వ‌ర‌ద బాధితుల‌కు దిన‌స‌రి కూలీ రూ. 600 విరాళం! ప్రతీ రూపాయి విలువైనదే అన్న డిప్యూటీ సీఎం!

Header Banner

వ‌ర‌ద బాధితుల‌కు దిన‌స‌రి కూలీ రూ. 600 విరాళం! ప్రతీ రూపాయి విలువైనదే అన్న డిప్యూటీ సీఎం!

  Mon Sep 09, 2024 15:48        Politics

ఏపీలో భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల జీవ‌నం అస్త‌వ్య‌స్తంగా మారింది. చాలా మంది నిరాశ్ర‌యుల‌య్యారు. దీంతో ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో రాజకీయ‌, సినీ ప్ర‌ముఖులు త‌మ‌వంతు సాయం చేస్తూ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా ఓ దిన‌స‌రి కూలీ కూడా ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి విరాళం ప్ర‌క‌టించ‌డం విశేషం. రోజువారీ కూలీ ప‌నులు చేసుకుంటూ బ‌తికే గుడ‌ప‌ర్తి సుబ్ర‌హ్మ‌ణ్యం అనే వ్య‌క్తి రూ. 600 సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చాడు. ఈ విష‌యాన్ని అత‌డు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా వెల్ల‌డించాడు. "ఈరోజు నేను పనికి వెళ్లి సంపాదించిన ఈ 600 విజయవాడ వరద బాధితులకు ఏపీ ముఖ్య‌మంత్రి సహాయ నిధికి పంపిస్తున్నాను. ఆదివారం పని ఉంది. ఆ డబ్బులు కూడా పంపిస్తాను. నాకు స్ఫూర్తి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ గారు. కష్టాలు అనేవి అందరికీ వస్తూ ఉంటాయి. ఆ కష్టం ఏంటన్నది కష్టపడిన వాడికి మాత్రమే తెలుస్తుంది" అని గుడ‌ప‌ర్తి సుబ్ర‌హ్మ‌ణ్యం ట్వీట్ చేశాడు.

 

ఇంకా చదవండి: ఎమ్మెల్యే తృటిలో తప్పిన పెను ప్రమాదం! ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా!

 

ఈ ట్వీట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. సుబ్ర‌హ్మ‌ణ్యంను అభినందిస్తూ స్పెష‌ల్ ట్వీట్ చేశారు. రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుండి వరద బాధితులకు సాయం చేయాల‌నుకున్న‌ మీ ఆలోచన స్ఫూర్తిదాయకం అంటూ జ‌న‌సేనాని ప్ర‌శంసించారు. "రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుండి వరద బాధితులకు సహాయం అందించాలనుకున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం. ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతీ రూపాయి విలువైనదే. అది చిన్నది అని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ. నిస్వార్ధంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి సహాయనిధికి గుడ‌ప‌ర్తి సుబ్ర‌హ్మ‌ణ్యం అందించిన రూ. 600 చాలా విలువైనవి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట్ చేశారు.

 

ఇంకా చదవండి: అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలా? భారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు!

 

ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!

 

స్టార్ హీరోలను మించి! ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!

 

హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #PawanKalyan #APCMReliefFund #AndhraPradesh #Janasena