ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

Header Banner

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

  Fri Sep 20, 2024 18:45        Politics

ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి శిష్యులు కొందరు తయారయ్యారని విమర్శించారు. ఊరికొక సైకో తయారయ్యారు.. ఆ సైకోలకు ప్రభుత్వం అంటే లెక్కలేని తనం వచ్చిందని మండిపడ్డారు. ఎదురుదాడి చేస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు... ఎదురుదాడి చేస్తే నేను భయపడే రకం కాదు... తప్పు చేసిన వాళ్ల తాట తీస్తా అని ఘాటుగా హెచ్చరించారు. ఇవాళ తాను ప్రజలను చూడ్డానికే మద్దిరాలపాడు వచ్చానని, హంగు ఆర్భాటాల కోసం కాదని అన్నారు. "నేను 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను. అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఎన్ని ఆర్భాటాలు చేస్తే ఏమొస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ నేను కోరుకునేది ఒక్కటే... నేను చేసే ప్రతి పని వల్ల అనుక్షణం మీ జీవితాల్లో వెలుగు రావాలి, మార్పు రావాలి... అందుకోసమే నేను పాటుపడుతున్నా. ఇప్పుడు కూటమి పాలనకు 100 రోజులు పూర్తయింది. నా అనుభవాన్ని గుర్తించి, చరిత్రలో ఎన్నడూ లేనంతగా 93 శాతం స్థానాల్లో మమ్మల్ని గెలిపించారు. 

 

ఇంకా చదవండి: మద్దిరాలపాడులో సీఎం చంద్రబాబు పర్యటన! అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన!

 

శ్రీకాకుళం నుంచి జైత్రయాత్ర మొదలైంది. కానీ ప్రకాశం జిల్లాల్లో రెండు చోట్ల బ్రేక్ పడింది. దర్శి, యర్రగొండపాలెంలో ఓడిపోయాం. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియాలోనూ అరకు, పాడేరులో ఓటమిపాలయ్యాం. మిగతాచోట్ల అత్యధిక స్థానాల్లో మేం గెలిచామంటే అందుకు కారణం ప్రజలు చూపిన అభిమానమే. ఇది నా జీవితంలో మర్చిపోలేను. భవిష్యత్తు బాగుండాలని మీరంతా ఓట్లేశారు. కానీ రాష్ట్రం పరిస్థితి చూస్తే వెంటిలేటర్ పై ఉంది. ఆక్సిజన్ తీసేస్తే ప్రాణం పోయే పరిస్థితి! అయితే, మీరందరూ ఒక మంచి పని చేశారు. కూటమి నుంచి 21 మంది ఎంపీలను గెలిపించారు. దాని వల్ల ఢిల్లీలో మన పరపతి పెరిగింది. కాబట్టి ఇవాళ రాష్ట్రానికి ఆక్సిజన్ తీసుకొస్తున్నా. కేంద్రం నుంచి మనకు సహకారం అందకపోతే నేను ఎన్ని మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఇదంతా సాధ్యమైంది మీ చొరవ వల్లే. ఆ చొరవే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టింది" అని చంద్రబాబు వివరించారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples