2022లో చేసిన ట్వీట్ ను రీపోస్ట్ చేసిన చంద్రబాబు! ఎందుకో తెలుసా? ఇంతకీ అది ఏ పోస్ట్!
Sat Oct 19, 2024 16:39 Politicsఏపీ రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అమరావతి పనుల పూజా కార్యాక్రమాల్లో పాల్గొన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. గతంలో తాను చేసిన ట్వీట్ ను ఆయన ఇవాళ రీపోస్ట్ చేశారు. "ఆంధ్రుల రాజధాని అమరావతే... అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుంది... అమరావతే గెలుస్తుంది... ఇదే ఫైనల్" అంటూ చంద్రబాబు 2022 అక్టోబరు 22న ట్వీట్ చేశారు. ఇవాళ ఆ ట్వీట్ ను మరోసారి పంచుకున్న చంద్రబాబు ఆసక్తికరంగా స్పందించారు. "ఏది ఎలా జరగాలని ఉంటే అది జరిగి తీరుతుంది... ఐదేళ్లపాటు నిర్లక్ష్యం చేసినా, ఆశలను తుంచివేసినా... ఇవాళ అమరావళి మళ్లీ నిలబడింది. ఇటుక మీద ఇటుకతో, ఒకరికొకరు అండగా... ప్రజా రాజధాని పునర్ నిర్మాణం జరుపుకుంటోంది. ఇవాళ మన రాజధాని కలను మళ్లీ సాకారం చేసుకుంటున్న శుభతరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా, దమనకాండకు ఎదురొడ్డి నిలిచి, తమ ఉద్యమం ద్వారా రాజధాని కలను సజీవంగా నిలిపిన రైతులు, మహిళలకు అభినందనలు" అంటూ చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీ షాక్.. మాజీ ఎంపీని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు! 48 గంటల పాటు..
అర్ధరాత్రి ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియోకాల్! ఎందుకు.. ఎవరు..? తర్వాత ఏమైందంటే?
నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం! ఆ నేతల గుండెల్లో గుబులు! ప్రజాప్రతినిధులకు కీలక సూచనలు!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఇక ఆ సమస్యలకు చెక్!!
నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.25 వేలు.. ఇలా చేయండి! ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదు!
మందు బాబులకు షాక్ - మద్యం ధరల పెంపు! ఒక్క బీరు ఎంతంటే..?
వరదల ప్రాంతంలో సేవ చేయడమే ఐఏఎస్ అధికారుల బాధ్యత! వెళ్లాల్సిందే" అంటు క్యాట్ కీలక నిర్ణయం!
48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!
ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్! ఆ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకం!
ఏపీ జిల్లాలకు నూతన ఇన్చార్జి మంత్రుల ఎంపిక! ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.