్లీనింగ్ పనులు

 

సైకో జగన్ వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తుంటే బాణాసంచా పేల్చి సంబరాలు చేసిన వారికీ! ముంపు ప్రాంతాల్లో దొంగలించిన దొంగలకు తేడా ఏముంది! బులుగు బ్యాచ్ ని చూస్తే అసహ్యం వేస్తుంది!

 

జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!

 

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu