జనసేన అభ్యర్థుల పూర్తి వివరాలు! 5 స్థానాలలో!

Header Banner

జనసేన అభ్యర్థుల పూర్తి వివరాలు! 5 స్థానాలలో!

  Sat Feb 24, 2024 19:46        Politics

జనసేన అభ్యర్థుల వివరాలు

• తెనాలి
పేరు: శ్రీ నాదెండ్ల మనోహర్. వయసు: 58 సం. విద్యార్హత : ఎం.బి.ఎ.
నేపథ్యం: తెనాలి నుంచి రెండు దఫాలు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తెనాలి నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్రను చూపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సభాపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించి అందరి మన్ననలు పొందారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

 

టీడీపీ-జనసేన మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించింది -బోండా ఉమ 

 

• నెల్లిమర్ల
పేరు: శ్రీమతి లోకం మాధవి. వయసు : 54 సం. విద్యార్హత : ఎం.ఎస్.
నేపథ్యం : ఇస్రోలో ప్రోగ్రామర్ గా, ఫోర్డ్ కంపెనీలో డేటా ఆర్కిటెక్ట్ గా సేవలు అందించారు. అనంతరం మిరాకిల్ సాఫ్ట్ వేర్ సిస్టమ్స్ సంస్థను స్థాపించారు.. మిరాకిల్ పేరుతో విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. 2019లో నెల్లిమర్ల నుంచి జనసేన తరఫున పోటీ చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

 

తొలి జాబితాలో జనసేన అధినేత ట్విస్ట్ !! 

 

• అనకాపల్లి
పేరు: శ్రీ కొణతాల రామకృష్ణ. వయసు: 67 సం. విద్యార్హత : ఎం.కాం.
నేపథ్యం : రెండు దఫాలు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

 

118 అభ్యర్థులలో యువతకి, మహిళకి ప్రాధాన్యం! లిస్టు లో PHD, IAS, డాII, పిజీ, డిగ్రీ వారు! వీరే విజయానికి బాట! 

 

• కాకినాడ రూరల్
పేరు: శ్రీ పంతం నానాజీ. వయసు : 62. విద్యార్హత : ఇంటర్మీడియెట్
నేపథ్యం: 2019లో కాకినాడ రూరల్ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యునిగా, కాకినాడ రూరల్ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా పని చేశారు.

 

ఎమ్మెల్యేలు, మంత్రులకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి! ప్రజలకు అందుబాటులో ఉంటారా?  

 

• రాజానగరం
పేరు: శ్రీ బత్తుల బలరామకృష్ణ. వయసు : 50 సం. విద్యార్హత : 10వ తరగతి
నేపథ్యం: వ్యాపారాలు నిర్వర్తిస్తున్నారు. ఈయన ప్రస్తుతం రాజానగరం అసెంబ్లీకి జనసేన పార్టీ ఇంచార్జ్ గా బాధ్యతలు చూస్తున్నారు. ఈయన భార్య గాదరాడ-2 నుంచి ఎం.పి.టి.సి.గా ఉన్నారు.

 

ఇవి కూడా చదవండి:   

రాష్ట్ర బాగు కోసమే టీడీపీ-జనసేన పొత్తు -అయ్యన్నపాత్రుడు

 

కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ  

 

ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో పెమ్మసాని పరిచయ కార్యక్రమం!! 

 

రాజమండ్రి రూరల్ స్థానానికి బుచ్చయ్యచౌదరి పేరు ఖరారు! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 



   #AndhraPravasi #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants #Politics #TDP #YCP #YCPparty #AndhraPradesh #APPolitics #JSP #TDPJSPTogether #Elections