హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన యువత! రక్షించి విశాఖ చేర్చిన పోలీసులు! చంద్రబాబు X లో పోస్ట్!
Sat May 25, 2024 07:14 Politicsఉద్యోగాలు వస్తాయి అని మోసపోయి హ్యూమన్ ట్రాఫికింగ్ కి గురైనవారిని సురక్షితంగా ఇంటికి విశాఖ తరలించడం జరిగింది. ఇండియన్ ఎంబసీ సమన్వయంతో బాధితులు విశాఖ చేరారు. బాధితులు సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు అండగా ఉంటాం అని విశాఖ సీపీ రవిశంకర్ తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో కాంబోడియా తీసుకెళ్లారు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్షన్నర తీసుకుని కంబోడియా పంపించారు. కాంబోడియాలో ఉన్నవాళ్లు చైనా వారికి అప్పగించారు. భారత్‌లో సైబర్ నేరాలకు పాల్పడేలా చేశారు. భారతీయులను మోసం చేస్తేనే ఆహారం అందించేవారు. కొందరు బాధితులను బేస్‌బాల్ బ్యాట్లతో కొట్టారు. బాధితులు 6 నెలలుగా కంబోడియాలో ఉన్నారు. మన రాష్ట్రం నుంచి 150కు పైగా బాధితులు ఉన్నారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం అని ఆయన వెల్లడించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ అంశం పై టిడిపి అధినేత చంద్రబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారడం చాలా ఆందోళనకరం. భారతదేశం మరియు కంబోడియా మధ్య నడుస్తున్న రాకెట్‌లో, 150 మందికి పైగా తెలుగు యువకులను ఉద్యోగాల సాకుతో అక్రమ రవాణా చేసి సైబర్ క్రైమ్‌లోకి నెట్టారు. మా యువకులను మోసం చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. బాధితులను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర మంత్రి జై శంకర్ గారిని అభ్యర్థిస్తున్నాను, అని ఆయన ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ స్పెషల్ ఫోకస్! వీడియో లీక్ పై విచారణ! చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో!
ఎవరెస్టు పర్వతంపై టీడీపీ జెండా! అనంతపురం యువకుడికి లోకేష్ 20 లక్షల సాయం! ధన్యవాదాలు తెలిపిన ఉపేంద్ర!
సింగపూర్: గ్లోబల్ ర్యాంకింగ్‌లో 50 ఉత్తమ నగరాల్లో! సౌత్-ఈస్ట్ ఆసియా లో ఏకైక నగరం! లండన్ కూడా!
జయ బాడిగకు చంద్రబాబు అభినందనలు! కాలిఫోర్నియాలో తొలి మహిళా జడ్జిగా! విజయవాడ వారు కావడం గర్వకారణం!
వైరల్ అవుతున్న ఇన్ స్టా వీడియో! విద్యార్థితో కలసి సరదాగా టీచర్ డ్యాన్స్! 1.3 కోట్ల వ్యూస్!
హైదరాబాద్ ఫేమస్ రెస్టారెంట్ లో కల్తీ! నటుడు బ్రహ్మాజీ ఫన్నీ కామెంట్స్! నెటిజన్ల రియాక్షన్ ఇదే!
తీవ్ర విషాదం... విరిగిపడిన కొండచర్యలు! 100 మందికి పైగా మృతుల సంఖ్య! ఎక్కడ అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #HumanTraficking #Vishakapatnam #AndhraPradesh #CBN #ChandraBabu
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.