యూఏఈ: హిస్టరీ రిపీట్! సరిగ్గా 8 సంవత్సరాల క్రితం! తుఫాను!

Header Banner

యూఏఈ: హిస్టరీ రిపీట్! సరిగ్గా 8 సంవత్సరాల క్రితం! తుఫాను!

  Sun Mar 10, 2024 15:18        Gulf News, U A E

యూఏఈ: సరిగ్గా 8 సంవత్సరాల క్రితం 2016లో మార్చి 9న దేశాన్ని తుఫాన్ అతలాకుతలం చేసింది. ఆ రోజున వడగళ్లతో కూడిన బలమైన తుఫాను ఎమిరేట్స్ ను తీవ్రంగా ప్రభావితం చేసింది. అల్ షువైబ్ వాతావరణ కేంద్రంలో 24 గంటల వ్యవధిలో 287.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అల్ బతీన్ విమానాశ్రయంలో 130 కిమీ వేగంతో గాలులు నమోదు అయ్యాయి. తాజాగా అబుదాబిలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు దుబాయ్ లోని రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) షేక్ జాయెద్ రోడ్ లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు అలెర్ట్ జారీ చేసింది. షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ మరియు ఎమిరేట్స్ రోడ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ప్రయాణికులకు సూచించింది. ఇదిలా ఉండగా భారీ వర్షంతో రస్ అల్ ఖైమా రోడ్డు అతలాకుతలమైంది. అల్ మనీ, షావ్కా, అల్ గలీలా, జైస్, అల్ ఘెయిల్ ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలు ఉన్న లోయలలో చిక్కుకున్న తర్వాత మొత్తం 21 మందిని RAK పోలీసులు రక్షించారు. భారీగా కురుస్తున్న వర్షం కారణంగా షార్జా ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

 

ఇవి కూడా చదవండి:

మోడీ, బాబు, పవన్, మహాసభకు చిలకలూరిపేట వేదిక! 150 ఎకరాలలో! పరిశీలిస్తున్న అధిష్టానం! 

 

తెలుగుదేశం జనసేన పొత్తు పై బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా X! దేశ ప్రగతికి 

 

ప్రజల ఆశీర్వాదంతో టీడీపీ-జనసేన-బీజేపీ విన్నింగ్ టీమ్‌గా నిలిచిపోతుంది -అచ్చెన్నాయుడు 

 

తాడేపల్లిలో నారా లోకేశ్ సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం! 

 

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ఎన్డీఏలోకి స్వాగతిస్తున్నాం -అమిత్‌షా 

 

టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి స్వీప్ చేయడం ఖాయం -చంద్రబాబు 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #UAE #UAENews #UAEupdates #UAECountry #Gulf #GulfNews #GulfCountries #Sharjah #SharjahUpdates #Abudhabi #Dubai #GulfUpdates #DubaiNews #DubaiUpdates