మరణించిన వ్యక్తి పేరిట ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలా, ఎవరు సబ్మిట్‌ చేయాలి?

Header Banner

మరణించిన వ్యక్తి పేరిట ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలా, ఎవరు సబ్మిట్‌ చేయాలి?

  Thu Feb 29, 2024 12:18        Business

ITR 2024: 

మరణించిన వ్యక్తి పేరిట 'పన్ను చెల్లించదగిన ఆదాయం' (Taxable income) ఉంటే, ఆదాయ పన్ను చట్టం (Income Tax Law) ప్రకారం రిటర్న్ దాఖలు చేయాలి.

 

మరణించిన వ్యక్తి పేరిట ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలా, ఎవరు సబ్మిట్‌ చేయాలి?

Income Tax Return Filing 2024 - Deceased Person: మరణించిన వ్యక్తి కూడా ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయవలసి ఉంటుంది. ఇది నిజం. చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగొస్తాడు, ITR ఎలా ఫైల్‌ చేస్తాడు?.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

మరణించిన వ్యక్తి పేరిట 'పన్ను చెల్లించదగిన ఆదాయం' (Taxable income) ఉంటే, ఆదాయ పన్ను చట్టం (Income Tax Law) ప్రకారం రిటర్న్ దాఖలు చేయాలి. మరణించిన వ్యక్తి పేరిట అతని చట్టబద్ధ వారసుడు (legal heir) ఆదాయ పన్ను పత్రాలు సమర్పించాలి.

 

మరణించిన వ్యక్తి తరపున ఆదాయ పన్ను పత్రాలను ఇంట్లో కూర్చొనే దాఖలు చేయవచ్చు. చనిపోయిన వ్యక్తి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ముందు, చట్టబద్ధ వారసుడు తనను తాను లీగర్‌ హైర్‌గా రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆ వ్యక్తి జీవించి ఉన్న రోజు వరకు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయాలి. మినహాయింపునకు మించి ఆదాయం ఉంటే, వర్తించే స్లాబ్‌ స్టిస్టమ్‌ ప్రకారం పన్ను చెల్లించాలి. ఒకవేళ టాక్స్‌ రిఫండ్‌ ఉంటే, దానిని కూడా క్లెయిమ్ చేయవచ్చు.

 

పన్ను పరిధిలోకి వచ్చి కూడా ఐటీఆర్‌ ఫైల్‌ చేయకపోతే, జీవించి ఉన్న వ్యక్తి విషయంలో ఆదాయ పన్ను విభాగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, చనిపోయిన వ్యక్తి విషయంలోనూ అదే పద్ధతి పాటిస్తుంది.

 

బ్యాంక్‌, పోస్టాఫీస్‌ ఖాతాదార్లకు అలెర్ట్‌ - మార్చి 31లోగా ఈ పని చేయకపోతే జరిమానా 

 

మరణించిన వ్యక్తి పేరిట ITR ఫైల్ చేయడానికి చట్టబద్ధ వారసుడిగా ఎలా నమోదు చేసుకోవాలి?

ముందుగా, www.incometaxindiaefiling.gov.in/home లింక్‌ ద్వారా ఇన్‌కమ్‌ టాక్స్‌ పోర్టల్‌లోకి వెళ్లండి.

 

మీ యూజర్‌ ఐడీ (PAN), పాస్‌వర్డ్‌తో లాగిన్ చేసి, 'మై అకౌంట్‌'లోకి వెళ్లండి.
ఆ తర్వాత మిమ్మల్ని రిప్రజెంటివ్‌గా నమోదు చేసుకోండి.

 

ఇప్పుడు న్యూ రిక్వెస్ట్‌లోకి వెళ్లి కంటిన్యూ చేయండి.

 

సుకన్య సమృద్ధి యోజన పథకంలో మీ పెట్టుబడికి భారీ ఆదాయం! పన్ను ఆదా! 

 

మరణించిన వ్యక్తి పాన్‌, పేరు, బ్యాంక్ అకౌంట్‌ నంబర్‌ వంటి వివరాలు ఫిల్‌ చేయండి.
రిక్వెస్ట్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్‌ పరిశీలించి ఆమోదిస్తుంది.

 

మరణించిన వ్యక్తికి సంబంధించిన ITR ఎలా ఫైల్ చేయాలి?

 

ఐటీ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్న తర్వాత ITR ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
.ఆ ఫామ్‌లో అడిగిన అన్ని వివరాలను నింపాలి.

 

ఈ బ్యాంకులో 1001 డేస్ స్పెషల్ స్కీమ్! 9.5 శాతం వడ్డీ! రూ.5 లక్షలకు ఎంతొస్తుంది? 

 

ఇప్పుడు, ఆ ఫామ్‌ను XML ఫైల్‌ ఫార్మాట్‌లోకి మార్చండి. ఎందుకంటే, ఆ ఫైల్‌ను XML ఫార్మాట్‌లో మాత్రమే అప్‌లోడ్ చేయగలరు.

 

పాన్ కార్డ్ వివరాలు అడిగిన కాలమ్‌లో, చట్టబద్ధ వారసుడి (legal heir) వివరాలు ఇవ్వాలి.
ఇప్పుడు ITR ఫామ్ రకం, అసెస్‌మెంట్ ఇయర్‌ ఆప్షన్స్‌ ఎంచుకోండి.

 

XML ఫార్మాట్‌లోని ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి.

 

చివరిగా, డిజిటల్‌ సైన్‌ ద్వారా ఐటీఆర్‌ సబ్మిట్‌ చేయండి.

 

గత ఐదేళ్లలో బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్ ఇవే! 

 

ముందుగా ఆదాయాన్ని లెక్కించండి

 

మరణించిన వ్యక్తి పేరిట రిటర్న్ ఫైల్ చేసే ముందు అతని ఆదాయాలు, వ్యయాలు, పెట్టుబడులు, లాభనష్టాలు వంటివన్నీ లెక్కగట్టాలి. ITR ఫైల్‌ చేసే ముందు బతికున్న వ్యక్తి ఎలాంటి లెక్కలు వేసుకుంటాడో, మరణించిన వ్యక్తి విషయంలోనూ అలాగే లెక్కలు వేయాలి. ఆ తర్వాత IT రిటర్న్ దాఖలు చేయాలి.

 

ఇవి కూడా చదవండి: 

జగన్ అక్రమాస్తుల పిటిషన్లు తేల్చాలి!! తెలంగాణ హైకోర్టు సిబిఐ కు కీలక ఆదేశాలు 

 

వైసీపీ 8వ జాబితా విడుదల!! 

 

ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు చేదు అనుభవం!! 

 

వైసీపీ ఫేక్ ప్రచారంపై మండిపడుతున్న టీడీపీ నేతలు!! 

 

ఇవాళ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం! 100 నుంచి 120 మందితో తొలి జాబితా.. 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants #BusinessNews #BankRates #InterestRates #ITR #IncomeTax #IncomeTaxReturn