పిచ్చిపిచ్చి కూతలు కూస్తే పరిష్కారం ప్రజలే !! చంద్రబాబు మాస్ స్పీచ్!!
Fri Feb 16, 2024 11:11 Politicsజగన్ ది ఐదేళ్ల విధ్వంస పాలన
విధ్వంసం పుస్తకం ఒక జర్నలిస్ట్ ధర్మాగ్రహం
ప్రజలతో సైకో అని పిలిపించుకునే ఏకైక ముఖ్యమంత్రి జగనే
బానిసలుగా ఉంటారో...తిరుగబడతారో ఆలోచించండి
వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడతపెడితే..ప్రజలు కుర్చీమడతపెడతారు
అప్పుడు సీఎంకు కుర్చీనే ఉండదు.
సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన ‘విధ్వంసం’ పుస్తకం ఆవిష్కరణలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
అమరావతి :- సీఎం జగన్ ది ఐదేళ్ల విధ్వంస పాలన అని, విధ్వంసం పుస్తకం ఒక జర్నలిస్ట్ ధర్మాగ్రహం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలతో సైకో అని పిలిపించుకునే ఏకైక ముఖ్యమంత్రి జగనే అని ఎద్దేవా చేశారు. బానిసలుగా ఉంటారో...తిరుగబడతారో ఆలోచించాలని పిలపునిచ్చారు.
సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తొలి పుస్తకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అందించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ....‘‘ఈ ప్రభుత్వంలో అందరం బాధితులమే. దళితులు, అమరావతి రైతులు, ఉద్యోగులు, పవన్ కళ్యాణ్...నేనూ బాధితున్నే.
ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!
రేపో ఎల్లుండే ఆలపాటి సురేష్ కుమార్ కూడా బాధితులవుతారు. ఐదేళ్లలో జరిగిన సంఘటనలు ధైర్యంగా విధ్వంసం పుస్తకంలో సురేష్ కుమార్ పొందుపరిచారు. ఇది కేవలం పుస్తకం కాదు..సమాజాన్ని, ప్రభుత్వాన్ని దగ్గరగా చూసిన ధర్మాగ్రహం. మనం కూడా పుస్తకాలు చదువుతూ ఉంటాం. సమాజ పోకడలు, విప్లవాలు, ఉద్యామాలపై పుస్తకాలు రాయడం మనం చూశాం..కానీ దేశ చరిత్రలో ఒక సీఎం విధ్వంసకర పాలనపై పుస్తకం రాయడం మొదటిసారిగా చూస్తున్నా. ఒక ప్రభుత్వం..ఒక పాలకుడు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేశాడో చెప్తూ సురేష్ పుస్తకం రాశారు. ప్రభుత్వ టెర్రరిజంపై పుస్తకం తీసుకురావడం చాలా సంతోషం.
2019 నుండి రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, అప్రజాస్వామిక పోకడలు, దారుణాలు..ఇలా అన్ని సంఘటనలు పుస్తకంలో ప్రస్తావించడం అభినందనీయం. ఒక జర్నలిస్ట్ గా సమాజాన్ని విభిన్నకోణాల్లో చూస్తారు..రాష్ట్రంలోని పరిస్థితిని చూసి చలించి సురేష్ పుస్తకం రాశారు. ప్రజలు నమ్మి గెలిపించిన ప్రభుత్వం ఏ విధంగా నమ్మించి వంచించింది, ఛిన్నాభిన్నం చేసిందో వివరించారు. సమాజంపై బాధ్యతతో రాష్ట్ర దుస్థితిని చూసి పుస్తకం రాశారు.
అమెరికా వెళ్లాలనుకునే వారికి వివిధ రకాల వీసాలు! వాటికి ఫీజులు! వివరాలు
నా మనసులో ఏముందో, 5 కోట్ల ప్రజల మనసులో ఏముందో స్పష్టంగా రాసిన వ్యక్తి ఆలపాటి సురేష్. నియంత పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసం అయింది. రివర్స్ పాలనలో రాష్ట్ర భవిష్యత్ విధ్వంసం అయింది. నమ్మి అధికారం ఇచ్చినందుకు సైకోపాలనలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు విధ్వంసం అయ్యాయి. బీసీ, దళిత, మైనారిటీల ఆత్మగౌరవం విధ్వంసం అయ్యాయి. ఈ ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్, భావితరాల భవిష్యత్ దెబ్బతింది. రాష్ట్ర బ్రాండ్ దెబ్బతింటే దాన్ని తీసుకురావాలంటే సమయం పడుతుంది.
185 అంశాలతో పలు సంఘటనలు గురించి రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
శత్రువు కూడా పడని బాధ అమరావతి రైతులు పడ్డారు
ప్రజలు, భావితరాలకు గుర్తుండే విధంగా సురేష్ రాసిన పుస్తకం అమరావతి మహిళలకు, మహిళారైతులకు అంకితం చేయడంలో నిజాయితీ ఉంది. ఒక ప్రాజెక్టు కట్టాలంటే భూమి ఇవ్వడానికి ముందకు రారు..రోడ్డు వేయాలన్నా భూమి చ్చేందుకు ముందుకురారు. పరిహారం ఇచ్చి భూసేకరణ చేసే పరిస్థితి ప్రస్తుతం వచ్చిది. కానీ అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ లో రూపాయి కూడా తీసుకోకుండా రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారంటే అది త్యాగం.
సౌదీ: గుడ్ న్యూస్! మూడు సంవత్సరాల బ్యాన్ ఎత్తివేసిన ప్రభుత్వం! వేల ఉద్యోగ అవకాశాలు
ఇలాంటి దుర్మార్గుడు వచ్చి, నష్టం జరుగుతుందని రైతులు అనుకుని ఉంటే నాడే నాకు నమస్కారం పెట్టి మా జోలికి రావొద్దు అని చెప్పేవాళ్లు. శత్రువుకు కూడా రాని బాధను అమరావతి పడ్డారు. అమరావతి దేవతల రాజధాని. అందర్నీ అడిగాక అమరావతి అని రాజధానికి పేరు పెట్టాం. ఒక రాజధాని ప్రజారాజధాని కావాలని..అన్ని దేవాలయాల్లో, చర్చిల్లో మసీదుల్లో పూజలు చేసి అక్కడి మట్టిని తీసుకొచ్చి పుణితం చేశాం. అంతమంది దేవుళ్లు కూడా ఈదుర్మార్గడుడి చేత నుండి అమరావతిని కాపాడలేకపోయారు.
అమరావతి అనేది ఇక్కడి రైతులు రాజధాని మాత్రమే కాదు...అక్కడ భూమి ఉంది..అక్కడ రాజధాని కట్టి ఉంటే ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే అవకాశం ఉండేది. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టినప్పుడు భూమి విలువ లక్ష..తర్వాత కోట్లకు పెరిగింది. పదేళ్లలో అమరావతిని ఒక నమూనాకు తెచ్చి ఉంటే మీకు పరిహారంతో పాటు...అమరావతిని కట్టి కూడా ప్రభుత్వానికి రూ.2లక్షల కోట్ల ఆదాయం వచ్చేది..అది రాష్ట్ర ప్రజల ఆస్తిగా ఉండేది. దాన్ని విధ్వసం చేశారు. అమరావతిలో బిల్డింగ్ లు కడితే జీఎస్టీ వచ్చేది..దాని దవ్రా ఆదాయం వచ్చేంది. లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి పెరిగేది..దాన్ని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టేవాళ్లం. ఇప్పటి దాకా మూడు రాజధానులు అన్నారు..మళ్లీ నాలుగో రాజదాని అంటున్నారు హైదరాబాద్ అని.
నువ్వు దేహీ అంటే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా ప్రజలు.ఎదురుదాడి చేస్తే భయపడతారని అనుకుంటున్నారు. హైదరాబాద్, బెంగలూరు, చెన్నై లాంటి రాజధాని కావాలని ఇప్పుడు అంటున్నారు. మళ్లీ మా విధానం మూడు రాజధానులే అని చెప్తున్నారు అంటే ఎంత నీచంగా ఆలోచిస్తున్నారో చూడండి. ఒక సైకో విధానాలు ఇవి. ఇలాంటి పనులు చేసి ఎవరైనా సమర్థించుకుంటారా.? ప్రజావేదిక కూల్చారు. నేను అక్కడే ఉన్నా..అద్దె ఇంట్లో నుండి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. ప్రజావేదిక కూల్చారు...శిధిలాలు తొలగించలేదు. దాన్ని చూసి నేను ప్రతిరోజు బాధపడాలని కోరుకునే వ్యక్తిని ఏమనాలి.?
షర్మిల, సునీతపై పోస్టులు!! వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి ఫిర్యాదు!!
ప్రతిపక్ష నాయకుడిగా ప్రజావేదిక ఇవ్వండిని అడిగా...నాకు ఇవ్వకపోతే మరో దానికి వాడుకోవచ్చు కదా. ప్రజలు చూస్తుండగానే దీన్ని కూల్చేయండని చెప్పిన వ్యక్తి సైకో సీఎం. ఏ సీఎం, ఏ ప్రజాప్రతినిధి అయినా సరే...నా రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని చేస్తారు. కానీ వచ్చే పరిశ్రమలు కూడా తరిమేసే సీఎంను జగన్ ఒక్కడినే చూశా. సౌత్ కొరియాకు 3 సార్లు వెళ్లి కియాను తెచ్చాం. చిత్తూరులో పరిశ్రమలు పెట్టి జన్మభూమి రుణం తీర్చుకోవాలని పెడితే వారిని వేధించి అక్కడి నుండి తరిమేశారు.
వేధింపులు తట్టుకోలేక జయదేవ్ రాజకీయాల నుండి తప్పుకున్నారు. నేను పవన్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే దృడ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అన్నా క్యాంటీన్ ను రద్దు చేశారు. జన్మదినం, పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేసేందుకు అన్నక్యాంటీన్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. తిరుపతిలో ఎన్టీఆర్ అన్నదానం ప్రవేశపెట్టారు. పేదవాడికి తిండిపిడితే భరించలేని మనస్థత్వం కలిగిన వ్యక్తి జగన్. ఇప్పటంలో జనసేన మీటింగ్ కు స్థలం రైతులు ఇచ్చారు..దీంతో రోడ్డు వెడల్పు పేరుతో వారి ఇళ్లు తొలగించారు.
దళితుడు మాస్క్ అడిగినందుకు ఉద్యోగం నుండి తొలగించి పిచ్చివాడిని చేసి చంపేశారు. రంగనాయకమ్మ ఎల్జీపాలిమర్స్ కు సంబంధించి ట్వీట్ చేసింది. వెంటాడి వ్యాపారం చేయనీయకుండా చేశారు. హోటల్ పోయింది..ఇతర వ్యాపారానికి అనుమతి ఇవ్వకుకండా చేశారు. దీంతో జీవితంలో మళ్లీ ఇక్కడకు రాలేనని హైదరాబాద్ వెళ్లిపోయారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించారు...భయపెట్టారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఆ వేధింపులు తట్టుకోలేక కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మనిషి ఎప్పుడు చనిపోతారో తెలీదు...కానీ ఇంత బలవంతపు మరణం చెందారంటే ఆలోచించాలి. సోదరి శీలాన్ని కాపాడటానికి తన అక్కను ఎందుకు వేధిస్తున్నారని అడిగినందుకు నోట్లో పెట్రోల్ పోసి నిప్పు అంటించి అమర్నాథ్ గౌడ్ ను చంపేశారు. రాష్ట్రంలో అసలు రక్షణ ఉందా.? సొంత చెల్లి, జన్మనిచ్చిన తల్లిపైనా సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో చూశారు. నేను కూడా అవమానానికి అసెంబ్లీలో గురయ్యా.
ఆనాడే చెప్పా అసెంబ్లీని గౌరవ సభగా మార్చిన తరవాత వస్తానని చెప్పా. క్లైమోర్స్ పెట్టినప్పుడు కూడా నేను భయపడలేదు. ప్రాణానికి బయపడలేదు...ఈ దుర్మార్గులు చేసిన అవమానికి కన్నీళ్ల పెట్టాను. ఒక దళిత డ్రైవర్ ను ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేశాడు. దర్జాగా సీఎం పక్కన తిరుగుతున్నాడు. సమైక్యరాష్ట్రంలో సీఎంగా ఉన్నసమయంలో ఒక నేరస్తుడు ఆడవాళ్లను చంపి పారిపోయేవాడు. పశువులను మేపే వారిని ఎంపీకి చేసుకునేవాడు..డబ్బులు, బంగారు ఏమీ తీసుకునేవాడు కాదు చంపడమే అతని లక్ష్యం. సుమారు 30 మందిని చంపాడు. విచారణ చేస్తే అతను ఎప్పుడో జీవీతంలో జరిగిన ఘటన గుర్తంచుకుని మహిళలను చంపుతున్నాడు.
జగన్ కూడా సందపాదనే ధ్యేయంగా అమరావతి, పోలవరంను ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నాడు. మద్యం, ఇసుక, మైనింగ్ ఏది దొరికితే అది దోచేశాడు. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ జనార్థన్ నాయుడు అనే వ్యక్తి నుండి క్వారీలు లాక్కుని మైనింగ్ చేసుకుని దోచుకున్నాడు. విద్యుత్ బెల్లు కూడా చెల్లించకుండా బాధితుడినే కట్టాలని, లేదంటే అరెస్టు చేయిస్తాతానని బెదిరిచాడు. మీడియా వాళ్లు కూడా ఈ ప్రభుత్వంలో మొదటి బాధతులు. కేసులు పెట్టి వేధిస్తున్నారు. పవన్ బీమావరం వెళ్లాల్సి ఉంటే హెలికాప్టర్ అనుమతిలేదు అన్నారు..
నాకు పర్చూరులో మీటింగ్ కు అనుమతి లేదని చెప్తున్నారు. ప్రజలకు సమస్య వస్తే ప్రభుత్వం దగ్గరకు వెళ్తాం...ప్రభుత్వమే సమస్య అయితే ఏం చేయాలి.? మానసిక రోగం వల్ల ఈ పరస్థితి వచ్చింది. సమాజంలో మంచి, చెడు రెండూ ఉంటాయి. చెడు చేసేవాళ్లు పాలకులు అయితే ప్రజలు భయపడే పిరిస్థితి. తర్వాత బానిసలు అయ్యే పరిస్థితి వస్తుంది. చెడును పూర్తిగా నివారించడానికి నడుం బిగించాలి. కులం, మతం, ప్రాంతం, వర్గం అని లెక్కుల వేసుకుంటే కదరదు..వాటికి అతీతంగా ఉండాలి.
తూర్పుగోదావరి జిల్లా టిడిపి అభ్యర్థులు 10 మంది ఖరారు! వివరాలు
యువత ఉంది, సమద్రం ఉంది, బంగారం పండించే రైతులు ఉన్నారు..కానీ ఈ రాష్ట్రం ఎక్కడికిపోయిందో అర్థం చేసుకోవాలి. ఇక్కడ పుట్టిన వాళ్లు పక్కన రాష్ట్రాలకు వెళ్లి బ్రహ్మాండంగా రానిస్తున్నారు..కానీ మనం మాత్రం బాధపడుతున్నాం. భయం ఉన్న దగ్గర స్వేచ్ఛ ఉండదు..స్వేచ్ఛ లేని చోట అభివృద్ధి ఉండదు..అభివృద్ధఇ లేని చోట ఆలోచన కూడా ఉండదు. నేను ఐటీ అంటే ఎగతాలి చేశారు..కానీ నేడు ఒక్కో ఊరి నుండి పది మందిదాకా విదేశాలకు వెళ్లి ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. దానికి తోడు ఆర్టిఫియల్ ఇంటెలిజన్స్ వస్తోంది...దాన్ని అడాబ్డ్ చేసుకుంటే నిర్ణయాలు త్వరగా ఉంటాయి.
ప్రజలు కుర్చీ మడతపెడితే సీఎం కుర్చీయే ఉండదు
వాటని ఉపయోగించుకునే సత్తా తెలుగు ప్రజలకు ఉంది. తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలని నాకు, వపన్ కు ఉన్న సంకల్పం. తెలుగు జాతిలో పేదరికం లేకుండా చేయడానికి పనిచేస్తాం. మీరు కూడా ఆలోచించాలి..తిరగబడతారా..బానిసలుగా ఉంటారో మరో 54 రోజుల్లో మీరు నిర్ణయించుకోవాలి. సీఎం సభలో మాట్లాడుతూ...చొక్కా చేతులు మడతపెట్టే సమయం వచ్చింది అంటున్నారు...నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కుర్చీలు మడతపెడతారు...నీకుర్చీయే లేకుండా పోతుంది.
సీఎం హోదాలో ఉన్నావ్..ఎన్నికలు అంటే ద్వంద యుద్ధం, చొక్కాలు మడతపెట్టడానికి కాదు. మంచికి కూడా హద్దులు ఉంటాయి. పిచ్చిపిచ్చి కూతలు కూస్తే దానికి ప్రజలు పరిష్కారం చూపిస్తారు. ఐదేళ్ల నరకాన్ని ప్రతి ఒక్కరూ చర్చించాలి. సురేష్ కుమార్ ను ప్రజల తరపున అభినందిస్తున్నా.’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
#NaraChandraBabuNaidu #Vidvamsam #Aalapati #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.