ఇంటర్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు!! 3,712 పోస్టులకు దరఖాస్తులు షురూ!! అర్హత వివరాలు మీకోసం

Header Banner

ఇంటర్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు!! 3,712 పోస్టులకు దరఖాస్తులు షురూ!! అర్హత వివరాలు మీకోసం

  Wed Apr 10, 2024 11:09        Education, Employment

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్న వారికి గుడ్‌న్యూస్‌..

ఇంటర్‌ విద్యార్హతతో కేంద్రంలోని పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వశాఖలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో లోయర్‌ డివిజనల్‌ క్లర్కు, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి  ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2024’ పేరిట ప్రకటన జారీ చేసింది. మొత్తం 3,712 ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా.. అర్హులైన వారు మే 7వరకు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

టైర్‌ 1 పరీక్ష జూన్‌/జులైలో నిర్వహించే అవకాశం ఉంది.
నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

అర్హతలివే..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఆగస్టు 1, 2024 నాటికి ఇంటర్‌ పాసైన అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వశాఖ, సాంస్కృతిక శాఖల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూపుతో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఉండాలని నిబంధన విధించారు.

దరఖాస్తు రుసుం:

జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.₹100 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ/ఎస్టీలు, దివ్యాంగులు చెల్లించనవసరం లేదు. 

వయో పరిమితి:

2024 ఆగస్టు 1 నాటికి 18-27 ఏళ్ల మధ్య వయసు కలిగినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు చొప్పున సడలింపు కల్పించారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

వేతనాలు ఇలా..

లోయర్‌ డివిజన్‌ క్లర్కు (LDC), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (JSA) పోస్టులకు పే లెవెల్‌-2 కింద  రూ.19,900- రూ.63,200 చొప్పున చెల్లిస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (DEO)కు పే లెవెల్‌ -4 (రూ.25,500-81,100; పే లెవెల్‌ -5 (రూ.29,200-92,300); డేటా ఎంట్రీ ఆపరేటర్‌, గ్రేడ్‌ ‘ఎ’ పోస్టులకు పే లెవెల్‌ -4 (రూ.25,500-81,100 చొప్పున వేతనం చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
టైర్‌-1, టైర్‌-2 ఆన్‌లైన్‌ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ప్రాథమిక ఎంపిక ఉంటుంది. ఆ తర్వాత వారు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశల్లో కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 

కేటగిరీల వారీగా పోస్టుల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో త్వరలోనే అప్‌డేట్‌ చేయనున్నారు. రాష్ట్రాల వారీగా/జోన్‌ల వారీగా ఖాళీలను ఇంకా కమిషన్‌ సేకరించలేదు. ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది? సబ్జెక్టుల వారీగా మార్కుల వివరాలు, పరీక్ష కేంద్రాలు తదితర పూర్తి వివరాలను ఈ కింది ఈపీడీఎఫ్‌లో చూడొచ్చు.

https://ssc.gov.in/ 

  

ఇవి కూడా చదవండి: 

ఉగాది రోజు వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు!! తెలుగుజాతికి మళ్లీ పూర్వవైభవం!! దాంట్లో కొంత సమాజం కోసం!!

 

కాంగ్రెస్ 114 ఎమ్మెల్యే 5 ఎంపీ స్థానాల అభ్యర్థుల విడుదల! కడపలో అన్నపై చెల్లెలు యుధ్దం

 

'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు!! అది పూర్తి అయ్యేవరకు అవకాశం!! కమిటీ తీర్మానం

 

పవన్ అభిమానులు తలుచుకుంటే జగన్ ఎక్కడా కనిపించరు!! ఉయ్యూరు ప్రజాగళం సభలో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు!! ఆ మాటలకు షాక్

 

Evolve Venture Capital  

 

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలపై కనకమేడల అభ్యంతరం!! నిబంధనలకు విరుద్దంగా లేఖ!! ప్రతి రోజూ ఇది సాధ్యమా??

 

రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చిన జనసేన! నివేదికలు ఆధారంగా! అభ్యర్థి ఎవరంటే?

  

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 

 


   #SSC #StaffSelectionCommission #Intermediate #Recruitment2024 #Unemployement #AndhraPravasi #Pravasi #TeluguMigrants un