ఆంధ్రులకు సంతోషాన్ని కలిగించే శుభవార్త! భారీ పెట్టుబడులతో తిరిగి రానున్న లులు (LULU)! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. చంద్రబాబుతో కంపెనీ యజమాని!

Header Banner

ఆంధ్రులకు సంతోషాన్ని కలిగించే శుభవార్త! భారీ పెట్టుబడులతో తిరిగి రానున్న లులు (LULU)! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. చంద్రబాబుతో కంపెనీ యజమాని!

  Sat Sep 28, 2024 21:15        Politics

ఆంధ్రులకు శుభవార్త

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వెళ్లిపోయిన లూలు సంస్థ అధినేత యం.ఏ యూసఫ్ ఆలి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ పెట్టుబడులు పెట్టడంపై సానుకూలంగా స్పందించారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబుతో లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఎ.యూసుఫ్ అలీ భేటీ

రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి...వైజాగ్, విజయవాడ, తిరుపతిలలో పెట్టుబడులపై చర్చ 

 

 

ఇంకా చదవండిగ్యాస్ ధరల్లో మార్పులు! అక్టోబర్‌ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు ఇవే! 

 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రితో లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ సమావేశం అయ్యారు. ఆయతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. అదే విధంగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ఆసక్తి చూపింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విశాఖలో పెట్టుబడులకు లులు గ్రూప్ నాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే తరువాత వచ్చిన ప్రభుత్వ తీరు కారణంగా లులు గ్రూప్ రాష్ట్రం నుంచి వెనక్కి పోయింది. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ లులు గ్రూప్ ఆసక్తి చూపించింది.

 

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆ సంస్థ చైర్మన్ తన బృందంతో వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. లులు గ్రూప్ చైర్మన్ తో సమావేశం సందర్భంగా పెట్టుబడులకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి వారితో చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు తాము సహకారం, ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. లులు గ్రూప్ తిరిగి ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై ముఖ్యమంత్రి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. లులు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామిక వేత్తల్లో రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి, చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని సిఎం అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి తాము తీసుకువస్తున్న నూతన పాలసీల గురించి చంద్రబాబు లులు గ్రూప్ చైర్మన్ కు వివరించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. లులు గ్రూప్ చైర్మన్ తో పాటు హాజరైన సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితేఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!

 

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP