ఏపీలో వికృత రాజకీయ క్రీడకు తెరలేపింది ఈయనే..!!
Thu Nov 30, 2023 20:55 Exclusivesఏపీలో వికృత రాజకీయ క్రీడకు తెరలేపింది ఈయనే..!!
అభివృద్ధి చేస్తే కేసులు పెట్టే సంస్కృతి ఒక్క @ఆంధ్రప్రదేశ్లో ఈయన ప్రభుత్వంలోనే జరుగుతుంది.
విభజిత ఆంధ్రప్రదేశ్లో @యువతకు నైపుణ్యాన్ని పెంచేందుకు నైపుణ్య అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిన చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేశారు.
@అమరావతి రాజధాని కోసం రాష్ట్ర ఖజానా నుండి ఒక్క రూపాయి చెల్లించకుండా 33 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్లో సేకరించిన @చంద్రబాబుపై అసైన్మెంట్ ల్యాండ్ కేసు నమోదు.
Urgently Required Corporate Sales Manager...
రాష్ట్రంలోని 13 జిల్లాలకు రాజధాని ప్రాంతానికి అనువుగా ఉండేలా డిజైన్ చేసిన ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ పై కూడా చంద్రబాబుపై కేసు నమోదు.
ఇంటర్నెట్ యొక్క ఆవశ్యకతను గుర్తించి@149రూపాయలకే అన్ లిమిటెడ్ @ఇంటర్నెట్, @టెలిఫోన్, @కేబుల్ టీవీ ప్రజలకు అందించిన చంద్రబాబుపై ఏపీ ఫైబర్ స్కాన్ కేసు.
విభజిత ఆంధ్రప్రదేశ్లో నిర్మాణరంగం వేగం పుంజుకునేందుకు ప్రజలకు ఉచితంగా @ఇసుకను ఇస్తే చంద్రబాబుపై ఇసుక స్కాం కేసు నమోదు చేశారు.
మద్యపాన ప్రియులకు వారికి కావలసిన నాణ్యమైన బ్రాండెడ్ మద్యాన్ని తక్కువ ధరకే అందిస్తే చంద్రబాబుపై @మద్యం కేసు నమోదు చేశారు.
పేదల కొరకు పెద్దలు నివసించే అపార్ట్మెంట్లను తలదన్నేలా షేర్ వాల్ టెక్నాలజీతో @టిడ్కోఇళ్లను చంద్రబాబు నిర్మిస్తే వాటిని శిథిలావస్థకు తీసుకువచ్చిన ఘనత ఆయనదే.
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు కూడా తెలియకుండా లబ్ధిదారుల పేరున బ్యాంకులలో రుణం తెచ్చుకుని వాట్టి నిర్మాణం పూర్తి చేయకుండా లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా నేటికీ రుణం బకాయిలు చెల్లించకపోవడంతో ఆ ఇళ్లు బ్యాంకులు కైవసం చేసుకుంటున్నందున ఈ స్కాంపై ఈయన పై ఏ కేసు నమోదు చేయాలి.
ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపై చంద్రబాబు పోరాడుతూ ఉంటే ఈయన అక్రమ కేసులతో బాబును జైలు పాలు చేశారు.
రాష్ట్రంలో ఈయన పాలనలో అభివృద్ధి పూర్తిగా అడుగంటి పోయింది.
ఉచితంగా దొరికే ఇసుకను బంగారం కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తూ రేయింబవళ్లు దోపిడీ చేస్తున్న ఈయన పై ఎన్ని కేసులు పెట్టాలి.
మద్యం ప్రియులు సొమ్ము చెల్లించినా వారికి కావలసిన మద్యం సరఫరా చెయ్యని ఈయన పై ఏ కేసు నమోదు చేయాలి.
నెలకు149 రూపాయలకు వినోదంతో కూడిన ఇంటర్నెట్ ఇస్తే ఈయన నెలకు 400 రూపాయలు ఏపీ ఫైబర్ కనెక్షన్ కు వసూలు చేస్తున్నందుకు ఈయన పై ఏ కేసు పెట్టాలి.
Urgently Required Corporate Sales Manager...
రాజధాని నిర్మాణం మాట దేవుడేరుగు అమరావతి నిర్మాణంలో వేసిన రోడ్లను సైతం తవ్వి అమ్మేసుకుంటున్న ఈయనకు ఏ శిక్ష వేయాలి.
రాజధాని రైతులకు ఒప్పందం ప్రకారం చెల్లించవలసిన పొలం కవులు చెల్లించకుండా వారిని వేధింపులకు గురిచేసిన ఈయన పై ఎన్ని కేసులు పెట్టాలి.
కేంద్ర ప్రభుత్వం @షెడ్యూల్డ్ కులాలకు ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరు చేసిన కోట్లాది రూపాయలు ఈయన దారి మళ్లించి దోచుకున్నందుకు ఏ కేసు నమోదు చేయాలి.
ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మును ప్రభుత్వ భవనాలకు @వైసీపీపార్టీ రంగులు వేసుకుని వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన ఈయన పై ఏ కేసు నమోదు చేయాలి.
కోర్ట్లు చివాట్లు పెడితే మళ్లీ ప్రజాధనం తోనే ఆ రంగులను మార్చినందుకు, ఈ సొమ్ము రికవరీ చేయాలంటే ఈయన పై ఏ కేసు నమోదు చేయాలి.
పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ప్రజా వేదిక నిర్మించారని ఇది చట్ట వ్యతిరేకమని చెప్పి అధికారం చేపట్టిన మరుసటి రోజునే 33 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసినందుకు ఈయనకి ఏ శిక్ష వేయాలి.
ఆయన పర్యావరణ అనుమతులకు తిలోదకాలిచ్చి ఇసుక క్రమంగా తవ్వడం, విశాఖ రిషి కొండపై తాను నివాసం ఉండడానికి 500 కోట్లతో విలాసవంతమైన భవనం నిర్మించడం ఇవి చట్టాన్ని అతిక్రమించడం కాదా!
పేదవానికి పట్టెడన్నం పెట్టేందుకు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ కు తాళాలు వేసి పేదవాడి ఆకలి చావులకు కారణమైన ఈయన కు జైలు శిక్షలు కాదు ఉరిశిక్ష వేయాలి.
ఈయన పాలన చూస్తే వెనకటికి ఎవరో చెప్పినట్లు చెప్పేవి శ్రీరంగనీతులు దూరేవి దొమ్మర గుడిసెలు అన్న సామెతగా తయారైంది.
మాటతప్పం మడమతిప్పం అంటూ ఎన్నికల ముందు ప్రగల్ పాలు పలికిన ఈయన పాలన మొత్తం మాట తప్పడం మడమ తిప్పడం తప్పితే మరొక ప్రగతి లేదు.
రాబోయే ఎన్నికలలో ఈయన ప్రభుత్వాన్ని ప్రజలు మెడలు తిప్పి కూర్చోబెట్టే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#andhrapravasi #PoorToRich #PsychoPovaliCycleRavali #JaganPaniAyipoyindhi #JaganFailedCM #PsychoJagan
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.