2నెలలు ఓపిక పట్టండి!! రామతీర్థం బాధితులకు లోకేష్ భరోసా!!
Fri Feb 16, 2024 15:41 Politicsరాముడి విగ్రహం తలనరికిన సైకోలకు కటకటాలు తప్పవు!
అమాయకులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తాం
రామతీర్థం బాధితులకు యువనేత నారా లోకేష్ భరోసా
నెల్లిమర్ల: నెల్లిమర్ల నియోజకవర్గం రామతీర్థం శంఖారావం సభకు హాజరయ్యే ముందు రామతీర్థంలోని వైసిపి బాధితులు యువనేత నారా లోకేష్ ను కలిసి తమ బాధలను చెప్పుకున్నారు. మూడేళ్ల క్రితం రామతీర్ధం గ్రామంలోని రాముడి విగ్రహానికి కొందరు అసాంఘికశక్తులు శిరచ్ఛేదం చేశారు.
ఎన్నారై టీడీపీ USA రాయలసీమ స్పోక్స్ పర్సన్ గా చెంచు వేణుగోపాల్ రెడ్డి!
ఆ సంఘటనతో తీవ్రంగా కలత చెందిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా రామతీర్థంలో నిర్వహించిన సమావేశానికి నాయకత్వం వహించిన సువ్వాడ రవిశేఖర్‌తో పాటు మరో తొమ్మిది మందిపై వైసిపి ఎంపి విజయసాయిరెడ్డిని హత్యచేసేందుకు ప్రయత్నించారంటూ తప్పుడు కేసులు బనాయించారు. అమాయకులైన స్థానికనేతలను ఒక నెలపాటు జైలులో పెట్టారు. వారిలో ఒక బాధితుడ్ని చిత్రహింసలకు గురిచేసి నేరాన్ని అంగీకరించేలా బలవంతం చేశారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఆ వ్యక్తి పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న తర్వాత మూడు నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చిందని బాధితులు యువనేత లోకేష్ ఎదుట ఆవేదన చెందారు. దీనిపై తీవ్రంగా స్పందించిన యువనేత లోకేష్... రాముడి విగ్రహం తలనరికిన అరాచశక్తులను పట్టుకోవడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం... అమాయకులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. మరో 2నెలలు ఓపిక పట్టండి, రాముడి తలనరికిన సైకోలతోపాటు వారి వెనుక ఉన్న శక్తులను కూడా ఎక్కడ ఉన్నా లాక్కొచ్చి కటకటాల వెనక్కిపంపుతాం, రామతీర్థంలో అమాయకులపై పెట్టిన తప్పుడు కేసులను మన ప్రభుత్వం రాగానే ఎత్తేస్తామని యువనేత లోకేష్ భరోసా ఇచ్చారు.
మరిన్ని వార్తలు చూడండి:
అమెరికాలో భారతీయుల మరణాలు పెరిగిపోతున్న వేళ వెలుగుచూసిన దారుణం! USAలో మరో భారతీయుడు మృతి
పిచ్చిపిచ్చి కూతలు కూస్తే పరిష్కారం ప్రజలే !! చంద్రబాబు మాస్ స్పీచ్!!
రాజధాని ఫైల్స్'కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!!
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
#2024JaganNoMore #RamaTeerdham #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #NaraLokesh #RamMandir
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.