నేడు మోదీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం.. గల్ఫ్ దేశాల్లో తొలి హిందూ దేవాలయం!

Header Banner

నేడు మోదీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం.. గల్ఫ్ దేశాల్లో తొలి హిందూ దేవాలయం!

  Wed Feb 14, 2024 21:48        Devotional, U A E, Gulf News

అరబ్ దేశాల్లో తొలి హిందూ దేవాలయం నేడు ప్రారంభమైంది. అబుదాబిలో బీఏపీఎస్ (బోచా సన్యాసీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్) సంస్థ నిర్మించిన హిందూ మందిర్ ప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. మోదీ ఆధ్వర్యంలో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఇది పశ్చిమ ఆసియాలోనే అతి పెద్ద హిందూ దేవాలయం. 27 ఎకరాల్లో రూ.700 కోట్ల భారీ వ్యయంతో ఈ హిందూ మందిర్ ను నిర్మించారు.

 

 ఇంకా చదవండి:  బహ్రెయిన్: కూతురు హక్కు కోసం తండ్రి పోరాటం!...

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు, 108 అడుగుల ఎత్తుతో హిందూ మత చిహ్నాలతో, భారతీయ శిల్ప కళా సౌందర్యం ఉట్టిపడేలా ఆలయ నిర్మాణం చేపట్టారు. ఆలయ ఫలకాలపై రామాయణం, మహాభారతం, భాగవత, శివపురాణ గాథలను ముద్రించారు. ఈ ఆలయంలో 402 స్తంభాలు ఉన్నాయి. ఆలయ స్తంభాలపై దేవతా ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణానికి ప్రఖ్యాత రాజస్థాన్ పింక్ స్టోన్స్, ఇటలీ పాలరాయి వినియోగించారు. వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా అబుదాబీలో ఈ ఆలయం నిర్మాణం జరుపుకుంది. 

 మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈనాడు విలేకరి పై వైసీపీ నేతల దాడి!!

 

కువైట్: ఫ్యామిలీ విజిట్ వీసా పై వచ్చే వారికి పెద్ద షాక్! ఈ 2 ఎయిర్ వేస్ లోనే రావాలి! లేనిచో నో ఎంట్రీ

 

భారీ డిస్‌ప్లేతో అదిరిపోయే స్పెసిఫికేషన్లుతో స్మార్ట్‌ఫోన్‌.. ఆలస్యం ఎందుకు చూసేయండి..

 

అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో వరల్డ్ కప్ పోటీలు.. ఆటగాళ్లను ముందుగానే న్యూయార్క్ పంపనున్న బీసీసీఐ

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #BAPSHinduMandir #HinduMandir #Inauguration #NarendraModi #AbuDhabi #UAE #Gulf #India