రాజధాని FILES - సాధారణ ప్రేక్షకుడి రేటింగ్!

Header Banner

రాజధాని FILES - సాధారణ ప్రేక్షకుడి రేటింగ్!

  Fri Feb 23, 2024 19:09        Cinemas

రాజధాని FILES

రేటింగ్... మంజు యణమధల

కాలంనాడెప్పుడో అమెరికాలో ఉన్నప్పుడు “అతడు” సినిమాకి గ్రేట్ ఆంధ్రా వెబ్ సైట్ వారు ఇచ్చిన రేటింగ్ చూసి చాలామంది సినిమా చూడాలా వద్దా అన్న సందిగ్ధంలో పడిపోయారు ఒకటి రెండు రోజులు. మెుదటి షో కి వచ్చిన వారిలో సినిమా చూసి తిరిగి వెళ్ళేటప్పుడు ఏ ఒక్కరి నోటి నుండి కూడా సినిమా గురించి బాలేదు అన్న మాట వినబడలేదు. సినిమా ఇంత బావుంటే ఈ గ్రేట్ ఆంధ్రా వాడేంటి ఇలా రేటింగ్ ఇచ్చాడన్న మాటలే వినబడ్డాయి. అప్పటి నుండి ఆ సైట్ వాడి రేటింగ్ ని జనాలు నమ్మడం మానేసారు. వారు ఒక్కరి సినిమాలకు మాత్రమే ఐదు రేటింగ్ ఇచ్చేవారు అప్పట్లో.

 

మరి కొన్ని తాజా సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

ప్రేక్షకుడు తను చూసిన సినిమా గురించి తన ఫీల్ చెప్తాడు. మన చేతి ఐదు వేళ్లు ఒకేలా లేవు కదా. చాలామంది పెద్ద పెద్ద సిని విమర్శకులు “రాజధాని FILES” సినిమా గురించి తమ తమ అభిప్రాయాలు చెప్తూ రేటింగ్స్ ఇస్తున్నారు. తప్పు లేదు వారి అభిప్రాయం వారు చెప్తున్నారు ఇన్నాళ్ళ సిని చరిత్రను అనుసరించి.

 

సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్! 

 

అప్పటి “ప్రతిఘటన” సినిమా గురించి ఇప్పటి “రాజధాని FILES” గురించి మాట్లాడటం మెుదలుబెడితే అది సమస్య గురించి ప్రతి ఒక్కరికి తెలియాలన్న తపన, దానికి తమ వంతు బాధ్యతగా చెప్పిన పరిష్కారం మనకు కనబడుతుంది. రైతుని గౌరవించే ప్రతి మనసుకు ఈ “రాజధాని FILES” సినిమా నచ్చేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 

 

'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' మూవీ రన్ టైమ్ ఎంతో తెలుసా! 

 

సదరు సినీ విమర్శక పెద్దలు మూడు రేటింగ్ ఇచ్చినా, అసలు ఇవ్వక పోయినా రైతు కష్టం, రైతు మీద అభిమానం, గౌరవం వున్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూస్తారు, చూడాలి కూడా. ఈ సమస్య ఈరోజు ఈ ప్రాంతంది కావచ్చు. రేపు మీది కాదన్న గ్యారంటీ వుందా!

 

'గేమ్ ఛేంజర్' మూవీ షూటింగ్ పై తాజా అప్డేట్! 

 

 

కమర్షియల్ సినిమాల్లా హీరోయిన్ ని చూపించడం లాంటి పనులు ఈ సినిమాలో లేవు. ఏది ఎంత వరకు చెప్పాలో, ఎలా చెప్పాలో, ఏ మాట ఎక్కడ వాడాలో, ఎవరిని ఎలా చూపించాలో లాంటి అదను, పదును బాగా తెలిసిన వ్యక్తిగా డైరెక్టర్ భానుశంకర్ గారు కృతకృత్యులయ్యారు. ఈసమాజంలోని వ్యక్తిగా ఎవరూ చేపట్టని బాధ్యతను తన భుజాల మీద వేసుకుని ధైర్యంగా రాసుకున్న స్క్రీన్ ప్లే కి ప్రేక్షకుడు హాట్సాఫ్ చెప్పక తప్పదు.

 

పగనట్టిన దెయ్యం దగ్గరికే పరిగెత్తుకు వెళితే.. భయపెట్టనున్న 'వళరి'.! OTT పైకి వచ్చేసిన సినిమా! 

 

దివిసీమ రైతుబిడ్డగా తన ప్రాంతపు బుుణాన్ని ఈ “రాజధాని FILES” సినిమా తీసి రవిశంకర్ కంఠమనేని గారు తీర్చేసుకున్నారు. రవిశంకర్ గారు ప్రపంచంలో ఎవరు ఇవ్వలేని కానుకను మీరు రైతులకు ఇచ్చారు. రైతులందరు మీకు కృతజ్ఞులు. ఈరోజుల్లో ఇంట్లో సమస్యలనే పట్టించుకోని వారు బోలెడుమంది. తనతో పుట్టి పెరిగిన బంధాలను సమస్యలలోనికి నెట్టి ఆనందించేవారు మరికొందరు. సమస్య మనది కాదు కదా మనకెందుకులే అని చూసి చూడనట్టు పోయే ఇరుగు పొరుగు వున్న సమాజం మనది.

 

OTT పైకి 'శీష్ మహల్' మూవీ!! తెలంగాణ నేపథ్యంలో నడిచే కథ.. 

 

రాజధాని రైతులను అవహేళన చేసిన టీ వి యాంకర్లు, రాజకీయ పార్టీలు, కొందరు వెధవలు ఈ సినిమా తప్పక చూడండి. మీరేంటి అన్నది కనబడుతుంది. ఏదేమయినా, ఎవరేమనుకున్నా ఓ మంచి సినిమా “రాజధాని FILES”. మనిషన్న వాడు చూడాల్సిన సినిమా.

 

ఇవి కూడా చదవండి:   

కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ 

 

పోలింగ్ బూత్ ల మార్పుపై ఏపీ హైకోర్టులో విచారణ 

 

పేదలను దగా చేసిన జగన్ మళ్ళీ వస్తే జీవితాలు విచ్ఛిన్నమే: రామానాయుడు

 

టీడీపీ ఎమ్మెల్సీ ఆశోక్ బాబును పరామర్శించిన చంద్రబాబు!! 

 

బీజేపీ మెడలు వంచుతామన్న జగన్! ఒక్క పోరాటం కూడా చేయలేదు -వైఎస్ షర్మిల 

  

సీపీఎస్ ఉద్యోగులపై చిరాకు పడిన మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Pravasi #TeluguPravasi #Movies #NewMovies #LatestMovies #MovieNews #SushanthSingh #Bollywood #Tollywood #RajadhaniFiles #TeluguMovie