అమరావతి భవనాలకు ఆకర్షణీయ రూపకల్పనతో నిర్మాణానికి నూతన ఆరంభం! నార్మన్ ఫోస్టర్ మళ్లీ రంగంలోకి!

Header Banner

అమరావతి భవనాలకు ఆకర్షణీయ రూపకల్పనతో నిర్మాణానికి నూతన ఆరంభం! నార్మన్ ఫోస్టర్ మళ్లీ రంగంలోకి!

  Tue Oct 15, 2024 12:52        Politics

రాజధాని అమరావతిలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ఆకృతులను మార్చరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలనా నగర ప్రణాళికతో పాటు, ఆ ఐకానిక్ భవనాలకు ఆకృతుల్ని 2018లో లండన్కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ రూపొందించింది. రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చి, రాజధాని నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాక... ఐకానిక్ భవనాల ఆకృతులపై ఉన్నతస్థాయిలో చర్చ జరిగింది. దాదాపు ఆరేళ్ల క్రితం రూపొందించిన ఆ ఆకృతుల్లో ఇప్పుడేమైనా మార్పులు చేయాలా అన్న కోణంలో చర్చించారు. వాటి బాహ్య ఆకృతుల్లో ఎలాంటి మార్పులూ చేయరాదని, అవసరమైతే అంతర్గతంగా కొన్ని మార్పులు చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. వాటిని మారిస్తే మరో ఏడాదిన్నర సమయం వృథా అవుతుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పైగా హైకోర్టు, సచివాలయం టవర్ల పునాదుల నిర్మాణం ఇప్పటికే పూర్తయినందున...ఇప్పుడు ఆకృతులను మార్చాలనుకోవడం సరికాదన్న అభిప్రాయానికి వచ్చింది. హైకోర్టు భవన ఆకృతులకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తులతో ఇటీవల సీఆర్డీఏ అధికారులు సమావేశమై, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మరోపక్క ఐకానిక్ భవనాల డిజైన్లకు సంబంధించి పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ఆర్కిటెక్ట్ నియామకానికి సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. లండన్ సంస్థ నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు కూడా ప్రీబిడ్ మీటింగుకు హాజరయ్యారు. ఆ సంస్థ కూడా బిడ్ దాఖలు చేసి ఉంటుందని సీఆర్డీఏ అధికారులు భావిస్తున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో బిడ్లు తెరిచి ఆర్కిటెక్ట్ను ఖరారు చేయనున్నారు. హైకోర్టు, సచివాలయ భవనాల పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయని చెన్నై ఐఐటీ నిపుణులు సర్టిఫై చేయడంతో ఆ భవనాల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సీఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది.


ఇంకా చదవండివీటిని రెగ్యులర్ గా తీసుకుంటే చాలు! ఇక కళ్లజోడు అవసరం ఉండదు!




జగన్ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెట్టినా..!
2019కి ముందు తెదేపా హయాంలో అమరావతి నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రఖ్యాత సంస్థలేవీ... ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం వస్తే వదులుకోవడానికి సిద్ధంగా లేవు. నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ మళ్లీ అమరావతి నిర్మాణంలో భాగస్వామి అయ్యేందుకు ఆసక్తి చూపడమే ఇందుకు నిదర్శనం. జగన్ ప్రభుత్వంలో అనేక చేదు అనుభవాల్ని ఎదుర్కొన్న విదేశీ సంస్థల్లో నార్మన్ ఫోస్టర్ కూడా ఉంది. వైకాపా ప్రభుత్వం... నార్మన్ ఫోస్టర్ వంటి సంస్థల్నీ అనేక ఇబ్బందులు పెట్టింది. వారితో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందాల్ని కాలరాసింది. నార్మన్ ఫోస్టర్ సంస్థకు బకాయిలు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టింది. చివరకు బకాయిలు వసూలు చేసుకోవడానికి నార్మన్ ఫోస్టర్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అన్ని వేధింపులు ఎదుర్కున్న తర్వాత కూడా నార్మన్ పోస్టర్ సంస్థ... మళ్లీ ముందుకు వస్తుందని సీఆర్డీఏ అధికారులు ఊహించలేదు. కానీ ప్రీబిడ్ మీటింగుకు హాజరవడంతో... ఆ సంస్థ ఆసక్తిగా ఉందన్న విషయం తర్వాత కూడా నార్మన్ పోస్టర్ సంస్థ... మళ్లీ ముందుకు వస్తుందని సీఆర్డీఏ అధికారులు ఊహించలేదు. కానీ ప్రీబిడ్ మీటింగుకు హాజరవడంతో... ఆ సంస్థ ఆసక్తిగా ఉందన్న విషయం తెలిసింది. ఆ సంస్థ ప్రీబిడ్ మీటింగుకు మాత్రమే హాజరైందా? బిడ్ కూడా దాఖలు చేసిందా అన్న విషయంలో స్పష్టత లేదు. ఒక వేళ ఆ సంస్థ బిడ్ వేసి, దానికే టెండరు ఖరారైతే సమయం కలసి వస్తుందని సీఆర్డీఏ అధికారులు అభిప్రాయపడుతున్నారు.



ఇంకా చదవండిబంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12



అప్పట్లో ఆకృతులు ఇలా..!
అప్పట్లో శాసనసభ భవనాన్ని బోర్లించిన లిల్లీపువ్వు ఆకారంలో, హైకోర్టు ఆకృతిని బౌద్ధ స్తూపం స్ఫూర్తితో రూపొందించారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలను ఐదు టవర్లుగా... డయాగ్రిడ్ విధానంలో నిర్మించాలనుకున్నారు. అప్పటి అంచనాల ప్రకారం వాటి నిర్మాణ వ్యయం రూ.11,752 కోట్లు. శాసనసభ భవనం నిర్మితప్రాంతం 11.67 లక్షలు, హైకోర్టు భవనం నిర్మిత ప్రాంతం 16.85 లక్షలు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మిత ప్రాంతం 68.88 లక్షల చదరపు అడుగులు. అప్పట్లో హైకోర్టు, సచివాలయ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచి, పనులు అప్పగించారు. పునాదుల నిర్మాణం పూర్తయింది. వాటి పునాదులకు అప్పట్లో రూ.330 కోట్లు వరకు ఖర్చయింది. శాసనసభ భవనానికి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం పనులు నిలిపేసింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీలో లిక్కర్ టెండర్ల కిక్కు.. మహిళలు ఎన్ని షాపులు దక్కించుకున్నారో తెలుసా? అందరి సమక్షంలో, సీసీ కెమెరాల నిఘాలో లక్కీ డ్రా!

 

ఒక్కో మహిళకు రూ.3 వేలు.. ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అదరహో! అర్హతలు ఏంటివి?

 

మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం! జగన్ కు టీడీపీ కౌంటర్! ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు!

 

ఏపీలో మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ! అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా!

 

చంద్రబాబా మజాకా.. మరోసారి ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రూ. 4,500 కోట్ల నిధులతో 30,000 అభివృద్ధి!

 

మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!

 

వైసీపీకి మరో షాక్! పార్టీ వీడనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకటన!

 

ఆ మాజీ మంత్రిని చంపింది మేమే! లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన!

 

రేపే మద్యం దుకాణాలకు డ్రా! ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా?

 

పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ! 11 మంది దుర్మరణం!

 

దేశంలో తయారయ్యే విదేశీ మద్యం రేట్లు పెరుగుదల! అదనపు ప్రివిలేజ్ ఫీజు వసూలు! గరిష్టంగా ఎంత అంటే?

 

చంపేస్తామంటూ 15 రోజుల క్రితమే వార్నింగ్! అన్నట్టుగానే మాజీ మంత్రి హత్య!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


 


   #andhrapravasi #amaravathi #construcions #newprojects #development #highcourt #buildings #todaynews #flashnews #latestupdate