ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాణి సహా 150 మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరిక! శృంగవరపుకోటలో వైసీపీకి షాక్...

Header Banner

ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాణి సహా 150 మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరిక! శృంగవరపుకోటలో వైసీపీకి షాక్...

  Mon Mar 04, 2024 20:19        Politics

అధికార వైసీపీని వీడి టీడీపీలోకి వస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం వైసీపీలో ఇమడలేమంటూ టీడీపీ వైపు చూస్తున్నారు. తాజాగా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అర్ధాంగి సుధారాణి నేతృత్వంలో వివిధ స్థాయిల వైసీపీ నేతలు నేడు టీడిపిలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో వారంతా టీడీపీలోకి వచ్చారు.

 

ఇంకా చదవండి: చంద్రబాబు: పెనుకొండలో టీడీపీ రా కదలిరా సభ! ఇదేనా జగన్... నీ మార్కు?

 

లోకేశ్ వారికి పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరస్వాగతం పలికారు. ఇందుకూరి సుధారాణి, 15 మంది సర్పంచులు, 17 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కన్వీనర్లతో సహా 150 మంది వైసీపీ నేతలు ఇవాళ భారీ కాన్వాయ్ తో ఉండవల్లిలోని చంద్రబాబు వద్దకు నివాసానికి చేరుకున్నారు. వారందరికీ లోకేశ్ ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలసి పనిచేసే వారికి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పారు.

 

ఇంకా చదవండి: మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!

 

పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చిన వారిని కలుపుకొని టీడీపీ గెలుపు కోసం కృషిచేయాలని కోరారు. గత ఎన్నికల్లో జగన్ ను ప్రజలు నమ్మి 151 సీట్లతో అధికారమిస్తే కోట్లాది ప్రజల ఆశలు, ఆశయాలకు గండికొడుతూ.. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలనను ప్రారంభించారని లోకేశ్ మండిపడ్డారు. యువగళం పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యానని తెలిపారు.

 

ఇంకా చదవండి: క్యాన్సర్ బారిన పడ్డ ఇస్రో (ISRO) చీఫ్!! అప్పటికే ఉంది అంట!!

 

వారి కష్ట, సుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. "చంద్రబాబునాయుడు గారు వస్తున్నా మీకోసం పాదయాత్రలో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకొని 2014-19 నడుమ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

పాదయాత్ర చేసిన జగన్ ప్రజలకు మంచి చేస్తాడని అందరూ భావిస్తే ఆయన మాత్రం విధ్వంసం, వేధింపులు, కక్ష సాధింపులకు ప్రాధాన్యత ఇచ్చారు. జగన్ పాలనలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక సర్పంచ్ లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు తగిన గౌరవంతో పాటు గౌరవ వేతనం పెంచుతాం.

 

ఇంకా చదవండి: నయనతార విడాకులు తీసుకుంటోందా? మరి విఘ్నేశ్ ఇలా పోస్టు చేశాడేంటీ!

 

శంఖారావం కార్యక్రమంలో భాగంగా శృంగవరపుకోట నియోజకవర్గానికి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నా" అంటూ లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారిలో ఎస్.కోట ఎంపీపీ సంధి సోమేశ్వరరావు, ఎంపీటీసీ లాగుడు లక్ష్మి, ఎంపీటీసీ మోపాడ గౌరీశ్వరి, ఎంపీటీసీ-1 దారా గిరి, ఎంపీటీసీ-2 మజ్జి దేవి, ఎంపీటీసీ-4 వాకాడ సింహాచలం, ఎంపీటీసీ-5 మోపాడ సునీత, ఎంపీటీసీ-6 బి.ఆదిలక్ష్మి, ఎంపీటీసీ భోజంకి వెంకటలక్ష్మి, మండల కో-ఆప్షన్ మెంబర్ షేక్ బషీర్, సర్పంచ్ లు సోలుబొంగు కనకం, రామకృష్ణ, సంతోషి కుమారి, వొబ్బిన త్రినాథమ్మ, లాగుడు సూర్యనారాయణ, ఎర్ర సన్యాసిరావు తదితరులు ఉన్నారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా: గత 30 సంవత్సరాలలో టాప్ 3 సమ్మర్ లు!

 

అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!

 

సౌదీ: వివిధ శాఖలలో 126 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్! కారణం ఏమిటి?

 

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు! కేంద్రం ఆమోదం..

 

మూవీ రివ్యూ : ఆపరేషన్ వాలెంటైన్.. వివిధ వార్తా పత్రికల యొక్క మూవీ రేటింగ్ ఇదిగోండి..

 

నేడే పల్స్ పోలియో!! ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరి!!

 

కువైట్: పెళ్లి కాని వారు కూడా హోటల్ రూమ్ బుక్ చేసుకోవచ్చు! బ్యాన్ ఎత్తివేత!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #IndukuriSudharani #IndukuriRaghuraju #TDP #NaraLokesh #ShrungavarapuKota #YSRCP #AndhraPradesh #APPolitics #APNews #TDPNews