సూక్ష్మ ప్రణాళికల అమలుతో పోలింగ్ నమోదు శాతాన్ని పెంచండి -ముకేష్ కుమార్ మీనా

Header Banner

సూక్ష్మ ప్రణాళికల అమలుతో పోలింగ్ నమోదు శాతాన్ని పెంచండి -ముకేష్ కుమార్ మీనా

  Thu Feb 22, 2024 19:53        Politics

సూక్ష్మ ప్రణాళికల అమలుతో పోలింగ్ నమోదు శాతాన్ని పెంచండి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా

ఏలూరు,: రాష్ట్రంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ నమోదు శాతాన్ని నూటికి నూరుశాతం పెంచే దిశగా స్థానికంగా ఉన్న ఓట్లన్నీ స్వీప్ చేసే సూక్ష్మ ప్రణాళికలను అమలు పర్చాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా జిల్లాల స్వీప్ నోడల్ అధికారులను ఆదేశించారు.

 

మంత్రి ధర్మాన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లిన అచ్చెన్నాయుడు! 

 

భారత ఎన్నికల సంఘం స్వీప్ అధికారుల బృంధం రాష్ట్రానికి గురువారం వచ్చిన సందర్బంగా వెలగపూడి లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం లో క్రమబద్దమైన ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాల (SVEEP – Systematic Voters’ Education & Electoral Participation) అమలు పై అన్ని జిల్లాల స్వీప్ నోడల్ అధికారులతో (SVEEP Nodal Officers) 21 మార్చి సమీక్షా సమావేశం జరిగింది.

 

కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ 

 

ఈ సమీక్షా సమావేశం ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా పాల్గొని అన్ని జిల్లాల స్వీప్ నోడల్ అధికారులకు దిశ, నిర్థేశం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో స్వీప్ ప్రణాళికలు ఉన్నాయని, వాటి అమలుకు భారత ఎన్నికల సంఘం అత్యంత ప్రాధాన్యత నిస్తున్నదన్నారు. అయితే జిల్లా స్థాయిలో పాటు నియోజక వర్గాలు, పోలింగ్ స్టేషన్ల స్థాయిల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్వీప్ సూక్ష్మ ప్రణాళికలను రూపొందించి అమలు పర్చాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పట్టణాల్లో అపార్టుమెంట్లలో నివాసం ఉండేవారు, పలు కంపెనీల్లో పనిచేసే కార్మికులు, ఐ.టి. ఉద్యోగులు, విద్యార్థులు మరియు గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా శ్రద్ద చూపడం లేదన్నారు. ఇటు వంటి వర్గాల వారికి ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల విద్య పై అవగాహ కల్పించి, వారిని కూడా ఎన్నికల్లో పెద్ద ఎత్తున భాగస్వాములను చేసేందుకు అనువైన సూక్ష్మ ప్రణాళిలను రూపొందించి అమలు పరిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఈ విధంగా స్వీప్ నోడల్ అధికారులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలోని సామాన్య ప్రజలను చైతన్య వంతులను చేసి ఎన్నికల ప్రక్రియలో కీలక భాగస్వామ్యుల ను చేయాలని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

 

వైసీపీ పరిపాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి -అచ్చెన్నాయుడు  

 

 

ఏలూరు జిల్లాలో అమలు పరుస్తున్న ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను ఏలూరు జిల్లా స్వీప్ నోడల్ అధికారి తూతిక.శ్రీనివాస్ విశ్వనాధ్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా భారత ఎన్నికల సంఘం అధికార బృంధం సభ్యులకు వివరించారు.

 

మంత్రి అమర్నాథ్ చిత్రపటానికి కోడిగుడ్డులతో కొట్టిన టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు!! కారణం అదేనా!! 

 

సమావేశంలో భారత ఎన్నికల సంఘం స్వీప్ అధికారుల బృంధం సభ్యులు రాహుల్ కుమార్, ఆర్.కె.సింగ్ తో పాటు అదనపు సీఈవో ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, డిప్యూటీ సీఈవో ఎస్.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

 

ఇవి కూడా చదవండి: 

అమెరికా నుండి టీడీపీ ప్రచారానికి వచ్చిన NRI ఆకస్మిక మృతి!! 

 

యలమంచిలి మండలం లక్ష్మీపాలెంలో నిమ్మల రామానాయుడు పర్యటన! 27 సంక్షేమ పథకాలు రద్దుచేశారు 

 

శాంతి భద్రతలపై కేంద్రానికి గవర్నర్ కీలక నివేదిక! మారనున్న రాష్ట్ర పరిణామాలు? 

 

రైతుల ఆందోళనలో యువరైతు మరణం!! తాత్కాలిక బ్రేక్!! 

 

విశాఖ ఆర్కేబీచ్‍లో మిలన్-2024 విన్యాసాలు! పాల్గొననున్న 50 దేశాలు!! 

 

మార్చి 3న రాష్ట్ర వ్యాప్తంగా పోలియో చుక్కలు!! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #pravasi #TeluguPravasi #TeluguMigrants #AndhraMigrants #Tdp #TDPparty #Politics #Acchennaidu #YCP #APCM #Elections #AndhraPradesh #APElections #ElectionCommissioner