ఖతార్ లో ఎన్నికల శంఖారావం సభ.. భారీగా హాజరైన ప్రవాసులు..

Header Banner

ఖతార్ లో ఎన్నికల శంఖారావం సభ.. భారీగా హాజరైన ప్రవాసులు..

  Sat Mar 02, 2024 16:08        India, Politics, Qatar

ఖతార్ లో ఎన్నికల శంఖారావం సభ ఎన్.ర్.ఐ తెలుగుదేశం మరియు జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రవాసులు ఈకార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని జయప్రదం చేసారు.

మాతెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపనతో ప్రారంభమైన సభ, తెలుగుదేశం / జనసేన జండాలతో, అద్భుతమైన నాయకుల ప్రసంగాలతో శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 

ఇంకా చదవండి: హత్యలు చేసే వ్యక్తి నాయకుడిగా ఉంటే.. ప్రజల పరిస్థితి ఏంటి? ఇది నా కోసమే, పవన్ కళ్యాణ్ కోసమే: చంద్రబాబు

 

ఈసందర్భంగా ఖతార్ తెలుగుదేశం అధ్యక్షులు గొట్టిపాటి రమణయ్య మాట్లాడుతూ.. ఖతార్ తెలుగుదేశం అందించిన సేవలను గుర్తుచేశారు. ఆపదలలో ఉన్నవారికి షుమారు 17 మందికి మెడికల్ సహాయం చేయుటలో సహకరించిన వారికీ, అలాగే ఎన్టీఆర్ కాంటీన్లకు సహకరించినవారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేసారు. రాబోయే ఎన్నికలలో ప్రవాసుల పాత్ర ఎంతో కీలకమనీ, ప్రతిఒక్క ప్రవాసుడు తన జన్మభూమి ఋణం తీర్చుకొనే సమయం ఆసన్నమైందని, తప్పక తమవంతు సేవ రాష్ట్రానికి అందించాలని, తెలుగుదేశం / జనసేన అభ్యర్థులను గెలిపించుటకు శ్రమించాలని విజ్ఞప్తి చేసారు.

జనసేన కన్వీనియర్ జికె దొర మాట్లాడుతూ.. పొత్తులో భాగంగా ఎన్నిసీట్లలో ఎవరు ఎక్కడనుంచి పోటీచేయాలో అధినాయకులు నిర్ణయిస్తారని, జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడిచి పార్టీని బలోపేతం చేయవలసిన బాధ్యత ప్రతివక్క జనసైనికుడిదని, రాబోయే ఎన్నికలు, కని.. వినీ.. యెరుగని రీతిలో జరుగుతాయని.. చెడుమీద మంచి గెలవడం కలియుగంలో ఎంతోకష్టతరమైనదని, అందరంకలసికట్టుగా పోరాడితే తప్పా కూటమి గెలుపు సాధ్యంకాదని పిలుపునిచ్చారు. జనసేన ఆవిర్భావ చారిత్రిక అవసరాన్ని గుర్తుచేశారు.

 

ఇంకా చదవండి: పిఠాపురం నుంచి పవన్ పోటీ అన్న ప్రచారంతో వైసీపీలో గుబులు! టికెట్ ఇవ్వకుండా అవమానించారని..

 

NRI టీడీపీ ఉపాధ్యక్షులు మద్దిపోటి నరేష్, జీసీసీ కౌన్సిల్ మెంబెర్ మల్లిరెడ్డి సత్యనారాయణ, సీనియర్ లీడర్ శాంతయ్య యలమంచిలి, ఆంజనేయులు ప్రసంగిస్తూ.. రాబోయే ఎన్నికలలో ప్రతివక్క ప్రవాసుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనీ, తమ స్నేహితులు, బంధువులు, తెలిసినివారందరిని ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాలని అభ్యర్ధించారు. ఒకసారి చేసిన తప్పుకు రాష్ట్రం 30 సంత్సరాలు వెనకకు నెట్టబడిందని.. ఈసారి యాదమరిస్తే ఆంధ్రరాష్ట్రంలో మట్టికూడా మిగలదని హెచ్చరించారు.

జనసేన కన్వీనియర్ సత్యం మెడిది, సీనియర్ మెంబెర్స్ వీరబాబు లోవిశేట్టి, సుధాకర్ నందిగాము, మల్లికార్జున, గౌతమ్, అనిల్, నగేష్ తదితరులు మాట్లాడుతూ.. తెలుగుదేశం / జనసేన బంధం శాశ్వితమని, ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన వాటిని  ఖేత్రస్థాయిలో  తిప్పికొట్టడానికి తమ అధినేతలు, కార్యకర్తలు సంసిద్దమని.. హలో ఏపీ.. బై బై ... వైసీపీ అని నినదినచరు..

 

ఇంకా చదవండి: గౌతం గంభీర్ సంచలన నిర్ణయం.. అసలు విషయం ఇదేనంటూ వార్తలు! బీజేపీకి రాంరాం.?

 

NRI టీడీపీ ప్రధాన కార్యదర్శి రవి పొనుగుమాటి, ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ రమేష్ దాసరి, రవీంద్ర, రజని, నాయుడు, రమణ కుమార్, సాయి మోహన్ వారాధిగారి తదితరులు ప్రసంగిస్తూ.. రాబోయే ఎన్నికల కదనరంగంలో తమసత్తా చాటటానికి ప్రవాసులు సంసిద్ధంగా ఉన్నారని.. ఈఎన్నికలు ఆంధ్రరాష్ట్ర భవితకు, భావిపౌరుల బౌషత్తుకు సంభంధించినవాని.. అభిరుద్ది, సంఖేమం, రాష్ట్రరాజధాని, పోలవరం ప్రాజెక్ట్ కల సిద్ధమవ్వాలంటే కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మా ఉద్యోగాలను పార్ట్ టైం గా కూటమి అభ్యర్థుల గెలుపుకోసం ఫుల్ టైం పనిచేస్తున్నామని, అదేరీతిన ప్రతివక్కరు పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్రాన్ని కాపాడాలని, ఇది ఒక చారిత్రిక అవసరమని చెప్పుకొచ్చారు. ఎన్నికలవేళ రాజధాని అమరావతి పేదలు జగన్ ప్రభుత్వానికి గుర్తుకురావడం చూస్తుంటే ఎలా స్పందించాలో అర్ధంకావడం లేదని, వారి జీవితాలను గడిచిన ఐదుఏళ్లగా చిన్నాభిన్నం చేసి ఇప్పుడు ఏదో ఉద్ధరిస్తున్నట్లుగా 5 వేలు ఇచ్చి మెసాగించేప్రయత్నం చేస్తున్నాడని తూర్పారబట్టారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ కృష్ణార్జునులై కౌరవసేన వైసీపీ ని తుదనట్టించి ఆంధ్రరాష్ట్రాన్ని కాపాడటానికి సంసిద్దులై ఉన్నారని.. వారికీ మనం చేయూతనిచ్చి అండగా నిలువవలిసిన సమయం ఆసన్నమైనదని ఉద్ఘాటించారు.

 

 ఇంకా చదవండి: మాచర్లలో ఆటవిక రాజ్యం!! మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్‍ తో తొక్కించి చంపేస్తారా? - నారా లోకేష్

 

సభానిర్వహణలో సహకరించిన సీనియర్ లీడర్ శాంతయ్య యలమంచిలి, రవి పొనుగుమాటి, సాయి మోహన్, రమేష్ దాసరి, రవీంద్ర, రజని, కళ్యాణ్ తదితరులకు  కృతజ్ఞతలు తెలియచేసారు.

 

జై టీడీపీ / జై జనసేన నినాదాలతో, గ్రూప్ ఫొటోలతో  సభను దిగ్విజయంగా ముగించారు..

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!

 

న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!

 

అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!

 

Evolve Venture Capital

 

వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!

 

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!

 

యాత్రా తరంగిణి 12: బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన చిన్ని కృష్ణుడి విగ్రహం! గురువాయూర్‌ ఆలయ ప్రత్యేకతలు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Qatar #QatarMeeting #QatarAppoliticsMeeting #Chandrababu #Pawankalyan #TDP #Janasena #TDPJanasena #AppoliticsInQatar