కోర్టుకు వెళ్ళిన కోడి కత్తి శ్రీను!! జగన్ ను కాపాడాలనే... అర్థం కాని వాదనలా ??

Header Banner

కోర్టుకు వెళ్ళిన కోడి కత్తి శ్రీను!! జగన్ ను కాపాడాలనే... అర్థం కాని వాదనలా ??

  Tue Feb 20, 2024 13:56        Politics

విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. పలు షరతులతో బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కేసు విచారణలో భాగంగా శ్రీను తొలిసారి కోర్టుకు హాజరయ్యాడు. ఎన్ఐఏ కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో ఎన్ఐఏ ఇన్ఛార్జ్ కోర్టులో విచారణ జరిగింది. కేసు తదుపరి విచారణను ఎన్ఐఏ ఇన్ఛార్జ్ కోర్టు ఏప్రిల్ 19కి వాయిదా వేసింది. 

చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే... 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం: నారా భువనేశ్వరి

ఈ సందర్భంగా దళిత ఐక్యవేదిక నాయకుడు బూసి వెంకట్రావు మాట్లాడుతూ... సీఎం జగన్ ప్రతిసారి ఏదో కారణం చెప్పి కోర్టుకు హాజరు కావడం లేదని విమర్శించారు. ఈ దాడిలో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ సైతం ఇప్పటికే తేల్చి చెప్పిందని అన్నారు. అయినా కోర్టు ఎందుకు వాదనలు కొనసాగిస్తోందో అర్థం కావడం లేదని చెప్పారు. జగన్ ను కాపాడాలని చూస్తున్నారేమో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీమ్ మాట్లాడుతూ... జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇస్తే 90 శాతం కేసు క్లోజ్ అవుతుందని అన్నారు. ఎన్నికలకు ముందే కేసు క్లోజ్ అయ్యేలా ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ కేసులో పాలు ఏవో, నీళ్లు ఏవో తేలుస్తామని చెప్పారు.

 

ఇవి కూడా చదవండి:

అమెరికాలో భారతీయుల మరణాలు పెరిగిపోతున్న వేళ వెలుగుచూసిన దారుణం! USAలో మరో భారతీయుడు మృతి

ఎన్నారై టీడీపీ USA రాయలసీమ స్పోక్స్ పర్సన్ గా చెంచు వేణుగోపాల్ రెడ్డి!

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ!!

పిచ్చిపిచ్చి కూతలు కూస్తే పరిష్కారం ప్రజలే !! చంద్రబాబు మాస్ స్పీచ్!!

మీరు చొక్కాలు మడతపెడితే మా వాళ్లు కుర్చీలు మడతపెడతారు ఖబడ్దార్: చంద్రబాబు

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group

 


   #KodiKattiSrinu #YSJagan ##2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh