చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ట్విస్ట్, వైసీపీ లీడర్! అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు!

Header Banner

చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ట్విస్ట్, వైసీపీ లీడర్! అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు!

  Mon Oct 07, 2024 13:07        Politics

అన్నమయ్య జిల్లాలోని అంగళ్లులో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. గత ఏడాదిలో ఈ సంఘటన జరిగింది. వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డి ఫిర్యాదు మేరకు మదనపల్లె సమీపంలోని ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు కావడం అప్పట్లో కలకలం రేపింది. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అమరనాథ్ రెడ్డి (ప్రస్తుతం పలమనేరు ఎమ్మెల్యే), దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులపైన కేసులు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లతో తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో మదనపల్లెతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు వెళ్లి ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో వైసీపీ నాయకుల ఒత్తిడితో అంగళ్లలో జరిగిన రాళ్ల దాడి కేసులో చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పైన తప్పుడు కేసులు నమోదు చేశారని విచారణలో వెలుగు చూసిందని, ఈ కేసును కొట్టివేయాలని పోలీసు అధికారులు మదనపల్లె ఒకటవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో నివేదిక సమర్పించారు.

 

ఇంకా చదవండి: మ‌రికాసేప‌ట్లో చంద్ర‌బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ! పెళ్లి కార‌ణంగా చాలా కాలం!

 

కేసు వివరాలు తెలుసుకున్న న్యాయమూర్తి అభ్యంతరాలు ఉంటే వారం లోపు కోర్టు ముందు హాజరై చెప్పాలని చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టిన వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డికి గత నెల 25వ తేదీన నోటీసులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ఒత్తిడితోనే చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులపై అప్పుడు కేసులు పెట్టారని పోలీసు అధికారులు అంటున్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నాయుకులపై నమోదు అయిన అంగళ్లు రాళ్ల దాడి కేసును కొట్టివేయాలని పోలీసులు కోర్టుకు మనవి చేశారు. అయితే కేసు ఉపసంహరించుకోవడానికి వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డి అంగీకరించలేదు గత ఏడాది వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డి చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం నాయకులు మీద మదనపల్లె సమీపంలోని ముదివేడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు నాయుడు గత ఏడాది ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన సమయంలో మదనపల్లె సమీపంలోని అంగళ్లులో రాళ్ల దాడి జరిగింది. ఆ సందర్బంలో చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ సీనియర్ నాయకులుపైన కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో అని టీడీపీ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీఐఐసీ, మారిటైం బోర్డు నూతన ఛైర్మన్లను అభినందించిన హోంమంత్రి! రూ.2,350 కోట్ల పెట్టుబడులు, 4,300 మందికి ఉపాధి!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. 3 ఉచిత సిలిండర్ల కోసం వెంటనే ఇది చెయ్యండి! Don't miss..!

 

ఏపీ రైతులకు మరో శుభవార్త.. మంచి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు! కొన్ని జిల్లాల్లో 100 కిలోమీటర్లకు పైగా!

 

ఇసుక విధానంపై సోషల్ మీడియాలో ప్రచారం! చంద్రబాబు వార్నింగ్! ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా!

 

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

 

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance